రంగారెడ్డి

దేవాదాయ భూములకు హక్కులు :కేటీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాబాద్, అక్టోబర్ 20:సీతారాంపూర్ గ్రామానికి సీతారామ చంద్రస్వామి ఆలయ భూమిని సాగు చేస్తున్న రైతులకు పట్టాదార్ పాసు పుస్తకాలు ఇవ్వాలని శనివారం కేటీఆర్‌ను కలిసి తమ బాధలను వినిపించారు. దేవాలయ భూమిని సాగు చేస్తున్న ప్రతి ఒక్కరికి రైతుబంధు పథకం వర్తించే విధంగా కృషి చేస్తామని హమీ ఇచ్చారు. అందరికీ హక్కు కలిపించే విధంగా అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేవిధంగా చుస్తామని తెలిపారు. గత నాలుగు రోజుల క్రితం చేవెళ్ల ఎంపీ కొండా విశే్వశ్వర్‌రెడ్డి సీతారాంపూర్ రైతులకు సంఘీభావం తెలిపి సమస్య తీరుస్తామన్ని రైతులకు ఇచ్చిన హమీని నెరవేర్చినందుకు రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మెన్ అవినాష్‌రెడ్డి, రైతు సమన్వయ సభ్యులు ప్రభాకర్‌రెడ్డి, నరసింహ్మారెడ్డి, గ్రామ రైతులు పాల్గొన్నారు.
కార్యకర్తలకు సముచిత స్థానం :కూన
జీడిమెట్ల, అక్టోబర్ 20: కష్టపడి పనిచేసే కార్యకర్తకు సముచిత స్థానం కాంగ్రెస్ పార్టీలో ఉంటుందని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. జీడిమెట్ల డివిజన్ కుత్బుల్లాపూర్ గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. షాపూర్‌నగర్‌లో కూన వారికి కాంగ్రెస్ కండువాలను కప్పి ఆహ్వానం పలికారు. శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్‌లో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని చెప్పారు. రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు పరమేశ్, వీరబాబు, రవి, సురేశ్, దన్‌రాజ్, బాలకృష్ణ, అరున్, రాజు, శ్రీహరి, బానుప్రకాష్, శ్రీనివాస్ రావు, అజయ్, నాగరాజు, కేశవ పాల్గొన్నారు.

ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
తలకొండపల్లి, అక్టోబర్ 20: విజయదశమి పర్వదినం పండుగను పురస్కరించుకొని తలకొండపల్లి మండలంలోని వెల్జాల్, ఖానాపూర్ గ్రామాలలో సద్దుల బతుకమ్మ వేడుకలను మహిళలు కన్నుల పండుగగా జరుపుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలను విజయదశమి పండుగకు ఒక్క రోజు ముందు అంతటా నిర్వహిస్తే, తలకొండపల్లి మండలంలోని ఎన్నో సంవత్సరాలుగా దశమి వెళ్ల్లిపోయిన మరుసటిరోజు ఈరెండు గ్రామాలలో సద్దుల బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతుంది. 19న శుక్రవారం బతుకమ్మ వేడుకలు నిర్వహించవలసి ఉండగా, పండితుల సూచన మేరకు శనివారం బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించారు.వెల్జాల్ గ్రామంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు కల్వకుర్తి టీఆర్‌ఎస్ అభ్యర్థి,కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు సీఎల్ శ్రీనివాస్‌యాదవ్ బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైయ్యారు.