రంగారెడ్డి

శాంతియుతంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, అక్టోబర్ 20: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని సుభాష్‌నగర్ డివిజన్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు దేవగారి రాజేందర్ రెడ్డి అన్నారు. సుభాష్‌నగర్ డివిజన్ అపురూపకాలనీలో కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాతా మండపంలో రాజేందర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని వేడుకున్నారు. భగవంతుని ఉత్సవాలు మతసామరస్యానికి ప్రతీక అన్నారు. శాంతియుత వాతావరణంలో ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జగతయ్య, రమణ, గణేశ్, రామారావు, సాయితులసి, మల్లేశ్, ఫణి, శేఖర్ పాల్గొన్నారు.
ఘనంగా దుర్గమాత నిమజ్జనం
పరిగి: దుర్గమాత నిమజ్జనం శనివారం ఘనంగా జరిగింది. పరిగి పట్టణంలోని ప్రజల చేత పూజలు అందుకున్న దుర్గమాత విగ్రహన్ని, కోలాటం, ఆట పాటల మధ్యన దాదాపు అయిదు గంటల పాటు పరిగి పట్టణంలో కనుల విందుగ అమ్మవారి విగ్రహం నిమజ్జనం తరలింది. దుర్గమాత కమిటి సబ్యులు రంగు రంగుల విదుయ్త బల్బులతో అలంకరించి డిజే మధ్యన పాటలతో సాగుతున్న సేపు కాలిని వాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి కాలినిలో వేల మంది మహిళ ఏర్రటి దుస్తులు దరించి అమ్మవారి పాటులు పాడుతు నృత్యాలు చేయడం అందరిని అకట్టుకున్నది. తాజి మాజి ఏమ్మెల్యే సతీమణి ఉమారాంమోహన్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మావారి ఊరేగింపు కన్నుల విందుగ సాగింది. అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు.
ముదిరాజ్ దసరా సమ్మేళనం
మహేశ్వరం: రాష్ట్ర ముదిరాజ్ మహసభ భవనలో నేడు ఆదివారం నిర్వహించే 86 వ దసరా సమ్మేళన కార్యక్రమానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల ముదిరాజ్‌లందరూ భారీగా తరలిరావాలని జిల్లా ముదిరాజ్ సంఘం ఇన్‌చార్జీ కే.చంద్రయ్యముదిరాజ్ పిలుపు నిచ్చారు. సికింద్రాబాద్‌లో న్యూబోయిగూడ ముదిరాజ్ భవనంలో నిర్వహించే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు కాసాని జ్జానేశ్వర్ హాజరుతున్నందున ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలిరావాలని అన్నారు. ముదిరాజ్ సంఘం భవిష్యత్తు ,ప్రణాళిక ఉంటుందని నాయకులు పెద్ద లు రావాలని కోరారు.
కొడంగల్: బతుకమ్మ ముగింపు సంబురాలు కొడంగల్ పట్టణంలోని ఆర్యనగర్‌లో ఘనంగా నిర్వహించారు. చిన్నారులు, మహిళలు బతుకమ్మ పాటలతో, కోలాటం నృత్యాలతో సందడి చేశారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించారు. కాలని వీధుల్లో అంత కలిసి నృత్యాలు చేస్తూ నిమజ్జనానికి తరలి వెళ్లారు.
దౌల్తాబాద్: మండల పరిధిలోని గోఖపస్లాబాద్ గ్రామంలో శనివారం బతుకమ్మ ముగింపు వేడుకలు అంబరాన్నంటాయి. రకరకాల పూలతో పేర్చిన బతుకమ్మలను ఆంజనేయస్వామి దేవాలయం దగ్గర ఉంచి బతుకమ్మ..బతుకమ్మ ఊయ్యాలో... బంగారు బతుకమ్మ ఊయ్యాలో అంటూ ఆడిపాడారు. ముగింపు వేడుకల కారణంగా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మహిళలు ఊరేగింపుగా గండికుంట వరకు చేరుకొని నిమజ్జనం చేశారు.

కేసీఆర్ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు
మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి విమర్శ
బాలాపూర్, అక్టోబర్ 20: తెలంగాణ ప్రజలకు ఎన్నికల సమయంలో అనేక హమీలు ఇచ్చి, గద్దెనెక్కిన కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హమీని కూడ నేరవేర్చకపోవడాన్ని ప్రశ్నిస్తూ కేసీఆర్ చేసిన మోసాన్ని ప్రజలకు వివరిస్తూ చైర్మన్‌గా, ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాను చేసిన అభివృద్ధిని ప్రజలకు గుర్తు చేయడానికి 22 నుంచి నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టన్నుట్లు మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కేసీఆర్ అనేక హమీలు ఇచ్చినట్లు తెలిపారు. పాదయాత్ర ఈ నెల 22 నుంచి ప్రతి కాలనీ, ప్రతి బస్తీ గుండా సాగుతుందని అన్నారు. పాదయాత్ర సమయంలో పూర్తిగా ప్రజల మధ్య ఉంటూ వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ నెల రోజులు ప్రజల మధ్యనే ఉంటానని తెలిపారు. పాదయాత్రలో భాగంగా కాలనీలు, బస్తీలలో నిద్రిస్తూ, వారు పెట్టిన భోజనం తింటూ.. వారి సమస్యలను దగ్గరగా వింటానని అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి, సంక్షేమం ఎల్బీనగర్ ప్రజలకు తెలుసునని అన్నారు. ప్రజల మద్దతుతో ఎల్బీనగర్‌లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు.