రంగారెడ్డి

భయాందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుషాయిగూడ, జనవరి 18: కాప్రాలో సిలిండర్ పేలుడుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. బంగారు వ్యాపారం చేసే మోహన్‌లాల్ చౌదరి.. ఇంట్లో బంగారానికి సంబంధించిన కెమికల్ నిల్వలు భారీగా డంప్ చేయడంతో పేలుడు సంభవించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
సిలిండర్ పేలుడుతో ఇంత విధ్వంసం సంభవించదని కేవలం పేలుడు సంబంధిత పదార్ధాలు నిల్వచేయడంతో భారీ పేలుడు జరిగిందని స్ధానిక ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నరు. ఉదయం 7.30 గంటలకు ఒక్కసారిగా భారీగా పేలుడు విధ్వంసంతో చూట్టు ప్రక్కల ఇళ్లు పాక్షికంగా ధ్వంసమై ఆస్తి నష్టం జరిగిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేలుడు ధాటికి చుట్టు ప్రక్కల ఇళ్లు కిటికీల అద్దాలు పగిలిపోయి స్ధానికులకు తీవ్ర గాయలపాలైనట్లు అధికారులు తెలిపారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. మోహన్‌లాల్ చౌదరి బంగారానికి సంబంధించిన కెమికల్ నిల్వలు డంప్ చేయడంతో భారీ పేలుడు సంభవించిందని అధికారులకు స్థానిక ప్రజల ఫిర్యాదు చేశారు. పేలుడు ధాటికి సమీపంలోని లైఫ్‌లైన్ ఆసుపత్రిలో సుమారుగా రూ.7 లక్షల మేర ఆస్తి ధ్వంసమైనట్లు డాక్టర్ కోటేశ్వర్ రావు తెలిపారు.
భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో భవనం గ్రిల్స్ శకలాలు ఆసుపత్రి కిటికీలకు తగలడంతో రోగులు భయందోళనకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. డయాగ్నస్టిక్ యంత్రాలు పూర్తిగా ధ్వంసమైనట్లు పేర్కొన్నారు. ఆసుపత్రిలో ఏసీ, టీవీలు, కుర్చీలు పాక్షికంగా ధ్వంసమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు డాక్టర్ కోటేశ్వర్ రావు తెలిపారు.