రంగారెడ్డి

గుర్తింపు కార్డు ఉన్న వారికే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, డిసెంబర్ 10: గుర్తింపు కార్డు ఉన్న వారికి మాత్రమే ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి అనుమతి ఉంటుందని వికారాబాద్ డీఎస్పీ శిరీష రాఘవేంద్ర వెల్లడించారు. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పట్టణంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ప్రజలెవ్వరూ గుంపులుగా గుమికూడి (నలుగురికి మించి) ఉండరాదని స్పష్టం చేశారు. జిల్లాలో ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు, జులుస్, బాణసంచా కాల్చేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పట్టణంలోని ఎంఆర్‌పీ పెట్రోల్ పంపు నుంచి శివాలయం వరకు, సిద్ధార్థ పాఠశాల నుంచి సెవెన్ హిల్స్ రెస్టారెంట్ వరకు ఎటువంటి వాహనాలకు ప్రయాణానికి అనుమతి లేదని తెలిపారు. కౌంటింగ్‌లో పాల్గొనే అధికారులకు మాత్రమే రైతుబజార్ మెయిన్ గేట్‌లో వాహనాల పార్కింగ్ ఉంటుందని చెప్పారు. మీడియా, ఎన్నికలలో పోటీచేసిన అభ్యర్థులకు మాత్రమే రైతుబజార్ రెండో గేట్‌లో వాహనాల పార్కింగ్ ఉంటుందని అన్నారు. ఎన్నికల కౌంటింగ్‌లో పాల్గొనే వివిధ పార్టీ ఏజెంట్‌లకు, కౌంటింగ్ స్ట్ఫాకు మార్కెట్ గంజ్ (గ్రేన్ మర్చంట్స్ మార్కెట్ యార్డ్)లో పార్కింగ్ ఉంటుందన్నారు.
కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ
మార్కెట్ గోదాములో ఏర్పాటుచేసిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని సోమవారం ఎస్పీ అవినాష్ మహంతి పరిశీలించారు. ఎస్పీ వెంట జిల్లా అదనపు ఎస్పీ టీఎస్ రవికుమార్, డీఎస్పీ శిరీష రాఘవేందర్, సీఐ సీతయ్య, ఎస్‌ఐ లక్ష్మయ్య ఉన్నారు.
కార్తీకమాస కీసరగుట్ట ఆదాయం రూ.1.04కోట్లు
కీసర, డిసెంబర్ 10: కార్తీకమాసంలో కీసరగుట్ట శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయ ఆదాయం 10409158 (కోటి నాలుగు లక్షల తొమ్మిది వేల నూటాయాభై ఎనిమిది రూపాయలు) ఆదాయం లభించిందని ఆలయ ఈఓ నర్సింహ మూర్తి, చైర్మన్ రమేశ్ శర్మ తెలిపారు. సోమవారం ఆలయ మహా మంటపంలో హుండీ లెక్కింపు దేవాదాయ సిబ్బంది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నిర్వహించారు. హుండీ ద్వారా రూ.3021870 లక్షల ఆదాయం రాగా, ఆర్జిత సేవలు, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.7387288 లక్షల ఆదాయం వచ్చింది. గత సంవత్సరం కంటే రూ.14 లక్షల ఆదాయం పెరిగిందని అన్నారు.

అనంతపద్మనాభస్వామిని
దర్శించుకున్న మాజీ మంత్రి డీకే
వికారాబాద్, డిసెంబర్ 10: మాజీ మంత్రి, గద్వాల కాంగ్రెస్ అభ్యర్థి డీకే అరుణ సోమవారం అనంతగిరి శ్రీ అనంతపద్మనాభస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్నికల సమయంలో స్వామిని దర్శించుకుని విజయం సాధించిన తర్వాత స్వామివారికి ముడుపులు చెల్లించుకోవడం ఆనవాయితీ.