రంగారెడ్డి

నామినేషన్ల జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడ్‌మెట్, నవంబర్ 14: మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్‌ల పర్వం బుధవారం మొదలైంది. మల్కాజిగిరి బీజెపీ అభ్యర్థి ఎన్. రాంచందర్ రావు, టిజెఎస్ అభ్యర్ధి కపిలవాయి దిలీప్ కుమార్ స్వతంత్ర అభ్యర్థులు గొపు రమణారెడ్డి, బొబ్బిలి పావని రెడ్డి, ఎస్ మధుమోహన్, కందిబండ నరసింహారావు, రాసురి అనిల్‌కుమార్ తమ నామినేషన్‌లు దాఖలు చేసినట్టు రిటర్నింగ్ అధికారి వేణుగోపాల్ తెలిపారు.
టీఆర్‌ఎస్, మహాకూటమి అభ్యర్ధులను నమ్మే పరిస్థితిలో మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలు లేరని మల్కాజిగిరి నియోజకవర్గ బీజెపీ అభ్యర్ధి ఎన్. రాంచందర్‌రావు పేర్కొన్నారు. బుధవారం ఉదయం మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని మీర్జాలగూడ నుండి మల్కాజిగిరి సర్కిల్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున్న ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు. రాంచందర్‌రావు మాట్లాడుతూ, తెరాస అధికారంలో ఉన్నన్ని రోజులు మాయమాటలతో కాలం వెళ్లదీసిందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నేరవేర్చలేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్, టీడీపీలు మహాకూటమి పేరుతో ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారని, వారు చెప్పే కబుర్లు నమ్మొద్దని తెలిపారు. వచ్చే ఎన్నికలలో బీజేపీ మెజార్టీ స్థానాలలో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే అభ్యర్ధిని గుర్తించి గెలిపించుకోవాలని మల్కాజిగిరి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్ధి గొపు రమణా రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నేరేడ్‌మెట్ ఆర్‌కేపురం నుంచి మల్కాజిగిరి సర్కిల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు. రమణా రెడ్డి మాట్లాడుతూ మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్న సమస్యలు తనకు తెలుసునని, తనని గెలిపిస్తే ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తానని పేర్కొన్నారు. బీజేపీ నుంచి టిక్కెట్టు ఆశించి భంగపడ్డ రమణారెడ్డి స్వతంత్ర అభ్యర్ధిగా ఎన్నికలలో గెలుపొందుతానని దీమా వ్యక్తం చేశారు.
బీజేపీ గెలుపు ఖాయం
రాజేంద్రనగర్: రాజేంద్రనగర్‌లో ప్రజలు భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారన్న విశ్వాసం సంపూర్ణంగా ఉందని బీజేపీ అభ్యర్థి బద్ధం బాల్‌రెడ్డి అన్నారు. బుధవారం రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్ రాంబాగ్‌లోని కోదండ రామాలయంలో సతీసమేతంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు భారీ పాదయాత్రగా తరలివెళ్లి నామినేషన్ వేశారు. బద్ధం బాల్‌రెడ్డి మాట్లాడుతూ రాజేంద్రనగర్‌తో బీజేపీకి ఎంతో అవినాభావ సంబంధం ఉందన్నారు. ఈ ఎన్నికల్లో లక్షకుపైగా ఓట్లు సాధిస్తానని వివరించారు. బీజేపీని చూస్తే మజ్లిస్‌కి గుండెల్లో రైళ్లు పరిగెడతాయని అన్నారు.
సీనియర్ల అసంతృప్తి
నామినేషన్ దాఖలు చేసేందుకు ఊరేగింపుగా బయలుదేరిన బద్దం బాల్ రెడ్డి సీనియర్ నాయకులను పట్టించుకోలేదని, స్థానిక నాయకులను కలుపుకుని పోలేదని కార్యకర్తలు విమర్శించారు. చేవెళ్ల లోక్‌సభ బీజేపీ ఇన్‌చార్జి బీ.జనార్ధన్ రెడ్డిని, నియోజకవర్గం కన్వీనర్ కొమురయ్యను, రాష్ట్ర నాయకుడు అంజన్ కుమార్‌ను బాల్‌రెడ్డి ఊరేగింపు వాహనంలోకి, నామినేషన్ వేసేప్పుడుఆహ్వానించ లేదు. దూరంగా నిలుచుండిపోయారు. స్థానిక నాయకులనూ బద్దం బాల్ రెడ్డి కలుపుకుని పోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తాయి.
ప్రజల ఆశీర్వాదంతో..
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ప్రజల ఆశీర్వాదంతో టీఆర్‌ఎస్ తరఫున గెలుపొందడం ఖాయమని మాజీ శాసనసభ్యుడు, టీఆర్‌ఎస్ అభ్యర్థి టీ.ప్రకాష్‌గౌడ్ అన్నారు. బుధవారం కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా తరలివెళ్లి ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ వేశారు. ప్రకాష్‌గౌడ్ మాట్లాడుతూ రెండు పర్యాయాలుగా ప్రజలు తనపై ఎంతో నమ్మకంతో గెలిపించారని, తనపై విశ్వాసంతో ఓటు వేసిన ప్రజల రుణం తీర్చుకునేందుకు తాను శాయశక్తులా కృషి చేశానని అన్నారు.
నియోజకవర్గంలో ప్రజలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను చేరువ చేసానని, పది సంవత్సరాలుగా నియోజకవర్గానికి సక్రమంగా రావాల్సిన నిధులను తీసుకువచ్చి అభివృద్ధికి పునాదులు వేశానని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గానికి మరిన్ని నిధులు రప్పించుకునేందుకు అవకాశం కలిగిందని చెప్పారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ పథకాలే ప్రజల్లో తమను నిలబెడతాయని ధీమా వ్యక్తం చేశారు.
కార్తీక్ రెడ్డికి తిరుగులేదు
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మహాకూటమి అభ్యర్థిగా కాంగ్రెస్ యువ నాయకులు కార్తీక్ రెడ్డి గెలుపొందడం ఖాయమని కాంగ్రెస్ నాయకుడు ఏనుగు మురళీధర్ రెడ్డి అన్నారు. బుధవారం రాజేంద్రనగర్‌లోని ఆర్డీవో కార్యాలయంలో కార్తీక్‌రెడ్డి తరపున మురళీధర్ రెడ్డి నామినేషన్ వేశారు. మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఇంద్రారెడ్డి కుటుంబానికి మంచి ఆదరణ ఉందని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, బీజేపీ చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమని అన్నారు.