రంగారెడ్డి

తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటున్న జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, మే 18: తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగేలా జలదీక్ష చేసిన వైయస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి గుణపాఠం చెప్పేందుకు ప్రతి తెలంగాణ బిడ్డ సిద్ధం కావాలని టిఆర్‌ఎస్ జిల్లా ప్రధానకార్యదర్శి దర్గ దయాకర్‌రెడ్డి తెలిపారు. హైద్రాబాద్-వరంగల్ జాతీయ రహదారి ఘట్‌కేసర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఆవరణలో తెలంగాణ ప్రాంతంలో నిర్మించనున్న ప్రాజెక్టులను అడ్డుకునేందుకు యత్నించటంతో పాటు ముఖ్యమంత్రి కేసిఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని నిరసిస్తూ బుధవారం జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో జరిపారు. అనంతరం జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తెలంగాణ ప్రాంతాన్ని దోచుకున్న దొంగ జగన్ కేసిఆర్‌ను విమర్శించే స్థాయి కాదన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవించని జగన్మోహన్‌రెడ్డిని ఆయన పార్టీని తెలంగాణ ప్రజలు బహిష్కరించాలని, ఆ పార్టీకి రాజీనామాలు చేసి బయటకు రావాలని పిలుపునిచ్చారు. జగన్ పార్టీలో కొనసాగితే తెలంగాణ ద్రోహులు అవుతారన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని, దొంగ జలదీక్షను మానుకుని తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా మెలగాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ఐటి, మున్సిపల్
శాఖ మంత్రి కేటిఆర్
ఘట్‌కేసర్, మే 18: చిరు వ్యాపారులకు మోడల్ మార్కెట్ సదుపాయం కల్పించటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ తెలిపారు. ఉప్పల్‌లో నూతనంగా నిర్మిస్తున్న ఇండోర్ స్టేడియం, మోడల్ మార్కెట్‌ను రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్, ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు, జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్ధన్‌రెడ్డిలు ఆకస్మికంగా పర్యటించి పరిశీలించారు.
ఉప్పల్ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న ఇండోర్ స్టేడియం, మోడల్ మార్కెట్ నిర్మాణాల పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్‌లో క్రీడాకారులతో కలిసి మంత్రి కేటిఆర్ క్రికెట్ అడారు. చిరువ్యాపారులు రోడ్లపై కూరగాయల వ్యాపారం చేసుకుంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వినియోగదారులు సైతం సులువైన పద్ధతిలో కొనుక్కునేందుకు వీలుగా మోడల్ మార్కెట్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు తెలిపారు. క్రీడాకారులకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. అందులో భాగంగా ఉప్పల్ పట్టణంలో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరిచి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ నిరంతరం కృషి చేస్తున్నట్టు చెప్పారు.
చిరువ్యాపారులకు వెసులుబాటు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు మాట్లాడుతూ గ్రేటర్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చేస్తున్న ఆలోచనలను మంత్రి కేటిఆర్ నెరవేర్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. ప్రపంచంలోనే భాగ్యనగరాన్ని అన్ని హంగులతో ఆదర్శంగా నిలపటమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అన్నిరకాల వ్యాపారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్‌రెడ్డి, ఉప్పల్ డిప్యూటీ కమీషనర్ కెజె విజయకృష్ణ, కార్పొరేటర్లు మేకల అనలారెడ్డి, నాయకులు నేర్ధం భాస్కర్, మేకల హన్మంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కారులోమంటలు
ఖైరతాబాద్, మే 18: జూబ్లీహిల్స్ రోడ్‌పై ప్రయాణిస్తున్న కారులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వివరాల్లోకి వెళితే...నవీన్ తన కుటుంబ సభ్యులతో అపోలో ఆసుపత్రి వైపు నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపుకు వెళుతుండగా, వారు ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగాయి. కొద్ది క్షణాల్లో మంటలు తీవ్ర రూపం దాల్చడంతో కారును నవీన్ నిలిపివేయడంతో అందులో ఉన్న కుటుంబ సభ్యులు దిగిపోయారు. విషయం తెలుసుకున్న జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని ఫైర్ సిబ్బందికి ఫోన్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోనికి తెచ్చారు. బుధవారం సాయంత్రం సమయంలో ఘటన చోటుచేసుకోవడంతో సాదారణంగానే రద్దీగా ఉండే ఈ రోడ్డులో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ ఎస్సై రాఘవరావు ఆధ్వర్యంలోని బృందం ట్రాఫిక్‌ను నియంత్రించారు.
