రంగారెడ్డి

రైతాంగాన్ని ఆదుకోవడంలో విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 11: కరువు పీడిత రైతాంగాన్ని ఆదుకోవడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేష్ ఆరోపించారు. సోమవారం స్థానిక డాగ్‌బంగ్లా అతిథిగృహంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం ప్రాంతంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొని రైతాంగం విలవిల్లాడుతున్నదని చెప్పారు. నీళ్ళు, పశుగ్రాసం కొరతతో పశువులు కబేళాలకు తరలుతున్నా యన్నారు. వ్యవసాయం మానుకొని, పశుపోషణ చేయలేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరువు సహాయక చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదన్నారు. జిల్లాకు పాలమూరు ప్రాజెక్టు ద్వారా నీటిని అందిస్తామన్న ప్రభుత్వం మాటమార్చి డిండి ప్రాజెక్టు ద్వారా నీరందిస్తామనడం సిగ్గుచేటన్నారు. డిండి ప్రాజెక్టుపై కూడా స్పష్టత కరువయ్యిందని వెంటనే స్పష్టత ఇవ్వాలన్నారు. గతేడాది ఇబ్రహీంపట్నంలో పర్యటించిన ముఖ్యమంత్రి గ్రామ పంచాయతీలకు పది లక్షలు, నగర పంచాయతీలకు 25 లక్షల నిధులు వెచ్చించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆయన హామీ ఇచ్చి ఏడాది గడుస్తున్నా నేటికి హామీలు నీటిమూటలుగానే మిగిలిపోయా యన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల సంగతే ఇలా ఉంటే ఇక మిగతా నేతల మాటల సంగతేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పండాల శంకరయ్య, నగరపంచాయతీ అధ్యక్షుడు చింతం బాలరాజ్, పాశం భాస్కర్‌గౌడ్, మంఖాల దాసు, యాలాల యాదయ్య పాల్గొన్నారు.