రంగారెడ్డి

అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, డిసెంబర్ 14: గురువారం అర్థరాత్రి ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో చేతికొచ్చిన వరి, పత్తి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అకాల వర్షంతో వరిధాన్యం తడవడమే కాకుండా పత్తి తడిసిపోవడంతో రైతులు విలవిల్లాడిపోయారు. చేతికొచ్చే సమయంలో అర్థరాత్రి ఒక్కసారిగా వర్షం రావడంతో వ్యవసాయ పొలంలోనే ఉన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అర్ధరాత్రి కురిసిన వర్షం కారణంగా షాద్‌నగర్ వ్యవసాయ మార్కెట్‌కు విక్రయించేందుకు తీసుకువచ్చిన వరిధాన్యం, మొక్కజొన్న గింజలు తడిసిపోయాయి. ఈ ఏడాది వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ అతి కష్టం మీద పంటలను సాగుచేసి విక్రయించేందుకు ధాన్యం తెస్తే అకాల వర్షం కారణంగా తడిసిపోయాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని అయ్యవారిపల్లి, భీమారం, విఠ్యాల, రాయికల్, అన్నారం, బూర్గుల, చిల్కమర్రితోపాటు కొందుర్గు, నందిగామ మండలాల నుంచి రైతులు వరి, మొక్కజొన్న విక్రయించేందుకు బుధవారం మధ్యాహ్నం తీసుకువచ్చారు. బీట్లు కాకపోవడంతో విక్రయించకుండా మార్కెట్‌లో పెట్టారు.
వర్షం కారణంగా ధాన్యం తడిసిపోవడంతో ఏమి చేయాలో తెలియక అన్నదాతలు తలలు పట్టుకుంటున్నారు. కష్టపడి పంటలను సాగుచేసి మార్కెట్‌కు తీసుకువస్తే వర్షాల కారణంగా మళ్లీ తాము నష్టపోయామని రైతులు వాపోతున్నారు. తడిన ధన్యానికి గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు మార్కెట్‌లో సరైన సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

వయోవృద్ధుల సంరక్షణకు చర్యలు
కీసర, డిసెంబర్ 14: తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన తల్లిదండ్రుల, వయోవృద్ధుల పోషణ సంక్షేమ నియమావళి 2011 కు అన్ని చర్యలు తీసుకోనున్నట్లు మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వయోవృద్ధుల సంక్షేమ నియమావళిపై జిల్లా ఏర్పాటైన కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెద్దవారికి అవసరమైన పోషణ, సంరక్షణ విషయాల్లో సులభమైన వేగవంతమైన న్యాయ సహాయాన్ని అందించేందుకు న్యాయ స్ధానాలతో సంబంధంలేని ప్రత్యేక చట్టాన్ని రూపొందించిందని తెలిపారు. కమిటీ తప్పనిసరిగా మూడు నెలల కోసారి సమావేశమై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తామని అన్నారు. కార్యక్రమంలో జేసీ శ్రీనివాస్ రెడ్డి, డీఆర్వో మధుకర్ రెడ్డి, సీనియర్ సిటిజన్, ఉమెన్ వెల్పేర్ అధికారి స్వరూపారాణి, డీఆర్‌డీఓ కౌటిల్య, డీఈఓ విజయ కుమారి, ఆర్డీఒ మధుసూధన్ పాల్గొన్నారు.
అలరించిన సినీ సంగీత విభావరి
కాచిగూడ, డిసెంబర్ 14: సుస్వరవాహిని కళా సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ గాయకుడు అమిన్‌పాష నిర్వహణలో ‘పల్లవించవా నా గొంతులో’ పేరిట సినీ సంగీత విభావరి శుక్రవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీ రామరాజు, ప్రముఖ గాయనీ శారద అకునూరి, సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి యూసుఫ్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ప్రచార కార్యదర్శి పీ.శ్రీనివాస్, జీఎస్ ఆర్ట్స్ అధ్యక్షుడు జీ.శ్రీనివాస్, ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణుడు దైవజ్ఞ శర్మ పాల్గొని అమిన్ పాషను అభినందించి సత్కారించారు. అమిన్ పాష నిర్వహణలో గాయనీ, గాయకులు శ్రీదేవి, కీర్తి, సురేఖామూర్తి అలపించిన గీతాలు అలరించాయి.