ఇంకుడు గుంత గొయ్యిలో పడి బాలుడి మృతి
జవహర్‌నగర్, మే 18: ఇంకుడు గుంతలో పడి ఓ బాలుడు మృతి చెందిన సంఘటన జవహర్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం ఇబ్రహీం (17) పదవ తరగతి చదువుతున్నాడు. తండ్రి బషీర్ తల్లీ షబానాబేగం వీరు జవహర్‌నగర్‌లోని చెన్నపురం, దేవేందర్‌నగర్‌లో నివాసముంటున్నారు. తండ్రి దమ్మాయిగూడలోని ఆంధ్రాబ్యాంకులో అటెండరుగా పనిచేస్తున్నాడు. వేసవి సెలవులు కావడంతో రోజు మాదిరిగా ఇబ్రహీం మంగళవారం ఆడుకుంటానని వెళ్లాడు. రాత్రి వరకు రాకపోవడంతో ఇబ్రహీం స్నేహితులను వాకబు చేసారు. ఎలాంటి సమాచారం తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసు స్టేషన్ ఆవరణలో ఈమధ్య కాలంలో ఇంకుడు గుంత తవ్వి పూడ్చడం మర్చిపోయారు. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇబ్రహీం మృతదేహాన్ని అందులో ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంతలో తల్లిదండ్రులు బంధువులు, ప్రజా సంఘాల నాయకులు అక్కడికి చేరుకొని పోలీసుల నిర్లక్ష్యనికే బాలుడు మృతి చెందాడని పోలీసుస్టేషన్‌లో ఆందోళన చేపట్టారు. వెంటనే మల్కాజిగిరి ఇన్‌చార్జి డిసిపి రాంచంద్రారెడ్డి జవహర్‌నగర్ పోలీసు స్టేషన్‌కు చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పాడు. చనిపోయిన బాలుడి కుటుంబానికి నష్టపరిహారం ఇప్పిస్తానని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవానికి అవార్డుల ప్రదానం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 18: రంగారెడ్డి జిల్లాలో పలు రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక అవార్డులను ప్రదానం చేయనున్నట్టు జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దినోత్సవం జిల్లా వ్యాప్తంగా పండగ వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సరూర్‌నగర్, వికారాబాద్‌లో వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్టు ఆమె తెలిపారు. వేడుకల్లో భాగంగా రంగారెడ్డి కలెక్టరేట్‌తోపాటు జిల్లా పరిషత్ కార్యాలయం, సరూర్‌నగర్‌లోని విక్టోరియా మెమోరియల్ హోమ్‌ను విద్యుత్ దీపాలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించినవారికి నగదు బహుమతిగా 51,116 రూపాయలు ప్రదానం చేయడం జరుగుతుందని ఈ అవార్డులకు దరఖాస్తు చేసుకునేవారు ఈ నెల 24లోగా సంబంధిత అధికారులకు పూర్తి వివరాలతో అందచేయాలని ఆమె ఆదేశించారు. అవార్డులకోసం ఎంపిక చేసే కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వివిధ శాఖల అధికారులను ఆమె నియమించారు. సమావేశంలో డిఆర్‌ఓ ధర్మారెడ్డి, డిపిఓ అరుణ, డిఇఓ రమేష్ పాల్గొన్నారు.

వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరణ

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 18: జిల్లాకు 2016-17 ఆర్థిక సంవత్సరానికి సుమారు 8,269.30 కోట్ల వ్యయ వార్షిక రుణ ప్రణాళికను రంగారెడ్డి కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు ఆవిష్కరించారు. బుధవారం తెలంగాణ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి సంస్థలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో రుణ వార్షిక ప్రణాళికను ఆవిష్కరించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన్యతా రంగాలకు సుమారు రు.5258.95 కోట్ల నిధులను కేటాయించడం జరిగిందన్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో స్వయం సహాయక బృందాలకు ఇచ్చే రుణాల విషయంలో బ్యాంకర్లు లక్ష్యాన్ని మించి సాధించడం పట్ల కలెక్టర్ వారిని అభినందించారు. వివిధ సంక్షేమ శాఖలు అందిస్తున్న పథకాలు దారిద్య్ర రేఖకు దిగువన వున్న ప్రజలకు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యాలు మార్చి ఆఖరులోగా పూర్తి చేసేలా అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో కృషి చేయాలని అన్నారు. గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని నిర్ణీత గడువులోగా రుణాలు మంజూరు చేయాలని సూచించార. రైతులు సాగుచేసే పంటను బట్టి రుణాలు మంజూరు చేయాలని సూచించారు. రుణ మాఫీకి సంబంధించి ప్రభుత్వం మరో 22 కోట్లు రావాల్సి వుందని తెలిపారు. రుణ మంజూరీలో బ్యాంకుల పనితీరును బట్టి ప్రభుత్వ నిధులను ఆ బ్యాంకుల్లో జమ చేయడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. స్థోమత ఉన్నప్పటికీ రుణాలు పొంది తిరిగి చెల్లించని వారి జాబితాను తయారుచేసామని వారినుండి రుణ మొత్తాన్ని రికవరీ చేసేందుకు తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. చేవెళ్ల ఎంపి కొండా విశే్వశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ గత వార్షిక ప్రణాళికలో నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించినప్పటికీ ప్రాధాన్యత ఇవ్వాల్సిన కోన్ని రంగాలను విస్మరించామన్నారు. లబ్ధిదారుల ఎంపికలో రుణ వితరణలో ప్రజాప్రతిధులను కూడా భాగస్వామ్యం చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. చిన్న చిన్న వ్యాపారులకు బ్యాంకర్లు తమ సహకారాన్ని అందించాలని సూచించారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ పరిగి నియోజకవర్గంలో సుమారు 600 పైచిలుకు చెరువులున్నాయని వీటిలో చేపలు పెంచేందుకు మత్స్యకారులు ముందుకు వస్తున్నారని వారికి విరివిగా రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు లబ్ధిదారులు, బ్యాంకర్ల మధ్య సమన్వకర్తగా వ్యవహరించాలని సూచించారు. వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు మాట్లాడుతూ షెడ్యూల్డు కులాల వారికి ఇచ్చే రుణాల విషయంలో అశ్రద్ధ వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చే సారు. ప్రభుత్వం ఎస్సీల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను రూపొందిస్తున్నప్పటికీ అవి నిజమైన లబ్ధిదారులకు చేరడంలేదని అన్నారు. కలెక్టర్ రఘునందన్‌రావు స్పందిస్తూ వికారాబాద్, మర్పల్లి, మోమిన్‌పేట్, బంట్వారం మండలాల్లో వివిధ శాఖల ద్వారా ఎస్సీలకు అందించిన రుణ వివరాల సంబంధించిన జాబితాను ఎమ్మెల్యేకు అందించాల్సిందిగా సంబంధిత శాఖ అధికారికి సూచించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ మాట్లాడుతూ లబ్ధిదారులను బ్యాంకుల చుట్టు తిప్పుకుంటున్నారని దానివలన వారికిరవాణా ఖర్చులు భరించలేకపోతున్నారని అన్నారు.
