రంగారెడ్డి

వినియోగదారులకు సకాలంలో రుణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, : వినియోగదారులకు సకాలంలో బ్యాంక్ రుణాలు ఇచ్చేందుకు ఏపీజీవీబీ కొత్త హబ్‌ను ఏర్పాటు చేసినట్లు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ డీ.విశ్వప్రసాద్ వివరించారు. సోమవారం షాద్‌నగర్ ఎపీజీవీబీ బ్యాంక్‌లో కొత్తగా అసెట్ మేనేజ్‌మెంట్ హబ్‌ను ప్రారంభించారు. విశ్వప్రసాద్ మాట్లాడుతూ వినియోగదారులు బ్యాంకుల చుట్టూ తిరగకుండా సకాలంలో రుణాలు ఇచ్చేందుకు ఎపీజీవీబి బ్యాంక్ ఆధ్వర్యంలో కొత్తగా అసెట్ మేనేజ్‌మెంట్ హబ్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. నియోజకవర్గంలోని చటాన్‌పల్లి, నందిగామ, వెల్‌జర్ల, చౌదరిగూడ, కొత్తూరు, ఇన్ముల్‌నర్వ, బూర్గుల, కొత్తపేట, షాద్‌నగర్‌లో ఎలాంటి రుణాలు ఇవ్వలేదని, కొత్తగా ఏర్పాటు చేసిన హబ్‌లోనే అన్ని రకాల రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ హబ్‌లో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్లను ప్రత్యేకంగా నియమించినట్లు వివరించారు. గృహ, మార్టిగేజ్, వాహనాలకు సంబంధించిన అన్నిరకాల రుణాలు ఇచ్చేందుకు ఈ హబ్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. 10రోజుల్లో గృహ రుణాలు, మూడు రోజుల్లో వాహన రుణాలు, 10రోజుల్లో మార్టిగేజ్ రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రైవేట్ బ్యాంకుల కంటే తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు ఎపీజీవీబీ సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. పిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే 7.5, సీనియర్ సిటిజన్లకు 8శాతం వడ్డీ చెల్లించనున్నట్లు తెలిపారు. రీజియన్‌లో 85వేల మంది రైతులకు 549కోట్ల రుణాలు ఇచ్చామని, ఈ హబ్ ద్వారా వెయ్యి కోట్ల వరకు రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ కల్పిస్తున్న అవకాశాన్ని అర్హులైన వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో ఎపీజీవీబీ చీఫ్ మేనేజర్ అడ్వయిజర్ ప్రభాకర్ రావు, హబ్ మేనేజర్ రాజేశ్వర్ రావు, అసిస్టెంట్ మేనేజర్ వనజాత, స్థానిక మేనేజర్ రవికాంత్ పాల్గొన్నారు.

టిక్కెట్ ఎవరికి దక్కేనో.. ఖరారు కాని పొత్తులు

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల నేతల చూపు ఉప్పల్ నియోకవర్గం పై పడింది. పొత్తులు ఖరారు కాకపోయినా టిక్కెట్ కోసం చేస్తున్న చేస్తున్న ప్రయత్నాలు ఎవరికి వరిస్తాయోనని ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. టీఆర్‌ఎస్ ఇప్పటికే 105 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థులను ఖంగు తినిపించారు. ఉప్పల్ నియోజకవర్గం నుంచి గతంలో పోటీ చేసి ఓటమి పాలైన బేతి సుభాష్ రెడ్డికే తిరిగి టిక్కెట్ ఇస్తున్నట్లు ప్రకటించారు. బేతి అభ్యర్థిత్వంపై నియోజకవర్గంలోని పార్టీకి చెందిన కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూ అతనికి మద్దతు ఇవ్వకుండా ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి ఇప్పటికే కొందరు సీనియర్ నేతలు ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ రెడ్డి, నందికొండ శ్రీనివాస్ రెడ్డి, సల్ల వీరారెడ్డి, కార్పొరేటర్ భర్తలు టిక్కెట్ ఆశించిన విషయం తెలిసిందే. చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్‌గా గెలిచి మేయర్ పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న బొంతు రామ్మోహన్ సైతం ఎమ్మెల్యే ఉప్పల్ సీటుపై కనే్నసి అధిష్టానంపై ఒత్తిడీ తీసుకొచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఇదే స్థానం నుంచి మేయర్ బొంతు రామ్మోహన్‌కే టిక్కెట్ ఇవ్వాలని ఇప్పటికే కొందరు కార్పొరేటర్ భర్తలు, ఆశావహులు కొందరు విలేఖరుల సమావేశంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌ను కోరారు. కాంగ్రెస్‌లో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తూ పొత్తులో భాగంగా ఎమ్మెల్యే టిక్కెట్ దక్కదని భావించిన బండారు లక్ష్మారెడ్డి గుడ్‌బై చెప్పి టీఆర్‌ఎస్‌లో చేరారు. లక్ష్మారెడ్డి సైతం ఇదే పార్టీనుంచి ఎమ్మెల్యే టిక్కెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.