రంగారెడ్డి

ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు కూల్చివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, డిసెంబర్ 17: శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలోని ప్రభుత్వ భూమిలో ఉన్న నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చి వేశారు. రాయదుర్గం పాయిగా సర్వే నంబర్ 46లో 84 ఎకరాల 30 కుంటల ప్రభుత్వ భూమి ఉంది. ఐదు ఎకరాల్లో స్థానికులు పశువుల పాకలు వేసుకుని కబ్జాలో ఉండగా, సినీ హీరో ప్రభాస్ 2200 గజాల స్థలంలో గెస్టుహౌస్ నిర్మించుకుని ఉన్నారు. భూమిపై హక్కులు తమవేనంటూ ప్రైవేటు వ్యక్తులతో పాటు ప్రభుత్వం కూడా చాలా రోజుల నుండి వాదిస్తూ వచ్చింది. రాయదుర్గంలోని సర్వే నం బరు 46లోని భూమికి తాము హక్కుదారులమని, తమకు అనుకూలంగా గతంలో కోర్టు డిక్రీ ఇచ్చిందని, దీనిని ఆధారంగా మ్యుటేషన్ చేయాలని కోరుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రైవేటు వ్యక్తు లు హైకోర్టుకు వెళ్లారు. తహసీల్దారుపై కోర్టు ధిక్కారం కింద కేసు నమోదు చేయాలని ప్రైవేటు వ్యక్తులు కోరారు. విచారించిన సింగిల్ బెంచ్ శేరిలింగంపల్లి తహసీల్దార్‌కు రెండు నెలల జైలు శిక్షతో పాటు రూ.1500 జరిమానా వి ధించింది. దీనిపై అప్పటి తహసీల్దార్ తిరుపతిరావు డివిజన్ బెంచ్‌కు అపీల్ చేశారు. పరిశీలించిన ధర్మాసనం తహసీల్దార్‌పై ఉన్న కోర్టు ధిక్కారణ కేసును కొట్టివేసింది. ప్రైవేట్ వ్యక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు పరిశీలించిన దేశ అత్యున్నత న్యాయ స్థానం రాయదుర్గం సర్వే నంబర్ 46లోని 84 ఎకరాల 30 కుంటలు భూ మి ప్రభుత్వానిదేనని తీర్పు చెప్పింది. ఎన్నికలు ఉండడంతో రెవెన్యూ అధికారులు భూమిని స్వాధీనం చేసుకోవడానికి ఆసక్తి చూపలేదు. ఉదయం రెవెన్యూ అధికారులు, సిబ్బంది జేసీబీలతో నిర్మాణాలను కూల్చివేసి ప్రభుత్వ భూమిలో బోర్డులు పెట్టారు. సినీ హీరో ప్రభాస్ 2200 గజాల స్థలంలో గెస్టు హౌస్‌తోపాటు జిమ్ ఏర్పాటు చేసుకున్నారు. చాలాకాలం క్రితమే భూమి క్రమబద్ధీకరణ కోసం ప్రభాస్ 59 జీఓ కింద ధరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. కార్యక్రమంలో శేరిలింగంపల్లి తహసీల్దార్ వాసుచంద్ర, ఆర్‌ఐలు నిహాంత్, వరుణ్, వీఆర్‌ఓ సిబ్బంది పాల్గొన్నారు.
రైతులు ‘్ఫసల్‌బీమా యోజన’ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
మేడ్చల్, డిసెంబర్ 17: మేడ్చల్ మండల రైతులు ప్రధానమంత్రి ‘్ఫసల్‌బీమా యోజన’ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేడ్చల్ మండల వ్యవసాయ అధికారిణి అర్చన సూచించారు. సోమవారం మండలంలోని రాయిలాపూర్ గ్రామంలో ఫసల్‌బీమా యోజన పథకంపై రైతులకు అవగాహన కల్పించారు. ఏవో మాట్లాడుతూ వరి పంటకు రైతు యూనిట్ కింద ఎకరాకు రూ. 450 చొప్పున బీమా ప్రీమియం చెల్లించినట్లయితే పంట నష్టపోయిన యేడల ఎకరాకు 34 వేల రూపాయలు బీమా వర్తిస్తుందని వివరించారు. బీమా ప్రీమియం చెల్లింపు చివరి తేదీ ఈ నెల 31 అని రైతులు ఈ అవకాశాన్ని రబీలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు.