రంగారెడ్డి

రెండో విడత ‘పంచాయతీ’ పోలింగ్‌కు ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జనవరి 22: నగర శివారు కాచవానిసింగారం గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. 25న రెండో విడుత ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు పంచాయతీ కార్యదర్శి రామ్మోహన్ రావు తెలిపారు. గ్రామంలోని 10 వార్డులలో మొత్తం ఓట్లు 3416 ఉండగా తాజాగా 103 కొత్తగా ఓట్లు వచ్చాయి. మూడు పోలింగ్ కేంద్రాలలో 10 బూత్‌లు ఉన్నాయి. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ ఉంటుందని, మధ్యలో ఒకగంట భోజన విశ్రామం అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుందని అన్నారు. అదే రోజు ఉపసర్పంచ్ ఎన్నిక జరుగుతుందని పేర్కొన్నారు.
ఓటరు స్లిప్పుల పంపిణీ
ఎన్నికల ప్రక్రియలో భాగంగా మంగళవారం నుంచి ఇంటింటికి ఓటరు స్లిప్పుల పంపిణీ ప్రారంభించామని కార్యదర్శి రామ్మోహన్ తెలిపారు. 24వ తేదీలోగా స్లిప్పుల పంపిణీ పూర్తవుతుందని, సకాలంలో అందకపోతే పంచాయతీ కార్యాలయంలో వచ్చి తీసుకోవాలని పేర్కొన్నారు.
పటిష్టమైన పోలీసు బందోబస్తు
పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని మేడిపల్లి ఇన్‌స్పెక్టర్ అంజిరెడ్డి పేర్కొన్నారు. 25న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కాచవానిసింగారం, ప్రతాప్‌సింగారంలో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ పర్యవేక్షణలో డీసీపీ ఉమామహేశ్వర శర్మ, ఏసీపీ సందీప్ ఆధ్వర్యంలో గట్టి నిఘా పెట్టామని అన్నారు. సమస్యాత్మక ప్రాంతమైన కాచవాని సింగారంలో ప్రత్యేక స్పెషన్ పోలీసు బలగాలను రంగంలోకి దింపినట్లు వివరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాల నిఘాలో ఎన్నికలు, ఓట్ల లెక్కింపు జరుగుతుందని, అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించేందుకు సహకరించాలని పేర్కొన్నారు. సంఘవిద్రోహుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సి వస్తోందని హెచ్చరించారు.
హోరాహోరీగా ప్రచారం
కులకచర్ల: ఉపసంహరణలు ముగిశాయి. ఇక సమరమే తరువాయి అనే రీతిలో కులకచర్ల మండలంలోని పలు గ్రామాల్లో పంచాయతీలకు పోటీలకు పోటే చేసే వారి పరిప్థితులున్నాయి. అనేకమంది తమకు అనుకూలమైన గుర్తు రావడం కోసం వేరే వారిచేత నామ పత్రాలు దాఖలు చేయించారు. చాలమంది ఉంగరం గుర్తు కోసం ఆరాటపడ్డారు. తెలుగు వర్ణమాల ప్రకారం మొదటి అక్షరం ఎవరికి వస్తే వారికి ఉంగరం గుర్తు కేటాయిస్తారు. తర్వాత గుర్తు కత్తెర కావడంతో ఈ గుర్తు వస్తే ఓట్లు పడవనే విశ్వాసం చాల మందిలో ఉండడంతో ఇలాంటి గుర్తులు డమీలకు వచ్చేలా చేసి అసలు అభ్యర్థికి మంచి గుర్తు రావడంకోసం కూడా నామపత్రాలను దాఖలు చేయించారు. ఎట్టకేలకు ఉపసంహరణ ముగియడంతో ఇటు అధికారులు, అటు అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవంగా సర్పంచ్‌లను ఎన్నుకున్నారు. కులకచర్ల మండలం చౌడాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా రంగారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చౌడాపురం త్వరలోనే మండలంగా మారనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించడంతో ఇదే పార్టీకి చెందిన రంగారెడ్డిని మండల భవనాల నిర్మాణాలకు స్థలం అడగడంతో ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. దీంతో అతన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుందామని గ్రామస్థులు తీర్మానించి మిగతావారు ఉపసంహరించుకున్నారు. వీరితో వార్డు సభ్యులంతా కూడా ఏడుగురు ఉప సంహరించారు. కానీ, ముగ్గురు ఉప సంహరించుకోకపోవడంతో ఈ గ్రామంలో వార్డు సభ్యులకు ఎన్నికలు జరగనున్నాయి. ఉప సంహరించుకోని వారిపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గ్రామంతో పాటు హన్మనాయక్ తండా, చెరువుముందలి తండా, బజ్యానాయక్ తండా, లాల్‌సింగ్ తండా, పటేల్ చెరువు తండా, బిందెంగడ్డ తండా, అల్లాపురం తదితర గ్రామాల సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
గ్రామానికి భారీగా
నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తా
వికారాబాద్: పీరంపల్లి గ్రామానికి భారీగా నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి ఉమాదేవి అన్నారు. మంగళవారం గ్రామంలో ప్రచారం నిర్వహించిన సందర్భంగా మాట్లాడుతూ గ్రామ సమస్యలను మండల సర్వసభ్య సమావేశంలో లేవనెత్తి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. గ్రామానికి రవాణ వసతులు మెరుగయ్యేలా చూస్తానని, గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఎప్పటికపుడు కనీస వసతులను పర్యవేక్షిస్తానని, బ్యాట్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు గురువారెడ్డి, పెంటారెడ్డి, రాంచందర్, మురళీధర్ రెడ్డి పాల్గొన్నారు.
రసవత్తంగా పంచాయతీ పోరు
మహేశ్వరం: మూడో విడతలో ఎన్నికలు జరిగే గ్రామాల్లో షెడ్యూల్ ప్రకటన ఆశావహుల్లో ఎంత ఆనందాన్ని నింపిందో అంతే స్థాయిలో ఆందోళన కలిగిస్తోంది. ఓ వైపు పదవులు ఊరిస్తుంటే మరోవైపు ఖర్చుల భారం వెనక్కు లాగుతోంది. అన్ని పార్టీల్లో పల్లె పదవులకు పోటీ చేయాలనుకునే వారిలో ఇలాంటి పరిస్థితే కనబడుతోంది. దీనికి ప్రధాన కారణం తమ అనుచరవర్గం చేజారి పోకుండా ఇప్పటి నుంచే భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడడం. మహేశ్వరం, కందుకూర్ మండలాల్లో మూడోవిడత అంటే ఈనెల 30న ఎన్నికలు జరుగనున్నాయి. నామినేషన్లు ఉపసంహరణ కూడ పూర్తి అయ్యింది.
ఎనిమిది రోజులే సమయం
పల్లెలకు భారీగా నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో అందరిలోనూ పంచాయతీ పదవులపై ఆస్తకి పెరిగినా ఖర్చులను చూసి కొందరు వెనుకడుగు వేస్తున్నారు. చివరి విడతలో ఈనెల 30న పోలింగ్ జరగనుంది. మహేశ్వరం, తుమ్మాలూర్, మన్‌సాన్ పల్లి, గట్టుపల్లి, దుబ్బచర్ల, అమీర్‌పేట్, నాగారం, మానిక్యమ్మగూడ, పోరండ్ల గ్రామాల్లో అభ్యర్ధుల మధ్య పోటీ హోరాహోరీగా నెలకొంది. ఇప్పటికే ఆయా గ్రామాల్లో రూ.20 లక్షల నుంచి రూ.60 లక్షలకుపైగా ఖర్చు చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్ధుల పాట్లు
