రంగారెడ్డి

నాలా విస్తరణ పనులు వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 21: నాలా విస్తరణ పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టి వర్షాకాలంలోపు పూర్తి చేయాలని అధికారులకు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సూచించారు. గురువారం చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తిశ్రీనగర్ వద్ద నిర్మిస్తున్న నాలా విస్తరణ పనులను అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. నాలా నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమానికి సిటీ ప్లానర్ ఆర్.శ్రీనివాస రావు, జీహెచ్‌ఎంసీ ప్రాజెక్టు ఏఈ శివప్రసాద్, సైట్ ఇంజనీర్ రూప హాజరయ్యారు. ఎమ్మెల్యే వెంట టీఆర్‌ఎస్ నాయకులు ఉప్పలపాటి శ్రీకాంత్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ఎం.ప్రసాద్, వెంకట్ ఉన్నారు.
జేఏసీ ఆధ్వర్యంలో నీటి సరఫరా
కీసర, ఫిబ్రవరి 21: నీటి ఎద్దడి తీర్చాలని నాగారం గ్రామస్తులు పలుమార్లు పాలక వర్గానికి విన్నవించినా, రోడ్డుపై ధర్నా చేసినా స్పందించక పోవటంతో కాలనీ అసోసియేషన్ నాయకులు జేఏసీగా ఏర్పాటై ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. నాగారం గ్రామంలో 108 కాలనీలు ఉన్నాయి. ఎండకాలం మొదలు కాకముందే నీటి ఎద్దడి మొదలైంది. పలు రకాలుగా ప్రజలు నిరసనలు తెలిపారు. నాగారం గ్రామం రింగ్‌రోడ్డుకు లోపల ఉండటంతో జలమండలి నీటి సరఫరా చేస్తోంది. తగినన్ని నీళ్లు సరఫరా చేయక పోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఓటరు నమోదుపై అవగాహన
కొడంగల్, ఫిబ్రవరి 21: అర్హులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని తహశీల్దార్ వెంకటేష్ అన్నారు. గురువారం కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో కొడంగల్, దౌల్తాబాద్, బోంరాస్‌పేట మండలాలకు చెందిన బీఎల్‌వోలకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు విధిగా ఓటుహక్కును నమోదు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈవీఎం, వీవీప్యాట్‌లపై ఓటర్లకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. మాక్ పోలింగ్ నిర్వహించాలని అన్నారు.