రంగారెడ్డి

వ్యవసాయ వర్సిటీలో జాబ్‌మేళా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, ఫిబ్రవరి 22: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని గృహ విజ్ఞాన కళాశాలలో శుక్రవారం జాబ్‌మేళా నిర్వహించారు. జాబ్‌మేళాను డీన్ హోంసైన్స్ డాక్టర్ విజయలక్ష్మి ప్రారంభించారు. బీఎస్సీ హోంసైన్స్‌కు చెందిన ఫుడ్స్ అండ్ న్యూట్రిషన్, అప్పారల్ అండ్ టెక్స్‌టైల్స్, ఫ్యాషన్ టెక్నాలజీ, రిసోర్స్ మేనేజ్‌మెంట్ అండ్ కన్సూమర్ సైనె్సస్, హ్యూమన్ డెవలెప్‌మెంట్ అండ్ ఫ్యామిలీ స్టడీస్ ఫైనల్ ఇయర్ విద్యార్థులతో పాటు, ఎంఎస్సీ, పీహెచ్‌డీ విద్యార్థులు కూడా జాబ్‌మేళాకు హాజరయ్యారు. సుమారు 150 నుంచి 200 మంది విద్యార్థినులు హాజరై వివిధ కంపెనీలు, సంస్థల ప్రతినిధులు నిర్వమించిన ఇంటర్వ్యూలో పాల్గొని తమ ప్రతిభను పరీక్షించుకున్నారు. జాబ్‌మేళాలో 60పైగా సంస్థలు పాల్గొన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు, పలు ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్లేస్‌మెంట్ బ్రోచర్లను డీన్ హోంసైన్స్ డాక్టర్ విజయలక్ష్మి, అసోసియేట్ డీన్ డాక్టర్ రత్నకుమారి, ప్లేస్‌మెంట్ సెల్ ఇంచార్జ్ డాక్టర్ రాధారాణితో కలిసి విడుదల చేశారు. విద్యార్థుల బయోడెటాలతో ఈ బ్రోచర్లను వివిధ విభాగాల వారీగా ప్రచురించారు. జాబ్‌మేళాలో పాల్గొన్న సంస్థల ప్రతినిధులకు విద్యార్థుల వివరాలను అందజేశారు. ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న విద్యార్థులను సంస్థలు ప్రతినిధులు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేశారు. సాయంకాలం వరకు జాబ్‌మేళా కొనసాగింది.
పెద్దమ్మ తల్లి జాతర ఆరంభం
కీసర, ఫిబ్రవరి 22: కీసరలో కొలువైన శ్రీపెద్దమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం శిఖర యంత్ర ప్రతిష్ఠ పూజా కార్యక్రమాలను వేద పండితుల మంత్రోచ్చరణాలతో నిర్వహించారు. పూజారి వెంపటి సాయికిరణ్ శర్మ ఆధ్వర్యంలో వేద స్వస్తి, గోపూజ, గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగమ్య ప్రాశన, అఖండ దీపారాధన, దీక్షా దారణ, యాగశాల ప్రవేశం, మండపారాధన పూజలు, సర్వతోభద్ర మండల పూజలు, సాయంత్రం ఐదు గంటలకు మండవ పూజలు, అగ్ని సంస్కారాలు, శ్రీలక్ష్మీ గణపతి హోమం, మూలమంత్ర హోమం, యంత్ర పూజలు, జలాధివాసం, దీర్ధప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ కందాడి బాలమణి ప్రభాకర్ రెడ్డి, ముదిరాజ్ సంఘం నాయకులు వెంకటేశ్, జంగయ్య, గంగారాం, రవికాంత్, నాగరాజు, రామకృష్ణ పాల్గొన్నారు.

పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు 14593 మంది సిబ్బంది
జేసీ శ్రీనివాస్ రెడ్డి వెల్లడి
కీసర, ఫిబ్రవరి 22: త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు 14593 సిబ్బంది అవసరమని మేడ్చల్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ 2018 సంవత్సరం శాసనసభ ఎన్నికల్లో విధులు నిర్వహించిన 10825 మంది ఉద్యోగుల వివరాలు అందుబాటులో ఉన్నాయని, 2019 పార్లమెంట్ ఎన్నికలకు అదనంగా 785 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినందున 3768 వేల మంది అదనపు సిబ్బంది వివరాలు సేకరించవలసి ఉందని తెలిపారు. ఆయా సంస్ధల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వివరాలు సేకరించి జిల్లా ఎన్నికల మ్యాన్‌పవర్ నోడల్ అధికారికి సమర్పించాలని ఆదేశించారు. ఎన్నికల విధులు నిర్వహించటానికి కేటాయించిన సిబ్బందికి, ఎన్నికల సమయంలో సెలవులు ఇవ్వరాదని, తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని, స్థానికంగా పని చేస్తున్న సిబ్బందికి మేడ్చల్ జిల్లా ఎన్నికల నిర్వహణకు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో మ్యాన్‌పవర్ జిల్లా ఎన్నికల అధికారి విజయ కుమారి, ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి యూసుఫ్ అలీ పాల్గొన్నారు.

24న అర్చక సమాఖ్య
జై యహో వైఖనసం
హైదరాబాద్, ఫిబ్రవరి 22: వివాహాలు కాని అర్చక స్వాములకు కష్టంగా ఉన్న తరుణంలో ఏపి అర్చక సమాఖ్య జై యహోవైఖనసం పేరుమీద వివాహం కాని వైఖనస వధూవరులకు ఒక వేదికను ఈ నెల 24వ తేదీన ఏర్పాటు చేసినట్లు సమాఖ్య కార్యదర్శి పెద్దింటి రాంబాబు తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వివాహం కాని అర్చక స్వాములు హాజరు కావాలని ఆయన కోరారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యదేవుని దివ్యసన్నిధిలో 24వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్నాటక, ఆంధ్ర రాష్ట్రాలకు చెందిన వైఖనస వధూవరులు, వారి తల్లితండ్రులు హాజరు కావాలని ఆయన కోరారు. వివరాలకు 9849551036ను సంప్రదించాలని రాంబాబు తెలిపారు.
బల్దియాలో మరో కొత్త యూనియన్

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 22: తెలంగాణ స్వచ్ఛ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ పేరిట మరో కొత్త కార్మిక, ఉద్యోగ సంఘం ఆవిర్భవించింది. ఇప్పటి వరకు వివిధ యూనియన్లలో ముఖ్యమైన పాత్ర పోషించిన కార్మిక నేతలు పి.బాల్‌నర్సింగ్‌రావు, ఓ. శంకర్ నేతృత్వంలో ఏర్పడిన ఈ యూనియన్ శుక్రవారం అధికారికంగా రిజిస్ట్రేషన్ అయినట్లు వారు తెలిపారు. యూనియన్ రిజిస్ట్రేషన్ అనంతరం కార్మిక నేతలు కె. చంద్రశేఖర్, ఎ.లవకుమార్, సిహెచ్. కృష్ణ, ఎం.కృష్ణ, శ్రీనివాస్, కే. మోహన్‌లతో కలిసి ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పడిన ఈ యూనియన్‌కు అధ్యక్షుడిగా పి.బాల్‌నర్సింగ్‌రావు, ప్రధాన కార్యదర్శిగా ఓ.శంకర్, గౌరవ అధ్యక్షుడిగా విఠల్‌రావు కులకర్ణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు పి.బాల్‌నర్సింగ్‌రావుమాట్లాడుతూ బల్దియాలో ఇప్పటి వరకు సుమారు డజనుకు పైగా కార్మిక, ఉద్యోగ సంఘాలున్నా, ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఏ ఒక్క యూనియన్ కూడా కార్మికులు, ఉద్యోగుల అవసరాలు, న్యాయమైన వారి హక్కుల పరిరక్షణకు ఆశించిన స్థాయిలో కృషి చేయలేకపోతున్నాయని వివరించారు. వివిధ యూనియన్లలో ఇప్పటి వరకు కీలక పాత్ర పోషించి, కార్మికులు, ఉద్యోగులు ప్రయోజనాల పరిరక్షణ,న్యాయమైన వారి డిమాండ్ల సాధన కోసం అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసిన తాము సరికొత్త యూనియన్‌ను ఏర్పాటు చేసుకుని జీహెచ్‌ఎంసీ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సు కార్మికులకు కూడా న్యాయం చేయాలని నిర్ణయించినట్లు వారు తెలిపారు. సుదీర్ఘకాలంగా జీహెచ్‌ఎంసీలోనే విధులు నిర్వర్తిస్తున్న 336 మంది ఎన్‌ఎంఆర్ ఉద్యోగులను పర్మినెంటు చేయాలని, జీహెచ్‌ఎంసీలోని ప్రతి ఉద్యోగికి హెల్త్‌కార్డును సాధించే వరకు తాము అలుపెరగని పోరాటం చేస్తామని బాల నర్సింగ్‌రావు తెలిపారు. త్వరలోనే జోనల్ స్థాయిలో యూనియన్ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుని, కార్మికుల డిమాండ్ల సాధన కు కార్యచరణను సిద్దం చేస్తున్నామని నర్సింగ్‌రావు చెప్పారు.