ఘట్‌కేసర్: గ్రామ పంచాయతీ రెండవ విడత ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బరిలో ఉన్న అభ్యర్ధులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తు విచ్చలవిడిగా డబ్బులు మద్యం పంపిణీ చేస్తు ఓటర్లను ఆకర్షించే యత్నం చేస్తున్నారు. మండల పరిధి ఏదులాబాద్, అవుషాపూర్, అంకుషాపూర్, కొర్రెముల చౌదరిగూడ, ప్రతాపసింగారం, మర్పల్లిగూడ, వెంకటాపూర్ గ్రామాలలో సర్పంచ్, వార్డు మెంబర్ల బరిలో ఉన్న అభ్యర్ధులు పోటాపోటీగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఒక్క ఓటుకు రెండు నుండి మూడు వేలు పంచుతున్నారు. నిత్యం ఇంటింటికి బిర్యానీ పాకెట్‌తో పాటు మద్యం బాటిళ్లు పంచుతున్నారు. మహిళా సంఘాలు, కుల సంఘాలు, యువజన సంఘాలకు లక్షలకొద్ది డబ్బులు అప్పగిస్తు మద్దతును కూడగట్టుకుంటున్నారు. గ్రామాలలో మెజారిటీగా ఉన్న సామాజిక వర్గాలకు సంబంధించి ఉన్నత స్థాయిలో ఉన్న నాయకులను గ్రామాలకు రప్పించి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒక్క అభ్యర్ధి డబ్బులు పంపిణీ చేసినట్లు తెలిస్తే ప్రత్యర్ధి అభ్యర్ధులు పోటీగా ఎక్కువ డబ్బులు పంచుతూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఓటర్లకు రంగంలో ఉన్న ప్రతి అభ్యర్ధి నుండి డబ్బులు, మద్యం, బిర్యానీ పాకెట్లు అందుతుండటంతో పండుగ చేసుకుంటున్నారు. బరిలో ఉన్న అభ్యర్ధులు అందరూ ఓటర్లను మభ్యపెట్టే యత్నం చేస్తుండటంతో ఓటర్లలో అయోమయం నెలకొని ఎవరికి ఓటు వేయాలో ఆలోచనలో పడ్డారు. ఎవరు ఎంత యిచ్చినా తమ యిష్టం వచ్చిన వారికే ఓట్లు వేస్తామని కొందరు అంటుండగా ఎవరు ఎక్కువ యిస్తే వారికే వేస్తామని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ మినహా మిగతా స్థానాలలో విచ్చలవిడిగా డబ్బులు, మద్యం పంపిణీ జరుగుతున్నట్లు సమాచారం. ఎన్నికల అధికారులు, పోలీసులు అధికార పార్టీ అభ్యర్ధులకు పరోక్ష సహకారం అందిస్తు ఇతర పార్టీల అభ్యర్ధులను యిబ్బందులకు గురి చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి డబ్బులు, మద్యం పంపిణీలను అడ్డుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అధికారమే లక్ష్యంగా పాటు పడుతున్న వారిని ఓడించేలా ప్రజల కృషి చేయాలని మేథావి వర్గాలు కోరుతున్నారు.

అభివృద్ధికే పట్టం కట్టాలి: మంచిరెడ్డి
యాచారం, జనవరి 22: అభివృద్ధి నినాదంతో ప్రజల్లోకి వచ్చే టీఆర్‌ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను వారిని గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టాలని స్థానిక శాసన సభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం మండల పరిధిలోని కొత్తపల్లితో పాటు వివిధ గ్రామాల్లో టీఆర్‌ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, గ్రామాల అభివృద్ధి కోసం పనిచేసే వారినే సర్పంచ్ అభ్యర్థులుగా బలపరిచి మద్దతుతెలిపినట్లు చెప్పారు. వారినే గెలిపించి గ్రామాల సమగ్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రచారంలో యాచారం జడ్పీటీసీ రమేష్‌గౌడ్, వివిధ గ్రామాల సర్పంచ్ అభ్యర్థులు, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
పుల్‌మద్ది గ్రామ రూపురేఖలు మారుస్తా
వికారాబాద్, జనవరి 22: సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామ రూపురేఖలు మారుస్తామని పుల్‌మద్ది గ్రామ సర్పంచ్ అభ్యర్థి తిమ్మాపురం మాధవ రెడ్డి అన్నారు. మంగళవారం గ్రామంలో ప్రచారం నిర్వహించిన సందర్భంగా మాట్లాడుతూ గతంలో సర్పంచ్‌గా పనిచేసిన అనుభవం తనకుందని, ఏ సమస్య ఎలా పరిష్కరించాలని, నిధులు ఎలా ఎక్కడ నుండి తేవాలో అన్ని విషయాలు తనకు తెలుసునని చెప్పారు.