రంగారెడ్డి

ప్రజా సంక్షేమమే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, అక్టోబర్ 21: నాలుగేళ్ళ మూడు నెలలు పాలించిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం యువతను మోసగించిందని మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు గడ్డం ప్రసాద్‌కుమార్ విమర్శించారు. ఆదివారం మండలంలోని ధన్నారం, బురాన్‌పల్లి, కామారెడ్డిగూడ, పాతూర్, పుల్సుమామిడి, పీరంపల్లి, కొటాలగూడ, సిద్దులూర్ గ్రామాల్లో బైక్ ర్యాలీతో ఓపెన్ టాప్ జీపులో గ్రామాల ప్రజలకు అభివాదం చేస్తూ పర్యటించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే ఉద్యోగాలిస్తామని ఆశలు కల్పించి, యువతచే ఓట్లు వేయించుకుని అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువతను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తుందని తెలిపారు. వెయ్యి రూపాయల పింఛన్‌ను రెండు వేలు, రూ.1500ల పింఛన్‌ను రూ.3000లకు పెంచనున్నట్లు చెప్పారు. గతంలో నిర్మించిన ఇందిరమ్మ ఇంటికి అదనపు గదితో పాటు, ఇంటి స్థలం పట్టా ఉంటే ఐదు లక్షల రూపాయలను మంజూరు చేయనున్నట్లు, ఎస్సీ, ఎస్టీలకు అదనంగా మరో లక్ష మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన డ్వాక్రా గ్రూపుల బలోపేతానికి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి లక్ష రూపాయలు ఉచితంగా ఇచ్చి, పది లక్షల రూపాయలు రివాల్వింగ్ ఫండ్‌గా ఇవ్వాలని మెనిఫెస్టోలో అంశాన్ని చేర్చారని అన్నారు. రేషన్ దుకాణాల నుండి ఇస్తున్న ఆరు కిలోల బియ్యాన్ని ఏడు కిలోలకు పెంచి సన్నబియ్యం ఇవ్వనున్నామని, ఎస్సీ, ఎస్టీలకు అవి ఉచితమని వివరించారు. సంవత్సరానికి ఆరు గ్యాస్ సిలిండర్‌లు ఉచితంగా ఇవ్వనున్నామని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైందని విమర్శించారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ మాదిరిగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చెప్పేది చేస్తాడని, చేసేదే చెబుతాడని తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో సర్పంచ్‌లకు నిధులు రాక రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రామాలను నిర్వీర్యం చేసిందని దుమ్మెత్తిపోశారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికవగానే గ్రామాలకు లక్షల రూపాయలు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీలను ఆర్థికంగా పైకి తెచ్చింది 70 సంవత్సరాల కాంగ్రెస్ పాలన అని గుర్తుచేశారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి బ్రహ్మాండమైన మేనిఫెస్టోను రూపొందించారని తెలిపారు. యువతను ఉద్యమంలో వాడుకుని ఉద్యోగం ఇవ్వని టీఆర్‌ఎస్‌కు ఓటు వేయరాదని పిలుపునిచ్చారు. గతంలో కుటుంబ సభ్యులచే టీఆర్‌ఎస్‌కు ఓటు వేయించిన యువత ఈసారి కాంగ్రెస్‌కు వేయించాలని, ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. పింఛన్ల మాదిరిగానే నిరుద్యోగులకు రూ.3000ల భృతి ఇస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భాస్కర్, మాజీ సర్పంచ్‌లు గౌసుద్దీన్, జాఫర్, గురువా రెడ్డి, నాయకులు మాధవ రెడ్డి, కామా రెడ్డిగూడ గ్రామ అధ్యక్షుడు బక్కా రెడ్డి, అశోక్ రెడ్డి, రాజేందర్, రాంచందర్, వెంకట్ రెడ్డి, రఘుపతి రెడ్డి, సోషల్ మీడియా నియోజకవర్గ కో ఆర్డినేటర్ రఘుపతి రెడ్డి పాల్గొన్నారు.