రంగారెడ్డి

సీసీ కెమెరాల నిఘా నీడలో రిటర్నింగ్ ఆఫీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, నవంబర్ 14: త్వరలో నిర్వహించనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రిటర్నింగ్ కార్యాలయం వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. బుధవారం నామినేషన్లు వేసేందుకు వివిధ పార్టీల అభ్యర్థులు వస్తున్న నేపధ్యంలో షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ నేతృత్వంలో ఐదు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లే గేటు వద్ద మొదటి సీసీ కెమెరాను ఏర్పాటు చేయడంతోపాటు ఆఫీసు వరకు మొత్తం ఐదు సీసీ కెమెరాలను అమర్చారు. వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు రావడంతోపాటు తిరిగి వెళ్లే వరకు సీసీ కెమెరాల్లో పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. నామినేషన్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల అధికారులు, పోలీసులు ముందస్తు జాగ్రత్తగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం తాము నడుచుకుంటున్నామని, నిబంధనలను అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను పకడ్బందీగా ఏర్పాటు చేయడమే లక్ష్యంగా తాము పనిచేయనున్నట్లు షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ వివరించారు. షాద్‌నగర్ చరిత్రలోనే అసెంబ్లీ ఎన్నికల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. గతంలో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడు కూడా నామినేషన్ కేంద్రం వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయలేదు. కానీ ప్రస్తుతం నిర్వహిస్తున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పలువురు నేతలు ఆశ్చర్యపోతున్నారు. ఆర్‌డీఓ కార్యాలయం వద్ద బందోబస్తులో భాగంగా ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయం వద్ద పోలీసులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

ప్రభుత్వ పాఠశాలల తీరు మారేనా..?
షాద్‌నగర్, నవంబర్ 14: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామని, అన్ని రకాల వసతులు కల్పించామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. కానీ మండలంలో ప్రభుత్వ పాఠశాలల తీరు దీనికి పూర్తి భిన్నంగా ఉంది. మండలంలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్య అందని ద్రాక్షగా మారుతుంది. ఫరూఖ్‌నగర్ మండలంలోని చౌలపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు లేకపోవటంతో వెలవెలబోతోంది. ఉపాధ్యాయుల రాకకోసం ఎదురుచూస్తూ విద్యార్థులు పడిగాపులు కాస్తున్నారు. చౌలపల్లి ప్రాథమిక పాఠశాలలో కేవలం ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. పాఠశాలలో ఉన్న ఇద్దరూ కూడా సెలవులపై వెళ్లడంతో విద్యావాలంటీర్లే దిక్కయ్యారు. ఇద్దరిలో ఒకరు మెడికల్ లీవ్ పెట్టగా, మరొకరు జనరల్ లీవ్ పెట్టారని విద్యాధికారులు చెప్పడం విడ్డూరంగా ఉంది. ఇక విద్యావాలంటీర్ తన చిన్న పాపను పాఠశాలకు తీసుకురావడంతో వచ్చిన విద్యార్థులు కూడా ఆ పాపను ఆడించడం అశ్చర్యానికి గురిచేస్తోంది. తమ పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.