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ అర్హులైన వ్యక్తులకు రుణాలు ఇవ్వడంలేదని, ఈ విషయంలో బ్యాంకర్లు సానుకూలంగా స్పందించాలని ఆశాభావం వ్యక్తం చేసారు. ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్ మాట్లాడుతూ రైతురుణాలు, రుణ మాఫీ తదితర విషయాల గురించి ప్రతి బ్యాంకు వద్ద జాబితాను ప్రదర్శిస్తే రైతు ఆత్మహత్యలను నివారించవచ్చునని తెలిపారు. ఆ జాబితాను చూసి రైతులలో ఆత్మస్థయిర్యం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. డిఎల్‌ఆర్‌సి సమావేశం ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించడంతోపాటు జన్‌ధన్ యోజన, అటల్ పెన్షన్, ఎంఎస్‌ఎంఇ రుణాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. రుణాల మంజూరీలో ఔత్సాహికులకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. సమావేశంలో లీడ్ బ్యాంకు మేనేజర్ వివిఎస్ శాస్ర్తీ, ఎస్‌బిహెచ్ డిజిఎం మ్యాత్యూకుట్టి, ఆర్‌బిఐ ఎజిఎం బాలసుబ్రహ్మణ్యం, డిఆర్‌డిఎ పిడి సర్వేశ్వర్‌రెడ్డి, డ్వామా పిడి హరిత తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం వివిధ సంక్షేమ అధికారులు, బ్యాంకర్లతో డిసిసి సమావేశం నిర్వహించారు.

ఒలింపిక్ భవన్ వద్ద క్రీడా సంఘాల రగడ
చాంద్రాయణగుట్ట, మే 18: లాల్‌బహదూర్ స్టేడియం ఒలింపిక్ భవన్ వద్ద రెండు సంఘాల మధ్య చోటుచేసుకున్న గొడవ కారణంగా తీవ్ర ఉద్రిక్త వాతావారణం నెలకొంది. పోలీసులు రంగాప్రవేశం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే... ప్రస్తుతం ఒలింపిక్ భవనము, తెలంగాణ, ఆంధ్ర ఒలింపిక్ అసోసియేషన్‌ల ప్రతినిధుల ఆదీనంలో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న ఎపి ఒలింపిక్ సంఘం కమిటీని రద్దు చేసి 2015 ఏప్రిల్ మాసంలో నిబంధనల ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు వేరు వేరుగా ఒలింపిక్ సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు కోసం ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తెలంగాణకు పార్లమెంట్ సభ్యుడు ఎపి జితేందర్‌రెడ్డి, కె.జగదీశ్వర్‌యాదవ్‌లు అధ్యక్ష, కార్యదర్శులుగా ఎన్నికయ్యారు. తెలంగాణ ఒలింపిక్ సంఘం కోశాధికారిగా ఎస్.సోమేశ్వర్‌రావు నియమితులయ్యారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ఒలంపిక్ సంఘానికి అధ్యక్షునిగా రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్, కార్యదర్శిగా జెసి పవన్‌రెడ్డి, కోశాధికారిగా కెపి రావులు నియమితులయ్యారు. జంట రాష్ట్రాలకు ఒలింపిక్ సంఘాలు ఏర్పడిన తరువాత గతంలో ఎపి ఒలింపిక్ సంఘం కార్యదర్శిగా ఉన్న జగదీశ్వర్‌యాదవ్ లాల్‌బహదూర్ స్టేడియం సమీపంలోని ఒలింపిక్ భవన్‌ను జంట రాష్ట్రాలకు నూతనంగా ఎన్నుకోబడ్డ ఒలింపిక్ సంఘంకు అప్పగించడం జరిగింది. ఇది ఇలా ఉండగా కె.రంగారావు, ఎస్‌ఆర్ ప్రేమ్‌రాజ్‌ల వర్గం ఎన్నికల్లో పోటీ చేయకుండా అప్పట్లో ప్రత్యేకంగా ఒలింపిక్ సంఘం తెలంగాణ పేరుతో కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రంగారావు నాయకత్వంలోని ఒలింపిక్ సంఘం తెలంగాణ, ఎంపి జితేందర్‌రెడ్డి నాయకత్వంలో ఏర్పాటైన తెలంగాణ ఒలింపిక్ సంఘాల మధ్య గత కొంతకాలం నుండి వైషమ్యాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో భారత ఒలింపిక్ సంఘం తమకే గుర్తింపునిచ్చింది ఇరు సంఘాల మధ్య పరస్పరం ఆరోపించుకుంటున్నారు. తాజాగా రంగారావు, ప్రేమ్‌రాజ్‌లతో కూడిన బృందం తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్)కి చెందిన అధికారులతో కలిసి భవనంను తమకు అప్పగించాలని బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో చేరుకున్నారు. ఒలింపిక్ భవన్‌ను, ఒలింపిక్ అసోసియేషన్ తెలంగాణకు అప్పగించాలని శాట్స్ అధికారులు లిఖిత పూర్వకంగా రాసిన నోటీసును ఒలింపిక్ భవన్‌లోని తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి కె.జగదీశ్వర్‌యాదవ్‌కు అందజేశారు. దీంతో రంగారావు, జగదీశ్వర్‌యాదవ్ వర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. ఇరు వర్గాల మధ్య మాటమాట పెరిగి గొడవకు దారితీసింది. పోలీసులు ముందుగానే ఇక్కడకు చేరుకోవడంతో ఇరువర్గాల వారిని సముదాయించి పరిస్థితి అదుపులోకి తీసుకోచ్చారు.
