రంగారెడ్డి

మాతృ భాషను పరిరక్షించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, ఫిబ్రవరి 21: మాతృ భాషను పరిరక్షించు కోవల్సిన అవసరం ఎంతైన ఉందని కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు ఆచార్యులు విజయ లక్ష్మి అన్నారు. ఫ్రెండ్స్ వెల్ఫ్‌ర్ అసోసియ్యేషన్ ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని స్వాతి హైస్కూల్‌లో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమానికి ప్రొఫెసర్ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడుతూ అంగ్లభాష మోజు మాతృ భాష నిర్లక్ష్యనికి గురువుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో మాతృభాషను అభివృద్ధి పరచటానికి కావల్సిన తెలుగు మాటలను ఎప్పటికిప్పుడు తర్జుమా చేసి వినియోగంలోకి తీసుకురావల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. బంగ్లాదేశ్‌లో మాతృ భాష గుర్తింపు కోసం చేసిన పోరాటంలో అసువులు బాసినవారి జ్జాపకార్ధమే ఫిబ్రవరి 21న ప్రపంచ మాతృ భాషదినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. ప్రపంచంలో తెలుగు 14వ స్థానంలో ఉందని ఉదర పోషణర్ధం ఆంగ్లభాష నేర్చుకున్నా మాతృ భాషను మరువరాదని అన్నారు. మాతృభాషపై ఉపన్యాస పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందించారు. కార్యక్రమానికి ఫ్రెండ్స్ వేల్‌ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ అధ్యక్షత వహించగా స్వాతి హైస్కూల్ కరస్పాండెంట్లు ఫణికుమార్, శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
ఓటరు నమోదుపై అవగాహన
కొడంగల్, ఫిబ్రవరి 21: అర్హులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని తహశీల్దార్ వెంకటేష్ అన్నారు. గురువారం కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో కొడంగల్, దౌల్తాబాద్, బోంరాస్‌పేట మండలాలకు చెందిన బీఎల్‌వోలకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు విధిగా ఓటుహక్కును నమోదు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈవీఎం, వీవీప్యాట్‌లపై ఓటర్లకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. మాక్ పోలింగ్ నిర్వహించాలని అన్నారు.
రేపు లయోలా పాఠశాల వార్షికోత్సవం
వనస్థలిపురం, ఫిబ్రవరి 21: వనస్థలిపురం లయోలా పాఠశాలల వార్శికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు విద్యా సంస్థల చైర్మన్ రంగినేని వెంకట్ రావు తెలిపారు. వనస్థలిపురం, పనామా చౌరస్తాలోని బొమ్మిడి లలితారెడ్డి గార్డెన్‌లో శనివారం సాయంత్రం నిర్వహించనున్న వేడుకలకు విద్యార్థులు, తల్లి దండ్రులు, పూర్వ విద్యార్థులు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్రంతో పాటు విదేశాలలో కూడ తమ విద్యా సంస్థలను స్థాపించి కార్పొరేట్ విద్యా సంస్థకు దీటుగా విద్యను అందిస్తూ, సామాన్య విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేరే విధంగా కృషి చేస్తున్నట్లు వెంకట్ రావు వివరించారు.
విద్యాశాఖ మంత్రిని కలిసిన ట్రస్మా నేతలు
జీడిమెట్ల, ఫిబ్రవరి 21: రాష్ట్ర విద్యా శాఖ మంత్రి జగదీశ్ రెడ్డిని మేడ్చల్ జిల్లా ట్రస్మా ఆధ్వర్యంలో గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్‌ల అసోసియేషన్ సభ్యులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మేడ్చల్ జిల్లా ట్రస్మా అద్యక్షుడు శివరాత్రి యాదగిరి సభ్యులతో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రైవేట్ పాఠశాలల సమస్యలను మంత్రికి విన్నవించారు. కార్యక్రమంలో ట్రస్మా నేతలు నాగూర్ బాబు, అజార్ ఖాన్, పరుశురామ్ గౌడ్, నర్సిరెడ్డి, సుశీల్ కుమార్, కాశిరెడ్డి, శ్రీహరి పాల్గొన్నారు.