రంగారెడ్డి

భక్తుల కోసం మెరుగైన వసతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హయత్‌నగర్, నవంబర్ 13: కర్మన్‌ఘాట్ ధ్యానాంజనేయ స్వామి దేవాలయంలో భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు వసతులు కల్పిస్తున్నామని ఈఓ అన్నపూర్ణ తెలిపారు. ఆలయంలో దాతల సహకారంతో వాహన హనుమాన్ దేవాలయం చుట్టూ ప్రహారీ, గ్రిల్స్, శ్రీబన్సూరి బాలపుష్ప మందిరం ప్రహారీ, గ్రిల్స్ పనులకు శుక్రవారం ఆలయ కమిటీ సభ్యులు, భక్తుల సమక్షంలో శంకుస్థాపన చేశారు. ఈఓ అన్నపూర్ణ, చైర్మన్ కోతి నర్సిరెడ్డి మాట్లాడుతూ భక్తులు, దాతల సహకారంతో ఆలయాన్ని అభివృధ్ది చేస్తున్నామని తెలిపారు. కార్తీక మాసం పురస్కరించుకొని భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. శనివారం కోనేరులో స్వచ్చ్భారత్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వేకువజామున కోనేరు నీటితో ఆంజనేయస్వామికి అభిషేకం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ధర్మకర్తలు గోపాల్ రెడ్డి, దుర్గారెడ్డి, కళ్యాణ్ చక్రవర్తి, వేణుగోపాలరావు, భూపేష్ రెడ్డి, ఈశ్వరయ్య గౌడ్, అర్చకులు అంబ ప్రసాద్, శంకర్ శర్మ, పీతంబరచారి పాల్గొన్నారు.