రంగారెడ్డి

భద్రంగా...అభ్యర్థుల భవితవ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, డిసెంబర్ 9: మేడ్చల్ (మల్కాజిగిరి) జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంల్లో నిక్షిప్తమైంది. కీసర మండలం బోగారంలోని హోలీ మేరీ ఇంజనీరింగ్ కళాశాలలో 11వ తేదిన నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరుగనుంది. జిల్లాలోని ఉప్పల్, మల్కాజిగిరి, కూకుట్‌పల్లి, కుత్భుల్లాపూర్, మేడ్చల్ నియోజకవర్గాల్లోని ఈవీఎంలను పోలింగ్ కేంద్రాల నుంచి శుక్రవారం రాత్రి హోలీ మెయిరీ కళాశాలలోని స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించిన విషయం తెలిసిందే. నియోజకవర్గానికి చెందిన ఈవీఎంల కోసం ఒక్కో స్ట్రాంగ్‌రూమ్‌ను ఏర్పాటు చేశారు. అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి, పోలీసు కమిషనర్ మహేష్ భగవత్, ఎన్నికల పరిశీలకుల పర్యవేక్షణలో భారీ పోలీసు బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కంపు ప్రక్రియలో భాగంగా ఉదయం 8 గంటల నుంచి 14 టేబుల్స్ 28 రౌండ్లలో లెక్కింపు జరుగుతుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కే.కృష్ణ శేఖర్ తెలిపారు. మధ్యాహ్నం వరకు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఆదివారం ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని సందర్శించిన టీడీపీ అభ్యర్థి తూళ్ల వీరేందర్ గౌడ్ భద్రతా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎంవీరెడ్డితో అడిగి తెలుసుకున్నారు.
ఈ ఎన్నికలు ఏదో ఒక పార్టీకే అనుకూలంగా సాగలేదు. ప్రధాన పార్టీల మధ్య గట్టి పోరు జరిగింది. ప్రజా కూటమి, టీఆర్‌ఎస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. ఉప్పల్, మేడ్చల్ నియోజకవర్గంలో బీఎల్‌ఎఫ్, బీఎస్‌పీ అభ్యర్థులు ప్రధాన అభ్యర్థులకు గట్టిపోటీ ఇచ్చి ఔరా అనిపించుకున్నారు. హోరాహోరీగా సాగిన శాసన సభ ఎన్నికల సమరంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు తమకే అనుకూలమని లెక్కలు వేసుకుంటున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలైన ప్రజా కూటమి అభ్యర్థులు కాంగ్రెస్, టీడీపీ, అధికార టీఆర్‌ఎస్ అభ్యర్థుల అనుచరులు గెలుపు మాదే అంటూ లక్షల్లో బెట్టింగ్‌లు కట్టారు. ఈవీఎంల్లో ఎలాంటి అవకతవకలు జరుగకుండా భారీ పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ పార్టీ ఆదేశాల ప్రకారం పార్టీల అభ్యర్థుల అనుచరులు గట్టి నిఘా పెట్టడం గమనార్హం. ఎగ్జిట్ పోల్ సర్వేపైన నమ్మకం లేదని తేల్చి చెపుతున్నారు.
ఎన్నికల సేవలో వలంటీర్లు
అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఎన్నికల కమిషన్.. వలంటీర్ల సేవలను ఉపయోగించుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వృద్ధులు, దివ్యాంగులను పోలింగ్ కేంద్రాలకు మూడు చక్రాల సైకిళ్లపై తరలిస్తూ ఔరా అనిపించుకున్నారు. పోలింగ్ బూత్‌లు ఎక్కడున్నాయో తెలియక తికమక పడుతున్న ఓటర్లకు సహాయపడుతూ విశిష్ట సేవలు అందించి ప్రజాభిమానం పొందారు.
ఓట్లు గల్లంతుతో నిరాశ
ఏళ్ల తరబడి ఇక్కడే నివసిస్తున్నారు.. పాత ఓటరు కార్డుతోనే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నికల్లో ఇదే కార్డుతో కేంద్రానికి ఉత్సాహంగా వస్తే జాబితాలో పేర్లు గల్లంతు అయ్యాయి. దీంతో నిరాశకు గురైన ఎందరో తిరిగి ఉసూరుమంటూ ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రతి ఎన్నికల సమయంలో ఓటరు కార్డు గుర్తొస్తుంది. ఈసారి కూడా వచ్చి చూడగా గల్లంతు కావడంతో మనోవేదనకు గురయ్యారు. ఉప్పల్ నియోజకవర్గంలోని రామంతాపూర్, ఉప్పల్, చిల్కానగర్, నాచారం, కాప్రా, ఏఎస్‌రావునగర్‌లో జాబితాలో పేర్లు లేకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. మేడ్చల్ నియోజకవర్గంలోని బోడుప్పల్, పీర్జాదిగూడలో సైతం జాబితాలో పేర్లు గల్లంతు కావడంపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.