రంగారెడ్డి

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, డిసెంబర్ 17: నూతన సంవత్సరం వేడుకలో భాగంగా డిసెంబర్ 31 రాత్రి నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని నూతన సంవత్సరం వేడుకల్లో ఎలాంటి అపశ్రుతులు, ప్రమాదాలు లేకుండా జరుపుకోవాలని సూచించారు. కమిషనరేట్ పరిధిలోని స్టార్ హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్టు, ఫాంహౌస్‌లు, రిస్టార్ట్‌ల యాజమాన్యలతో వేడుకల సంబంధించి సీపీ సమావేశం నిర్వహించారు. వేడుకల సందర్భంగా మద్యం మత్తులో ఎంతో మంది విలువైన ప్రాణాలను కోల్పోవడమే కాకుండా ఇతరుల ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నారని చెప్పారు. గత ఎడాది పోలీసులు తీసుకున్న చర్యలతో కమిషనరేట్ పరిధిలో ఎలాంటి ప్రమాదాలు ప్రాణ నష్టం జరగలేదని అన్నారు. స్వాగతం వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇటీవల కాలంలో కొన్ని రిసార్ట్‌లు, స్టార్ హోటళ్లలో అసాంఘీక కార్యకాలపాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వస్తున్నాయని అలాంటి వారిటిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించా రు. న్యూ ఇయర్ వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని, శాంతి భద్రతల కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. వేడుకల నిర్వాహకులు 7రోజుల ముందు పోలీసులు అనుమతి తీసుకోవాలని చెప్పా రు. రాత్రి 8గంటల నుంచి 1గంట వరకు అనుమతి ఉంటుందని చెప్పిన సీపీ ఉదయం వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని తెలిపారు. డీజేలకు అనుమతి లేదని సౌండ్ సిస్టమ్ విషయంలో సుప్రీం కోర్టు మార్గదర్శకాలు పాటించాలని కోరారు. రేవ్ పార్టీలకు అనుమతి లేదని డ్రగ్స్, హుక్కా సేవించడం నిషేధమని, డ్రగ్స్ వాడకంపై నిఘా పెట్టినట్లు సీపీ వివరించారు. నిర్వాహకులు అగ్నిమాపక శాఖ, స్థానిక పోలీసుల నుంచి అనుమతులు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈవెంట్ నిర్వహకు లే సేఫ్టీ బాధ్యత వహించాలని తెలిపా రు. న్యూ ఇయర్‌కు సంబంధించి అర్ధ నగ్న చిత్రాలతో హోల్డింగ్‌లు ఏర్పాటు చేయడం ప్రసాద మాద్యమాల ద్వారా ప్రచారం చేయకూడదని హెచ్చరించా రు. అతిగా మద్యం సేవించిన వారిని నిర్వహకులు క్యాబ్ ల్లో ఇంటికి తరలించాలని సూచించారు. ఓఆర్‌ఆర్‌పై రాత్రి 11 నుంచి ఉదయం 5గంటల వరకు ఆంక్షాలు ఉంటాయిని ఎయిర్ పోర్టుకి వెళ్లే వారికి మినాహాయింపు ఉంటుందని సీపీ చెప్పారు. ట్రాఫిక్ ఏసీపీ విజయ్ కుమార్, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు, అడ్మిన్ ఏడీసీ పీ నరసింహ, ఏసీపీలు పాల్గొన్నారు.
వికారాబాద్‌పై పెథాన్ తుపాన్ ప్రభావం
వికారాబాద్, డిసెంబర్ 17: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన పెథాన్ తుఫాన్ ప్రభావం వికారాబాద్ జిల్లాపై చూపింది. సోమవారం ఆకాశం మబ్బులతో కూడుకుని ఉండటమే కాకుండా చల్లటి గాలి వీచింది. ఎపుడు వర్షం కురుస్తుందో అన్నట్టుగా వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది. ఇళ్ల నుంచి బయటకు వచ్చేవారు ఉన్ని దుస్తులు ధరించారు. కొందరు ఇళ్లకే పరిమితం అయ బయటకు వచ్చినవారు ఇంటికి ఎపుడు చేరుకుంటామా అన్న తొందరలో కనిపించారు. ఇక టీస్టాళ్లు, వేడి తినుబండారాల దుకాణాల వద్ద జనం సంఖ్య పెరిగింది. సూర్యుడు గాని సూర్యుడి ప్రభావం కాని అస్సలు కనిపించలేదు. గత రెండు రోజులుగా వాతావరణం చల్లగానే ఉండటమే కాకుండా సూర్యుడు ఇలా వచ్చి అలా మాయమయ్యాడు. అంతకు ముందు రాత్రి వేళ భారీవర్షం కురిసింది. వర్షం కురిస్తే చెరువులు, బావులలోకి నీరు చేరి వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ఉంటుందని జనం అభిప్రాయపడుతున్నారు.
దేవులా నాయక్ తండాలో పండుగ సంబురాలు
బొంరాస్‌పేట, డిసెంబర్ 17: గిరిజనుల పండుగ ఉత్సవాల్లో భాగంగా సోమవారం మండల పరిధిలోని దేవులా నాయక్ తండా వాసులు పండుగ సంబురాలు ఘనంగా నిర్వహించారు. తుల్జ్భావాని మాత చిత్రపటాలను ఉంచి నైవేధ్యాలు సమర్పించారు. తీపి వంటలతో ప్రారంభమైన పూజలు మంగళవారం మాంసాహారం వండి తమ బందుమిత్రులను ఆహ్వానించి విందు ఏర్పాటు చేస్తామని గిరిజన విద్యార్థి సంఘం నాయకుడు నెహ్రు నాయక్ తెలిపారు. పూజా కార్యక్రమంలో విష్ణునాయక్, ప్రేమ్, బాలు, రాము, తులసిరాం, దేవేందర్,రాజేష్, అనిల్, బలరాం నాయక్ పాల్గొన్నారు.