ఒలింపిక్ సంఘం అటానమస్ బాడి -జగదీశ్వర్‌యాదవ్
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు ఒలింపిక్ సంఘం ఏర్పాటైందని, ఇది అటానమస్ బాడి దీనిపై ఎవరి పెత్తనం కొనసాగదని తెలంగాణ ఒలింపిక్ సంఘం కార్యదర్శి కె.జగదీశ్వర్‌యాదవ్ స్పష్టం చేశారు. క్రీడా సంఘాల మధ్య జరుగుతున్న గొడవకు శాట్స్‌కు ఏం సంబంధం ఉందని ఆయన ప్రశ్నించారు. 1999 సంవత్సరంలో సిఎం చంద్రబాబునాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం లాల్‌బహదూర్ స్టేడియం, నిజామ్‌కాలేజీ హాస్టల్‌కు మధ్య ఉన్న ప్రభుత్వ భూమిని కేటాయించడం జరిగిందన్నారు. ఈ భవన నిర్మాణ పనులు 1999లో ప్రారంభమై 2002లో పూర్తయిందని చెప్పారు. ఒలింపిక్ సంఘానికి భవన నిర్మాణం కోసం ప్రభుత్వం 33 సంవత్సరాల పాటు ప్రభుత్వ భూమిని లీజ్‌కు ఇవ్వడం జరిగిందని ఆయన వివరించారు. భారత్ ఒలింపిక్ సంఘం నియమ నిబంధనల ప్రకారం ఎన్నికలను నిర్వహించింది తామేనని జగదీశ్వర్‌యాదవ్ తెలిపారు. ఒలింపిక్ భవనంను ఒలింపిక్ సంఘం తెలంగాణకు అప్పగించాలని తమపై శాట్స్ అధికారులు ఒత్తిడి తెస్తున్నారని ఈ విషయంలో తగిన న్యాయం చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు వినతి పత్రం కూడా అందజేశామని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్ర చెస్‌లో మార్పు సాధ్యమే
చాంద్రాయణగుట్ట, మే 18: రాష్ట్ర చెస్‌లో మార్పు సాధ్యమేనని, గతంలో ఉన్న కార్యవర్గ సభ్యులకు పనిచేసే అవకాశం ఇవ్వలేదని, ప్రస్తుతం పనిచేసేవారికి మాత్రమే అవకాశాలుంటాయని అనం చిన్ని వెంకటేశ్వరరావు ఆభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర చెస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మాట్లాడుతూ గతంలో, ప్రస్తుత కార్యవర్గంలో ఉన్న సీనియర్ నిర్వాహకుల సూచనలను గతంలో ఎవరూ పాటించ లేదు. ఇపుడు నేరుగా వారికే బాధ్యతలు అప్పగించారు. దీంతో మార్పు సాధ్యమవుతుందని చెప్పారు. అస్తవ్యస్తమైన అకాడమీల వ్యవహారశైలికి, ఇష్టారాజ్యానికి ఇక కాలం చెల్లిందన్నారు. చెస్ క్రీడకు అనుబంధం కలిగిన అందరినీ అసోసియేషన్‌లో భాగస్వాములను చేయడమే తన ఉద్దేశమన్నారు. అకాడమీలకు జూన్ 30 వరకు గడువు విధించామని, ఈలోపు రాష్ట్రంలోని అన్ని అకాడమీలు తప్పకుండా తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం గుర్తింపు పొందాలన్నారు. గుర్తింపు పొందని అకాడమీలు నిర్వహించే ఏ కార్యక్రమానికి