రంగారెడ్డి

డిసెంబర్ 11 నుంచి ఆర్‌ఎఫ్‌ఐడీ ఫాస్టాగ్ అమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, డిసెంబర్ 9: ఔటర్ రింగ్‌రోడ్డులో టోలు వసూలు ప్రక్రియలో హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) తలపెట్టిన అత్యాధునిక రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్‌ఎఫ్‌ఐడీ) ఫాస్టాగ్ ఎలక్ట్రానిక్ పద్ధతిని 11 నుంచి అధికారికంగా అమలు చేస్తున్నట్లు సంస్థ కమిషనర్ డాక్టర్ బీ.జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. తార్నాకలోని హెచ్‌ఎండీఏ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సంబంధిత అధికారుల సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా ప్రయోగాత్మకంగా అమలు జరుగుతున్న ఆర్‌ఎఫ్‌ఐడీ ఫాస్టాగ్ టోలు వసూలు ప్రక్రియలోని సాధక బాధకాలను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. పథకంపై ఓఆర్‌ఆర్ ద్వారా ప్రయాణించే వాహనదారులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరం చుట్టూ 158 కి.మీ పొడవున్న ఔటర్ రింగ్‌రోడ్డుపై పలు చోట్ల ఉన్న టోల్ వసూలు సెంటర్ల వద్ద చిల్లర సమస్యతో పాటు రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్ధీ వల్ల పలు వాహనదారులకు టోలు గేట్ వద్ద వాహనాలు బారులు తీసి ఉండాల్సివస్తోంది. గత కొద్ది రోజుల క్రితం ఆర్‌ఎఫ్‌ఐడీ ఆధారిత ఎలక్ట్రానిక్ టోలు రుసుం పద్ధతి, కాగిత రహి తం వ్యక్తిగతమైన లావాదేవీలు (పేపర్ లెస్ మ్యాన్‌వల్ సిస్టమ్) ఆధారిత టోలు రుసుం చెల్లింపు పద్ధ తి అమలు జరుగుతుంది. పద్ధతి 19 ఇంటర్ ఛేంజ్ ఓఆర్‌ఆర్ కలెక్షన్ చెక్ పోస్టులలో అమ లు చేయడంతో టోలు రుసుం వసూలును మరింత సమర్ధవంతంగా అమలు చేయవచ్చని కమిషనర్ పేర్కొన్నారు. అమలు వల్ల డబ్బులు ఇచ్చుపుచ్చుకునే సమయం, వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించవచ్చన్నారు. ఆన్‌లైన్ నగదు చెల్లింపులతో కూడిన ఈ పద్ధతి వల్ల ఒత్తిడీ కూడిన అవాంతరాలను తొలగించుకోవచ్చని తెలిపారు. టోలు సుంకానికి సంబంధిత ఏజెన్సీనే బాధ్యత వహిస్తుందని, ఫ్యాస్టాగ్ లావాదేవీల వ్యవస్థ ఐసీఐసీ బ్యాంకు భాగస్వామ్యంతో ఎఫ్కాన్ సంస్థకు అప్పగించినట్లు వివరించారు. నిప్పాన్ కోఏ కంపెనీ, ఐటీఎస్ ప్లానర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థల ద్వారా అవసరమైన సాంకేతిక సహకారం తీసుకుంటున్నట్లు చెప్పారు. నానక్‌రామ్‌గూడ, శంషాబాద్, మేడ్చల్, ఘట్‌కేసర్, పటాన్‌చెరువులోని టోలు ప్లాజా కేంద్రాలలో ఈ ఫాస్ట్‌ట్యాగ్‌ల విక్రయ కేంద్రాలతో పాటు ఫాస్ట్ ట్యాగ్‌లు ఉచితంగా జారీ చేస్తున్నామన్నారు.
మొదటి 2లక్షల వాహనాలు, కార్లు, జీపులు చిన్నతరహా వాహనాల రాకపోకలపై ఎలాంటి నియంత్రణ ఉండదని, టోలు ప్లాజాలో ఫాస్ట్ ట్యాగ్ కలిగి ఉన్న వాహనాలకు వెళ్లేందుకు ప్రత్యేక దారి ఏర్పాటు ఉంటుందని అన్నారు. తరుచుగా ప్రయాణించే ప్రయాణీకులకు నెలసరి పాసులు కూడా కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించామని, వీరు 24 గంటలలో తిరుగు ప్రయాణంలో రాయితీ లభిస్తుందని డాక్టర్ జనార్ధన్ రెడ్డి చెప్పారు.

*

తవ్వారు.. వదిలేశారు..
యాచారం, డిసెంబర్ 9: పైపులైన్ లీకేజీకి మరమ్మతులు చేపట్టేందుకు గోతులు తీసి పైపులైన్‌ను సరిచేసిన అధికారులు, సిబ్బంది తీసిన గోతులను అలా గే వదిలేశారు. రోడ్డు మధ్యలో గోతిని వదిలేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నా రు. రాత్రి సమయాల్లో గోతులు కనిపించక ద్విచక్రవాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇంతా జరుగుతున్నా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని మేడిపల్లి గ్రామంలో గతంలో కృష్ణా తాగునీటి పైపులైన్ లీకేజీ ఏర్పడింది. దీంతో గ్రామస్తులు పలుమార్లు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన అధికారులు పైపునకు సమాంతరంగా గుంతను తవ్వి కొత్తపైపు వేసి పైపులైన్‌ను సరిచేశారు. ఇదంతా బాగానే ఉన్నా పైపులైన్ కోసం తవ్విన గోతిని అలాగే వదిలేసి వెళ్లిపోయారు. పైపులైన్ సరిచేయడం మాత్రమే తమ పని అనుకున్నారో ఏమో కానీ పూడ్చకుండా వదిలేసి ప్రమాదాలకు కారణమవుతున్నారు. దీనిపై మేడిపల్లి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైపులైన్ లీకేజీ ఏర్పడిందని ఎన్నోసార్లు ఫిర్యాదు చేశామని, చివరికి స్పందించిన అధికారులు పైపులైన్‌ను సరిచేశారు కానీ తీసిన గోతులను మరిచారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో గోతులను గమణించకుండా ద్విచక్రవాహనదారులు గోతుల్లో పడి గాయాలపాలవుతున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు స్పంధించి గోతులను సరిచేయాలని కోరుతున్నారు.