రంగారెడ్డి

సైబరాబాద్‌లోని బాధిత మహిళకు భరోసా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, అక్టోబర్ 15: నిరాదరణకు, వేధింపులకు గురవుతున్న బాధిత మహిళకు భరోసా కేంద్రం అండగా ఉంటుందని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ చెప్పారు. కొండాపూర్ ఏరియా ఆసుపత్రి ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని సీపీ ప్రారంభించారు. సీపీ మాట్లాడుతూ సైబరాబాద్‌లో మహిళ ఉద్యోగులు అధికంగా ఉన్నందునా వేధింపుల కేసులు ఎక్కువ నమోదు అవుతున్నాయని అన్నారు. కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయడం వలన బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకుని భరోసా కేంద్రం ఏర్పాటు చేసామని అన్నారు. మహిళలను వేధించే వారిని అరికట్టేందుకు షీటీమ్, ఆపరేషన్ స్మైల్‌తో పాటు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన చిన్నారులను రక్షించేందుకు ఆపరేషన్ స్మైల్ విభాగం బాగాపని చేస్తుందని తెలిపారు. స్మైల్ విభాగం జనవరి, జూన్ మాసాలలోనే ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తారని సైబరాబాద్‌లో గత 4నెలల నుంచి చేసిన తనిఖీల్లో 300 మంది పిల్లలను రక్షించి తల్లిదండ్రుల వద్దకు చేర్చడం జరిగిందని అన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మహిళకు రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. మహిళ ఫోటోలు మార్పింగ్ చేయడం వంటి ఫిర్యాదులు అధికంగా వస్తున్నందున భరోసా సెంటర్‌లో సైబర్ క్రైం సంబంధించిన అధికారిని నియమించనున్నట్లు సీపీ వెల్లడించారు. బాధిత మహిళలకు వైద్యం, న్యాయ సాయం అందించడంతోపాటు నిపుణులతో కౌన్సిలింగ్ నిర్వహించి భరోసా ఇస్తుందని చెప్పారు. దేశంలో 1.9 శాతం మంది మహిళలు, చిన్నారులు వేధింపులకు గురవుతున్నారని సర్వేలో తెలిందని ఇది ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. భరోసా సెంటర్ 24 గంటలు నిపుణులు అందుబాటులో ఉంటారని బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. షీటీమ్ డీసీపీ అనసూయ మాట్లాడుతూ మహిళను వేధించే వారికి సైకోథెరపీ కౌన్సిలింగ్ ఇస్తున్నామని, గత సంవత్సరం 1067 కేసులు నమోదు కాగా, 2018లో ఇప్పటి వరకు 1200 ఫిర్యాదులు రాగా, 300 ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా, 300 పీటీ కేసులు పెట్టినట్లు అమె వివరించారు. వేధింపులకు గురైన బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని కోరారు. కార్యక్రమంలో క్రైం డీసీపీ జానకీ షర్మిల, ఏడీసీపీలు నర్సిమ్మ, నతానియేల్, ఇందిర, ఎస్‌సీఎస్‌సీ ప్రధాన కార్యదర్శి భరణి అరోరా పాల్గొన్నారు.