రంగారెడ్డి

యూత్ పార్లమెంట్‌కు ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జనవరి 17: జాతీయ సేవాపథకం, నెహ్రూ యువ కేంద్రం(ఎన్‌వైకే) సంయుక్త ఆధ్వర్యంలో ఎస్‌ఏపీ కళాశాలలో జిల్లా యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో భాగంగా ఈనెల 17, 18, 19 తేదీలలో నిర్వహించే ఎంపికలో భాగంగా మొదటి రోజైన గురువారం విద్యార్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జే.మందారిక మాట్లాడుతూ కళాశాల స్థాయిలోని విద్యార్థులు యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొనడం మూలాన రాజకీయ పరిజ్ఞానాన్ని పొందుతారని పేర్కొన్నారు. న్యాయ నిర్ణేతలుగా సీ.సోమన్న, పీ.నాగరాజు వ్యవహరించారు. ఎంపికకు జిల్లాలోని వివిధ ప్రాంతాలలోని కళాశాలల నుండి విద్యార్థులు, యువత పాల్గొనాలని అన్నారు. ఎంపిక కార్యక్రమం ఈనెల 18, 19 తేదీలలో సైతం నిర్వహించనున్నట్లు జిల్లా నోడల్ అధికారి నాగరాజు తెలిపారు. ఎంపికలో మెరిట్ సాధించిన అధ్యక్షుడు మాత్రమే ఈనెల 28న నిర్వహించే జిల్లా స్థాయి పోటీలో పాల్గొనేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. జిల్లా స్థాయిలో మెరిట్ సాధించినవారు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాల్గొంటారని వివరించారు.