రంగారెడ్డి

సంపులో పడి బాలుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, ఏప్రిల్ 9: ఆడుకుంటూ ప్రమాదవశాత్తు సంపులో పడి మృతి చెందిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బిహార్ రాష్ట్రం జహానాబాద్ జిల్లా అభిబల్లిపూర్ గ్రామానికి చెందిన బచ్చన్‌రామ్ కుటుంబ సమేతంగా గత కొంత కాలం క్రితం కోసం కాటేదాన్ పారిశ్రామికవాడకు వలసవచ్చారు. ఆప్కోకాలనీలో కుటుంబ సమేతంగా ఉంటూ స్థానికంగా ఉంటూ జీవనోపాధి కొనసాగిస్తున్నారు. ఇతనికి ఆనంద్‌కుమార్(14) కుమారుడు ఉన్నాడు. నాలుగవ తరగతి వరకు చదివి ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఈనెల 6న ఉదయం 10.30 గంటల సమయంలో ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు వెదికినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఈ నెల 7న మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కాగా 8న రాత్రి ఇంటి ముందున్న సంపులో చూడగా అందులో పడి మృతిచెంది కనిపించాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని సంపులో నుంచి బయటకు తీశారు.