రంగారెడ్డి

ఐదేళ్లలో అభివృద్ధే ప్రధాన ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, డిసెంబర్ 12: రానున్న ఐదు సంవత్సరాలు రాజేంద్రనగర్ నియోజకవర్గంలో అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానని రాజేంద్రనగర్ నియోజకవర్గం నూతన శాసనసభ్యుడు టి.ప్రకాష్‌గౌడ్ ఆకాంక్షించారు. నియోజకవర్గంలో ప్రజల దప్పిక తీరేందుకు మంచినీటి సదుపాయాన్ని ఇంటింటికి కల్పించేందుకు ప్రభుత్వంతో చర్చించి సాధిస్తానని ఆయన వ్యాఖ్యానించారు. బుధవారం నూతనంగా గెలుపొందిన ప్రకాష్‌గౌడ్‌ను ఆంధ్రభూమి కలిసింది. రానున్న ఐదేళ్లల్లో చేపట్టబోయే అంశాల గురించి ప్రకాష్‌గౌడ్‌ను ప్రశ్నించింది. ఈ సందర్భంగా ప్రకాష్‌గౌడ్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలుగా చేపట్టిన అభివృద్ధిని కొనసాగిస్తామని, ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని రకాల వసతులను కల్పించేందుకు పాటుపడతానని అన్నారు. నియోజకవర్గం పరిధిలో ఉన్న నెక్నాంపూర్ చెరువు, గండిపేట్ చెరువు, హిమాయత్‌సాగర్ చెరువులను సుందరీకరించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. నియోజకవర్గంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఉందని, ఈ ఎయిర్‌పోర్ట్‌కు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే వారికి రవాణా సౌకర్యాన్ని కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, మెహదీపట్నం నుంచి అరాంఘర్ వరకు ఉన్న పీవీ ఎన్ ఆర్ ఎక్స్‌ప్రెస్ వేను మరింత విస్తరించనున్నట్లు తెలిపారు. అరాంఘర్ నుంచి శంషాబాద్ వరకు ఈ పీవీ ఎన్ ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేను పెంచనున్నట్లు వివరించారు. అంతేకాకుండా మెట్రో రైల్ సదుపాయాన్ని నియోజకవర్గంకు చేరువ చేయనున్నామని అన్నారు. ప్రభుత్వంతో చర్చించి 111 జీవోను సడలించి శంషాబాద్ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారికి మేలు చేకూర్చుతామని అన్నారు. అంతేకాకుండా ఎక్స్‌ప్రెస్‌వే ఔటర్‌రింగు రోడ్డును నిర్మిస్తామన్నారు. రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్న ప్రాంతాల్లో రోడ్లను నిర్మించి సామాన్య ప్రజల సమస్యను పరిష్కరిస్తామని అన్నారు.
దిగువ, ఎగువ ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రాంతాలను గుర్తించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని, వీధిదీపాలను ఏర్పాటు చేసి అంధకారానికి స్వస్తి పలుకుతామని అన్నారు. చాలా మందికి సొంత ఇళ్లు లేక ఇబ్బంది పడుతున్నారని, వారిని గుర్తించి డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి అందిస్తామని, లక్ష్మిగూడలో 100 పడకల ఆసుపత్రిని నిర్మిస్తామని, ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేయబోతున్నామని, బస్తీల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, అర్హులైన వారందరికీ ఆసరా పింఛన్లను అందజేస్తామని అన్నారు. నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల లేదని, ప్రభుత్వంతో చర్చించి ఒక డిగ్రీ కళాశాలను, దీంతో పాటు మరో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటుచేసి విద్యాభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. అంతేకాకుండా అర్హులైన నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందని, తప్పకుండా స్థానిక నిరుద్యోగులకు ఈ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా మూడు పర్యాయాలుగా ఎమ్మెల్యేగా గెలుపొందిన తనను అధిష్టానం గుర్తించిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్‌లు సైతం తన సేవలను గుర్తించారని, ఈసారి మంత్రివర్గంలో తనకు చోటు దక్కవచ్చని ప్రకాష్‌గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

కంటోనె్మంట్ ఇక మరింత అభివృద్ధి:ఎమ్మెల్యే సాయన్న
అల్వాల్, డిసెంబర్ 12: కంటోనె్మంట్‌లో గెలుపుతో నియోజకవర్గంలో మరింతగా బాధ్యత పెరిగిందనీ నియోజకవర్గంలో ఐదవసారి ఎన్నికైన ఎమ్మెల్యే జీ. సాయన్న తెలిపారు. నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో పాటు తన సేవలకు ఇది గుర్తింపనీ వివరించారు. ప్రతి ఎన్నికల్లో సాయన్న ఓడిపోతున్నారనీ నాయకులు వ్యతిరేక ప్రచారం చేసినా ప్రజలు మాత్రం తనకే పట్టం కట్టంపట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు ఒకవైపు ఉంటే కంటోనె్మంట్ నియోజకవర్గం మాత్రం ప్రత్యేకత ఉంటుందనీ చెప్పారు. భిన్న మతాలు, దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజల సంస్కృతులతోపాటు, మిలటరీ, ఏయిర్‌ఫోర్సు, నేవిలో ఉద్యోగాలు నిర్వహించి పదవి విరమణ చేసిన నియోజకవర్గంలో ఉన్నారనీ అందరి మన్ననలు పొందడం అంత సులువు కాదనీ నిరంతరం ప్రజలు తనకు ఇచ్చిన మద్దతుతోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తు న్నామనీ వివరించారు. అన్నానగర్, కష్ణనగర్, శివానగర్, సిల్వర్ కంపెణీ వద్ద ఉన్న వారందరికి ఇండ్ల పట్టాలు ఇప్పించామనీ, ప్రస్తుతం మారెడ్‌పల్లి, మర్డ్ఫుర్డు, సిల్వర్ కంపెనీ వద్ద పేద వారందరికి డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తున్నామనీ చెప్పారు. కంటోనె్మంట్‌లో అతి పెద్ద మురికివాడ అయన అన్నానగర్, అర్జున్ నగర్, ఇందిర్మనగర్, ఎయిర్‌పోర్టు గుడిసెలు, రసూల్‌పురా, కట్టమైసమ్మ కృష్ణనగర్, శివానగర్, అంబేద్కర్‌నగర్‌లో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామనీ సాయన్న వివరించారు. జలమండలి నుంచి కంటోనె్మంట్ బోర్డు పరిథిలోని ప్రజలకు నీటి సరాఫరా అందించటం కోసం బకాయ పడ్డ 18 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మాఫి చేసిందనీ చెప్పారు. ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందె విధంగా తమ వంతు కృషి చేశామనీ ప్రతి ఇంటి ఇంటికి నల్లాకనెక్షన్‌లు మంజూరీ చేయించామన్నారు.