అసోసియేషన్ సహకారం ఉండదని, ఈ విషయంలో చెస్ క్రీడాకారులు తప్పకుండా అసోసియేషన్ ఆదేశాలను పాటించాలన్నారు. చెస్ టోర్నమెంట్‌లు, కోచింగ్ క్యాంపుల పేరుతో అత్యధికంగా నగదు వసూళ్లపై అరోపణలు ఉన్నాయని, వాటి వెనుక ఎంతటి వ్యక్తులున్నా సహించేది లేదని క్రీడాకారుల సంక్షేమమే ప్రధానమన్నారు. అసోసియేషన్ ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా బ్యాంకుల ద్వారా జరగాలని కీలక నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. దీంతో అసోసియేషన్‌లలో నూరుశాతం పారదర్శకత నెలకొంటుందన్నారు. చెస్ క్రీడాకారులకు ఏది లాభదాయకంగా ఉంటుందో అదే అసోసియేషన్ లక్ష్యంగా ముందుకెళుతున్నామన్నారు. పోటీల సందర్భంగా నిర్వహణ, పర్యవేక్షణ, క్రమశిక్షణ, ఫిడే నార్మ్స్ అమలయ్యే విధంగా అసోసియేషన్ అన్ని చర్యలు తీసుకుంటుందని, రాష్ట్రంలో ఎక్కడ టోర్నమెంట్ జరిగినా తమ అసోసియేషన్‌కు సంబంధించిన ప్రతినిధుల పర్యవేక్షణ కూడా ఉంటుందన్నారు. పోటీల నిర్వహణ విషయంలో ఉచితంగా ఎవరైనా ముందుకు వస్తే అనుమతులు ఇవ్వడానికి అసోసియేషన్ ఎలాంటి అభ్యంతరాలను వ్యక్తపర్చదని, కాని నిర్వాహకులు తప్పనిసరిగా సంఘం నుండి లిఖిత పూర్వకంగా అనుమతి పొందాల్సి ఉంటుంది. పోటీలను క్రమబద్ధీకరించడంతో పాటు క్రీడాకారులకు కూడా ప్రణాళికాబద్ధంగా తర్పీదును పొందే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్ర స్థాయి చెస్ జట్ల ఎంపిక పోటీలకు ప్రతిజిల్లా నుంచి తప్పనిసరిగా క్రీడాకారులను పంపాల్సిన బాధ్యతలను ఆయా జిల్లా చెస్ సంఘాలు తీసుకోవాలని స్పష్టమైన అదేశాలు జారీ చేశామన్నారు. దీంతో నైపుణ్యం కలిగిన క్రీడాకారులకు న్యాయం జరుగుతుందన్నారు. చెస్ క్రీడను ఆదాయ వనరులుగా చేసుకున్న వారిని వదిలిపెట్టమని, జీవనాధారంగా చేసుకున్న వారిని వదులుకోమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో చెస్ క్రీడ అభివృద్ధి కోసం అసోసియేషన్ అన్ని జిల్లాల్లో రేటింగ్ చెస్ టోర్నమెంట్‌లను నిర్వహించడంతో పాటు హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున జాతీయ స్థాయి టోర్నమెంట్‌ల నిర్వహణకు కృషి చేస్తామని అనంచిన్ని వెంకటేశ్వరరావు తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా ఈ నేపథ్యంలో అసోసియేషన్‌లు ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం ఒక హైపవర్ కమిటీని నియమించనున్నట్లు ఆయన తెలిపారు.