రంగారెడ్డి

ఆన్‌లైన్‌లో అవకతవకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందుర్గు, ఫిబ్రవరి 21: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ ప్రక్షాళణలో భాగంగా ఉన్న భూమి కంటే తక్కువగా ఆన్‌లైన్‌లో నమోదు చేసి రైతులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. భూప్రక్షాళణలో రెవెన్యూ రికార్డుల్లో ఎలాంటి తప్పులు లేకుండా సరి చేయడంతోపాటు రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తే స్థానిక రెవెన్యూ అధికారులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కొందుర్గు మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లి (కొండోనిబావి) గ్రామానికి చెందిన రైతులకు సంబంధించిన భూముల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారని ఆరోపిస్తున్నారు. గ్రామ వీఆర్‌ఓతోపాటు మండల రెవెన్యూ అధికారులు ఇష్టారాజ్యంగా రైతుల భూముల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో అన్ని తప్పులే వచ్చాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వే నంబర్ 82లో 2.02 గుంటల పట్టా భూమి ఉంటే కేవలం రెండు గుంటల భూమి ఉన్నట్లు ఆన్‌లైన్‌లో అధికారులు నమోదు చేయడంతో రైతుబందు పథకంలో కేవలం రూ.200 మాత్రమే వచ్చిందని రైతు సుదర్శన్ వివరించారు. రెండు ఎకరాల భూమిని ఎందుకు ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదని రెవెన్యూ అధికారులను ప్రశ్నిస్తే ఇదిగో చేస్తాం.. అదిగో చేస్తామంటూ దాటవేస్తున్నారని, నేటికీ సరిచేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలలుగా కొందుర్గు రెవెన్యూ కార్యాలయం చుట్టు తిరుగుతున్నామని ఆరోపించారు. సర్వే 82, సర్వే 83, సర్వే 84లో మొత్తం 10ఎకరాల భూమి ఉంటే ఆన్‌లైన్‌లో మాత్రం రెండు ఎకరాల భూమి ఉన్నట్లు నమోదు చేశారని రైతు వెంకటయ్య వివరించారు. ఎనిమిది ఎకరాల భూమి ఎందుకు నమోదు చేయలేదిన అధికారులను ప్రశ్నిస్తే తిరిగి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామంటూ దాటువేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు లక్ష్మీదేవిపల్లి గ్రామంలో సుమారు 50 నుంచి 60మంది రైతులు ప్రతిరోజు కొందుర్గు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని వివరించారు. మరో రైతుకు సంబంధించిన ఐదు ఎకరాల భూమి ఉంటే కేవలం ఆన్‌లైన్‌లో రెండు ఎకరాల భూమి ఉన్నట్లు చూపిస్తుందని తెలిపారు. గ్రామానికి సంబంధించిన రికార్డులు సరిచేయాలని గత ఆరు నెలల నుంచి రెవెన్యూ కార్యాలయం చుట్టు తిరుగుతున్నా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఫిబ్రవరి 6న రైతు వెంకటయ్య పట్టాదారు పాస్‌పుస్తకం సరిచేస్తారా..లేదా..లేదంటే ఆత్మహత్యం చేసుకుంటామని కొందుర్గు తహశీల్దార్ కార్యాలయం రికార్డు ఆఫీసులో వినతిపత్రం ఇస్తే అదేది చూడకుండా కార్యాలయం ముద్రవేసి పంపించేశారని తెలిపారు. రెవెన్యూ అధికారులు ఏ స్థాయిలో విధులు నిర్వహిస్తున్నారో అర్ధమవుతుందని రైతులు పేర్కొంటున్నారు. స్థానిక రెవెన్యూ అధికారుల పనితీరుపై కలెక్టర్‌కు త్వరలోనే ఫిర్యాదు చేయనున్నట్లు రైతులు హెచ్చరించారు.
రికార్డులు పరిశీలించి సరిచేస్తాం
* తహశీల్దార్ ప్రమీలరాణి
లక్ష్మీదేవిపల్లి గ్రామానికి సంబంధించిన రికార్డులను పరిశీలించి సరి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కొందుర్గు తహశీల్దార్ ప్రమీలరాణి వివరించారు. అధికారుల తప్పిదాలతో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయని, వాటిని పూర్తి స్థాయిలో సరి చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. నాలుగు రోజుల్లో రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని వివరించారు. అప్పటి వరకు రైతులు వేచి ఉండాలని కోరారు.