రంగారెడ్డి

ఘట్టు మైసమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, జనవరి 18: కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పు దైవంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ ఘట్టు మైసమ్మ తల్లి జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మండల కేంద్రంలో కొండ గట్టుపై స్వయంభుగా వెలసిన అమ్మలగన్న ఆమ్మగా పేరొందిన ఘట్టు మైసమ్మ తల్లి జాతర ఉత్సవాలు ప్రతి యేటా సంక్రాంతి పర్వదినం అనంతరం వచ్చే మొదటి ఆదివారం జరపటం అనవాయితీగా వస్తుంది. సంక్రాంతి పండగకు తల్లి వారింటికి వచ్చిన ఆడ పడుచులు ఘట్టు మైసమ్మ జాతర ఉత్సవాల వరకు ఉంటారు. కొండ గట్టుపై వెలసిన ఘట్టు మైసమ్మ తల్లి పేరుతోనే ఈ గ్రామానికి ఘట్‌కేసర్‌గా పేరు వచ్చినట్లు పూర్వికులు తెలిపారు. అమ్మవారి పసుపు, కుంకుమలు కలిపిన నీటిని పంట పోలాలలో కలిపితే పంటలు బాగా పండుతాయని పెద్దలు చెబుతుంటారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన వారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాడ విశ్వాసం. ఘట్టు మైసమ్మ తల్లి కరుణ కటాక్షాలతో ఆరోగ్యాలు బాగా లేనివారికి సంపూర్ణ ఆరోగ్యం, పిల్లలు కాని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు నమ్మకంతో పూజలు చేస్తుంటారు. కొండ గట్టుపై గుహలో వెలసిన అమ్మవారిని దర్శించుకునేందుకు ఘట్‌కేసర్ మండలంతో పాటు పోచంపల్లి, కీసర, బీబీనగర్ మండలాలతో పాటు జంటనగరాల నుంచి భక్తులు అమ్మవారి ఆలయం ఆవరణలో గుడారాలు ఏర్పాటు చేసుకుని బోనాలు సమర్పిస్తుంటారు. మైసమ్మ తల్లి ఆలయం నుంచి పసుపు కుంకుమలు తీసుకుని వెళ్లిన తర్వాతనే నగరంలోని గోల్కొండ, సికింద్రాబాద్ మహంకాళి జాతర ఉత్సవాలు జరపటం అనవాయితీగా వస్తుంది. ఆదివారం జరిగే జాతర ఉత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు, మహిళలు వచ్చి ప్రత్యేక పూజలు జరపటం అనవాయితీగా వస్తుంది. ఘట్టు మైసమ్మ ఆలయం రాష్ట్ర దేవదాయ, ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలోకి రావటంతో ప్రభుత్వ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఆదివారం జరిగే శ్రీఘట్టు మైసమ్మ తల్లి జాతర ఉత్సవాలను విజయవంతం చేసేందుకు మండల తహశీల్దార్ పద్మప్రియ.. వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, అన్ని శాఖల అధికారుల పర్యవేక్షణ తప్పకుండా ఉండాలని సూచించారు. భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు సవ్యంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతర ఉత్సవాల ఏర్పాటులో ఆలయ నిర్వహణాధికారిని భాగ్యలక్ష్మి నిమగ్నమై పనులను వేగవంతం చేస్తున్నారు. ఇన్‌స్పెక్టర్ రఘువీర్ రెడ్డి, ఎంపీడీఓ అరుణ, మండల విస్తరణాధికారి సునంద పాల్గొన్నారు.