రంగారెడ్డి

పోలింగ్‌కు సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమనగల్లు: ఈనెల 25న జరిగే రెండో విడత పంచాయతీ ఎన్నికలకు ఆమనగల్లు, కడ్తాల మండలాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆమనగల్లు ఎంపీడీఓ, ఎన్నికల సహాయ అధికారి వెంకట్ రాములు తెలిపారు. ఆమనగల్లు మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. ఆమనగల్లు మండలంలో 13 గ్రామ పంచాయతీలకు రెండు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగితా 11 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు 42 మంది, 81 వార్డులకు 231 మంది పోటీలో ఉన్నట్టు తెలిపారు. మండలంలో ఎన్నికల విధులకు 11 మంది స్టేజ్ ఇద్దరు అధికారులను, 162 మంది సిబ్బందిని ఎంపికచేసి వారికి శిక్షణ ఇచ్చినట్టు వెల్లడించారు. కడ్తాల మండలంలో 24 గ్రామ పంచాయతీలకు ఐదు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని మిగితా 19 సర్పంచ్ స్థానాలకు 43 మంది బరిలో ఉన్నారని 155 వార్డులకు 399 మంది పోటీలో ఉన్నారని ఆయన వివరించారు. మండలంలో 155 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పోలింగ్‌కు ముందురోజు ఓటర్లకు స్లిప్‌లు పంపిణీ చేస్తామని, 25న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుందని, రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమై ఫలితాలు వెల్లడించడంతో పాటు ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తామని ఎంపీడీఓ వెంకట్ రాములు తెలిపారు.
అభివృద్ధి చేసేవారిని ఎన్నుకోవాలి
గ్రామాలను అభివృద్ధి చేసేవారిని సర్పంచ్‌లుగా ఎన్నుకోవాలని నోటుకు, మద్యానికి ఓటు అమ్ముకుంటే ఐదు సంవత్సరాలు బాధ పడవలసిందేనని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి అన్నారు. బుధవారం ఆమనగల్లు మండలంలోని ఆకుతోటపల్లి గ్రామంలో బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మంగమ్మ నారాయణకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ప్రజలను మాయమాటలతో మోసగించిన ముఖ్యమంత్రి.. పంచాయతీ ఎన్నికల్లో ధనబలం అధికార బలంతో గెలిపించుకునేందుకు పూనుకున్నారని విమర్శించారు. జడ్పీటీసీ కండె హరిప్రసాద్, బీజేపీ నాయకులు సుండూరి శేఖర్, విజయ్ కుమార్, రాంరెడ్డి, నిట్టనారాయణ, గోరటి నర్సింహా పాల్గొన్నారు.
మర్పల్లి: మండలంలో సర్పంచ్‌లు, వార్డులకు శుక్రవారం జరిగే ఎన్నికలకు ప్రచారం బుధవారం ముగిసింది. మండలంలో 27 పంచాయతీలకు నాలుగు స్థానాలు ఏకగ్రీవం కాగా, 252 వార్డు సభ్యులలో 36 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికైనాయి. మిగిలిన 23 సర్పంచ్‌లకు 65 మంది, 216 వార్డులకు 507 మంది బరిలో నిలిచారు. అధికార పార్టీ నుంచి కొండల్ రెడ్డి సర్పంచ్ అభ్యర్థులకు ప్రచారం చేసారు. కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించాలని చేవెళ్ల ఎంపీ కొండా విశే్వశ్వర్ రెడ్డి, ప్రసాద్‌కుమార్ ప్రచారం చేసారు. గెలుపెవరితో 25వ తేదీ సాయంత్రానికల్లా తెలుస్తుంది.
అభివృద్ధి చేసేవారిని గెలిపించాలి
ఇబ్రహీంపట్నం: గ్రామాల్లోని సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగి, వాటిని పరిష్కరించి గ్రామాలను అభివృద్ధి చేస్తారని నమ్మేవారినే ఎన్నికల్లో గెలిపించాలని స్థానిక మండల పరిషత్ అధ్యక్షులు మర్రి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మండల పరిధిలోని పొల్కంపల్లి, నాగాన్‌పల్లి, నెర్రపల్లి, దండుమైలారం, రాయపోల్ గ్రామాల్లో కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామాలను అభివృద్ధి చేసేవారినే పార్టీ బలపర్చిందని అన్నారు. వారిని గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలన్నారు. ప్రచారంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ లక్ష్మణరావు పాల్గొన్నారు.
కాచవానిసింగారంలో..
ఉప్పల్: నగర శివారు కాచవానిసింగారంలో పంచాయతీ ఎన్నికల ప్రచారానికి బుధవారం సాయంత్రం తెరపడింది. సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు గత పదిహేను రోజులుగా కేటాయించిన గుర్తులతో ఆటోలు, సభలు, సమావేశాల ద్వారా చేసిన ప్రచారం ముగిసింది. ఇక ఓటర్లను ఆకర్షించేందుకు డబ్బు, మద్యం పంపిణీకి సిద్ధమవుతున్నారు. ఈ నెల 25వ తేదీన ఎన్నికల పోలింగ్ ఉంది. ఒక్కరోజు మాత్రమే గడువు ఉండటంతో అభ్యర్థులు తమ గెలుపు కోసం వ్యూహాన్ని పన్నుతున్నారు. జనరల్ స్థానమైన గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులు కొంతం వెంకట్ రెడ్డి, మునికుంట్ల ముత్యాలు గౌడ్, కర్రె రాజేష్, బస్వ రాజు గౌడ్, నెల్లుట్ల శ్రీదేవి వార్డు సభ్యులుగా 43 మంది బరిలో ఉన్నారు. ఓట్ల కోసం పాట్లు పడుతూ ఓటర్లకు దగ్గరవుతున్నప్పటికీ విజయం ఎవరికి వరిస్తుందో వేచి చూద్దాం.