రంగారెడ్డి

భక్తులపై దుండగుల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేర్యాల, మే 15: వరంగల్, మెదక్ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న కొండపోచమ్మ దేవాలయానికి వచ్చిన భక్తులపై గుర్తు తెలియని వ్యక్తులు రాడ్లు, కర్రలతో దాడిచేసి మహిళల మెడలో ఉన్న మూడున్నర తులాల బంగారాన్ని అపహరించుకుపోయిన సంఘటన ఆదివారం జరిగింది. హ్దైరాబాద్‌లోని జియాగూడలో ఉంటున్న ఒకే కుటుంబానికి చెందిన దాదాపు 30మంది కొండపోచమ్మ తల్లిని దర్శించుకోవడానికి ఆదివారం ఉదయం వచ్చారు. తర్వాత కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు దేవాలయానికి వచ్చిన వారిని హేళన చేస్తూ దుర్భాషలాడారు. ఆ సమయంలో స్ర్తిలు స్పందించి వారిని వారించారు. దీంతో ఆ నలుగురు తమ మిత్రులకు సమాచారం అందించగా మరో నలుగురు కారులో అక్కడికి చేరుకున్నారు. అప్పటికే వంటలు వండుకొని భోజనాలు చేయడానికి ఉపక్రమించిన భక్తులపై ఒక్కసారిగా రాడ్లు, కర్రలతో ఆ గుర్తు తెలియని ఎనిమిది మంది దాడికి దిగారు. ఆకస్మాత్తుగా జరిగిన ఈ దాడితో భక్తులు భయబ్రాంతులకు గురయ్యారు. ఒక్కొక్కరినీ రాడ్లు, కర్రలతో కొట్టడంతో రమేష్ అనే వ్యక్తికి తీవ్రగాయాలు కాగా నవీన్‌కుమార్, నాగేష్, సురేష్, ఉదయ్‌కుమార్, నరేష్, మహేష్, చంద్రకళ, విద్య, సునితలకు గాయాలయ్యాయి. ఈ దాడి సంఘటనను చుట్టుపక్కన ప్రాంతంలో ఉన్నవారు గమనించి అక్కడికి చేరుకునే క్రమంలో మహిళల మెడలో ఉన్న మూడున్నర తులాల బంగారాన్ని లాక్కొని ఆ దుండుగులు అక్కడి నుంచి పరారయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న కొంతమంది భక్తులు 108కు ఫోన్ చేయడంతో వెంటనే గాయాలైన వారిని చేర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స నిర్వహించారు. ఇలాంటి ఘటన జరగడంతో భక్తులు భయబ్రాంతులకు గురవుతున్నారు. పోలీసులు వెంటనే దుండగులను పట్టుకొని వారిపై చర్యలు తీసుకొని భక్తులకు రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.