రంగారెడ్డి

వ్యవసాయ వర్సిటీలో యూత్ ఫెస్టివల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, జనవరి 23: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బుధవారం విశ్వవిద్యాలయం స్థాయి యూత్ ఫెస్టివల్ నిర్వహించారు. ఎన్‌ఎస్‌ఎస్ విభాగం ఆధ్వర్యంలో కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమానికి విద్యార్థి వ్యవహారాల డీన్ డాక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యూత్‌ఫర్ స్వచ్ఛత అనే అంశంపై విశ్వవిద్యాలయ పరిధిలోని వివిధ డిగ్రీ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులకు పోటీలు నిర్వహించారు.
రంగోలి, సాంస్కృతి, సాహితి, సృజనాత్మక కళలు వంటి పలు అంశాలలో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. విశ్వవిద్యాలయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో జరిగే యూత్ ఫెస్టివల్‌కు ఎంపిక చేస్తారు. కార్యక్రమంలో 80 మంది విద్యార్థులు వివిధ పోటీలలో పాల్గొన్నారు. వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జెల్లా సత్యనారాయణ, ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు డాక్టర్ టీ.లావణ్య, డాక్టర్ పద్మజ, డాక్టర్ అమీర్‌భాష, కే.అరుణ పాల్గొన్నారు.
సమాజంలో అసమానతలు
తొలగినప్పుడే అభివృద్ధి
వనస్థలిపురం, జనవరి 23: సమాజంలో అసమానతలు తొలగినప్పుడే దేశం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తుందని సామాజికవేత్త ఆర్‌కే యాదవ్ చెప్పారు. నాగోలు శివ ఫంక్షన్ హాల్‌లో బుధవారం లోక్‌జన శక్తి పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆర్‌కే యాదవ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు కనీస వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలం చెందాయని అన్నారు. పేద మధ్య తరగతి ప్రజలకు ఉచితంగా విద్య, వైద్యం అందించినప్పుడే దేశం మరింత వేగవంతంగా అభివృద్ధి సాధిస్తూ ముందుకెళ్తుందని తెలిపారు. దేశంతో పాటు రా ష్ట్రంలో లోక్‌జనశక్తి పార్టీని క్రియాశీలంగా అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.
బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం తమ పార్టీ శక్తి వంచన లేకుండా పోరాటాలు చేస్తుందని గుర్తు చేశారు. రాష్టస్థ్రాయి లో కొత్త కమిటీలను ఏర్పాటుచేసి పార్టీని పటిష్టంగా తయారు చేయడానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. విద్యార్థి సంఘాలు, కులసంఘాలు సమాజ అభివృద్ధికి సహకరించాలని అన్నారు. కార్యక్రమంలో అజయ్ కుమా ర్, తెలంగాణ నిరుద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చందు కుమార్ స్వామి, మురళీ, సురేష్, వసంత రాయలు, చంద్రయ్య, శంకరయ్య పాల్గొన్నారు.