రంగారెడ్డి

అగ్రికల్చర్ యూనివర్సిటీలో సమ్మె ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంద్రనగర్, ఏప్రిల్ 25: బీ ఎస్సీ సీ ఏ బీ ఎం కోర్సును తీసివేయాలన్న అకాడమి కౌన్సిల్ నిర్ణయానికి వ్యతిరేకంగా గత 10 రోజులుగా చేస్తున్న సమ్మె సోమవారం వినూత్నంగా నిర్వహించారు. దున్నపోతుకు అకడమిక్ కౌన్సిలింగ్ బోర్డు వేసి యూనివర్సిటీలో ర్యాలీ నిర్వహించి, పరిపాలన భవనాన్ని ముట్టడించారు. దీంతో విద్యార్థులకు, అధికారులకు మధ్య వాగ్వాదం తీవ్ర రూపం దాల్చింది. ఎట్టి పరిస్థితుల్లో అధికారులు విరమించుకునే వరకు సమ్మెను వదిలే ప్రసక్తే లేదని అధికారులను డిమాండ్ చేశారు. మండుతున్న ఎండలకు 12 మంది విద్యార్థులకు సమ్మెలో సొమ్మసిల్లి పడిపోయారు. సొమ్మసిల్లిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. పది రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోకపోగా తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు మండిపడ్డారు. అధికారులు, ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెప్పకుండా దాటవేస్తూ వెళ్తున్నారని ఆరోపించారు. బీ ఎస్సీ సీ ఏబీ ఎం కోర్సును తీసివేస్తే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె తీవ్ర ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు. వెంటనే తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

డిప్యుటీ కమిషనర్ ఆకస్మిక తనిఖీ
గచ్చిబౌలి, ఏప్రిల్ 25: శేరిలింగంపల్లి సర్కిల్ 12 డిప్యుటీ కమిషనర్ వి.మమత చందానగర్ మియాపూర్ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేసారు. ఆయా కాలనీల్లో పర్యటించి పారిశుద్ధ్యం పనులు ఎలా జరుగుతున్నాయో కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు కేటాయించిన ప్రాంతాల్లో పని చేస్తున్నారా? లేక ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్నారా తెలుసుకోవడంతోపాటు ఎంతమంది హాజరైనారు, ఎవరైనా గైర్హాజరా పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికుల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్న ఆమె చేతితొడుగులు, మాస్క్‌లు, షూస్ పారిశుద్ధ్య కార్మికులకు అందించారు.