తెలంగాణ

వెన్నుతట్టిన ప్రోత్సాహం.. ఉప్పొంగిన ఉత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఏప్రిల్ 5: ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూడలేదు ఆ గ్రామస్థులు. మిషన్ భగీరథలో సమష్టిగా భాగస్వాము లయ్యారు. పనుల్లో పాలుపంచుకుని ఒకేరోజు రికార్డు స్థాయలో 350 నల్లా కనెక్షన్లను శ్రమశక్తితో సాధించుకున్నారు. కలెక్టర్ రొనాల్డ్ రాస్ ప్రోత్సాహం మెండుగా ఉండటంతో గ్రామస్థుల ఉత్సాహానికి ఆకాశమే హద్దు అయంది. ఇంకేముంది... సగం సగం పనులతో ఆగిపోయన నల్లా కనెక్షన్లు ఏకధాటిగా ఒకేరోజు పూర్తయపోయాయ. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మారుమూల మల్కాపూర్ ఈ చారిత్రక ఘట్టానికి వేదిక అయంది. ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధ్యమేనని గ్రామస్థులు నిరూపించి ఆదర్శంగా నిలిచారు. దేశాభివృద్ధికి యువతే పునాది అన్న నినాదంతో గ్రామానికి చెందిన యువకులంతా ఈ పనిలో పాలుపంచుకున్నారు. గ్రామం మొత్తం 3.5 కిలోమీటర్ల ప్రధాన పైపులైన్లను నిర్మించడానికి జెసిబిలతో కాలువలు తవ్వారు. ఇంటింటికి నల్లా ఇవ్వడానికి పైపులైన్లు బిగించాల్సి ఉంది. పనిలో జాప్యం కాకుండా ఒకే రోజు పూర్తి చేయాలన్న లక్ష్యంతో అందరూ నడుం బిగించి కిలోమీటర్ల దూరం పైపులను లాక్కువెళ్లి కాలువల్లో బిగించి పూడ్చి వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటి ముంగిలి వరకు కూడా జెసిబిలే గుంతలు తవ్వడంతో సాంకేతిక నిపుణుల సహకారంతో నల్లా కనెక్షన్లు బిగించారు. మల్కాపూర్ గ్రామాన్ని కలెక్టర్ దత్తత తీసుకుని ఇంటింటికి మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తి చేయించారు. వాటి వినయోగంపై కూడా ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ గ్రామీణుల్లో చైతన్యం కల్పిస్తున్న రాస్ గ్రామాభివృద్ధికి జ్ఞాన జ్యోతి అయ్యాడని చెప్పడంలో అతిశయోక్తిలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి ఇంట్లోకి నల్లా కనెక్షన్ కార్యక్రమాన్ని పూర్తి చేయించడానికి కలెక్టర్ కంకణం కట్టుకున్నారు. సాయంత్రం మరో దఫా గ్రామాన్ని సందర్శించి పనులు పూర్తికాగానే గ్రామస్తులను అభినందించారు. ఈ నెలాఖరులోగా గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాలకు గోదావరి నీటిని అందించనుండటంతో అన్ని గ్రామాలకంటే ముందుగానే మల్కాపూర్ గ్రామంలో ఇంటింటికి నల్లా కనెక్షన్ వచ్చేసింది. గోదావరి నీటిని ట్యాంకులోకి ఎక్కించి కనెక్షన్ ఇవ్వడమే తరువాయిగా మల్కాపూర్ వాసులు స్వచ్ఛమైన నీటిని సేవించడానికి సిద్ధమయ్యారని చెప్పవచ్చు.

ఇద్దరు రైతుల ఆత్మహత్య
ఇల్లంతకుంట/తిమ్మాజిపేట, ఏప్రిల్ 5: వేసిన పంటలకు దిగుబడి రాక చేసిన అప్పులు తీరేది ఎలా అని మనస్తాపంతో జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలోని ముస్కానిపేట గ్రామానికి చెందిన రామమోహన్ రెడ్డి (58) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మాజిపేట మండల పరిధిలోని అప్పాజిపల్లి జల్లి తిరుపతయ్య (40) అనే రైతు సోమవారం రాత్రి క్రిమిసంహారక మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు.