రంగారెడ్డి

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొంరాస్‌పేట, నవంబర్ 15: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని పార్టీ మండల అధ్యక్షుడు జయకృష్ణ అన్నారు. గురువారం మండల పరిధిలోని తుంకిమెట్లతో పాటు తండాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో, తండాల్లో ప్రచారానికి వెళితే ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని, కొడంగల్‌లో రేవంత్ రెడ్డి గెలుపును, రాష్ట్రంలో కాంగ్రెస్ విజయాన్ని ఎవరు ఆపలేరని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రాజేష్ రెడ్డి, వెంకట్ రాములు గౌడ్, అంజిల్ రెడ్డి, చంద్రప్రకాష్, నర్సిములు గౌడ్, రాంచంద్రారెడ్డి పాల్గోన్నారు.
టీడీపీ టికెట్ ఇబ్రహింపట్నం స్థానికుడికే ఇవ్వాలి
హయత్‌నగర్, నవంబర్ 15: ఇబ్రహింపట్నం టీడీపీ టికెట్ స్థానికుడికి కాకుండ ఇతర ప్రాంతాల వారికి కేటాయిస్తే సహించేది లేదని నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్ రొక్కం భీంరెడ్డి తెలిపారు. గురువారం తుర్కయంజాల్‌లో ఏర్పాటు చేసిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో భీంరెడ్డి మాట్లాడుతూ... స్థానిక సంస్థల నుంచి అసెంబ్లీ వరకు నియోజకవర్గంలో టీడీపీ విజయం సాధించిందని గుర్తుచేశారు. ఎంతో కాలంగా పార్టీలో పనిచేస్తూ పార్టీని బలోపేతం చేసినట్లు తెలిపారు. స్థానికంగా ఉన్న తనకే టీకెట్ కేటాయించాలని లేనిచో పార్టీకి ఎవరు పనిచేయమని వెల్లడించారు. పార్టీ, కార్యకర్తలు సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తే బాగుంటుందని అన్నారు. స్థానికుడికి టికెట్ కేటాయిస్తే విజయం తథ్యమని పేర్కొన్నారు. త్వరలో కార్యకర్తల అభిష్టం మేరకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు పురం యాదిగిరి రెడ్డి, జక్కరాం రెడ్డి, బిందురంగా రెడ్డి, చేగూరి వెంకటేష్ పాల్గొన్నారు.

బీసీలను నిర్లక్ష్యం చేసే పార్టీలకు బుద్ధి చెబుతాం
ఘట్‌కేసర్, నవంబర్ 15: బీసీలకు టికెట్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిన పార్టీలకు బుద్ధి చెప్పేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని మేడ్చల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గోపు బాల్‌రాజు యాదవ్ పిలుపునిచ్చారు. ఘట్‌కేసర్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం విలేఖరుల సమావేశం జరిగింది. రాష్ట్రంలో ప్రధాన పార్టీలు బీసీలకు తీరని అన్యాయం చేశాయని ఆరోపించారు. కాంగ్రెస్‌లో సిట్టింగ్ బీసీలకు సైతం టికెట్లు ఇవ్వకుండా మొండి చేయ్యి చూపిందని ఆరోపించారు.
బీసీలకు బీఎల్‌ఎఫ్ మినహా అన్ని పార్టీలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు. ఈనెల 17న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపు మేరకు చేపట్టిన తెలంగాణ బంద్‌ను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీసీ నాయకులు పల్లె బాబురావు, గొబ్బిరి మన్యం, బీ.అనిల్ కుమార్ గౌడ్, గుమ్మడివెళ్లి భాస్కర్, కప్పరి భాస్కర్, ఉడుగుల శ్రీకాంత్ పాల్గొన్నారు.