సైబరాబాద్‌లో ఎనిమిది మంది సీఐల బదిలీ
గచ్చిబౌలి, ఫిబ్రవరి 22: సైబరాబాద్ పరిధిలో పని చేస్తున్న ఎనిమిది మంది సీఐలను, ముగ్గురు ఎస్‌ఐలను బదిలీ చేస్తు కమిషనర్ వీసీ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. కోస్టల్ బ్యాంక్ ఎండీ జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు శ్రీకాంత్ రెడ్డికి సహకరించారని ఆరోపణలు రావడంతో రాయదుర్గం సీఐ రాంబాబును సీపీ కార్యాలయానికి అటాచ్ చేయగా ఆ స్థానాన్ని సైబర్ క్రైంలో విధులు నిర్వహిస్తున్న రవిందర్‌తో భర్తీ చేశారు. సీసీఎస్‌తో పాటు ఈఓడబ్ల్యూ విభాగంలో విధులు నిర్వహిస్తున్న విజయ భాస్కర్ రెడ్డిని ఆర్‌జీఐ ఎయిర్‌పోర్ట్ సీఐగా. ఈఓడబ్ల్యూ వింగ్‌లో పని చేస్తున్న జానయ్యను కుక్కట్‌పల్లి పీఎస్‌కి కేపీహెచ్‌బీ పీఎస్‌లో డీఐగా పని చేస్తున్న వెంకటేశాన్ని దుందిగల్‌కు బదిలీ చేశారు.
మైలార్‌దేలపల్లి డీఐగా పని చేస్తున్న రామకృష్ణకు షాద్‌నగర్ రూరల్‌కు, మాదాపూర్ అదనపు సీఐ వై.రామకృష్ణను మైలార్ దేవులపల్లికి ట్రాన్స్‌ఫర్ చేశారు. షాద్‌నగర్ రూరల్ సీఐగా పని చేస్తున్న చంద్రశేఖర్‌ని షాద్‌నగర్ టౌన్ డీఐగా, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సీఐగా పని చేస్తున్న ఏ.గంగాధర్‌ని సైబర్ క్రైమ్‌కు బదిలీ చేస్తు సీపీ ఆదేశాలు జారీ చేశారు. వీరితో పాటు ముగ్గురు సబ్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తు సీపీ ఆదేశాలు జారీ చేశారు. మాదాపూర్ ఎస్‌ఐగా పని చేస్తున్న వెంకట రెడ్డిని బాచుపల్లికి, నందిగామ పోలీసుస్టేషన్‌లో పని చేస్తున్న నరసింహా రెడ్డిని సైబరాబాద్ ఐటీ సెల్‌కు, బాలనగర్ ఎస్‌ఓటీలో విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లుని నందిగామ ఎస్‌హెచ్‌ఓగా నియమిస్తు సీపీ ఉత్తర్వురులు జారీ చేశారు.

నిమిషం నిబంధన సడలించాలి
వికారాబాద్, ఫిబ్రవరి 22: ఇంటర్మీడియట్ పరీక్షల్లో విద్యార్థులకు నిమిషం నిబంధన సడలించాలని ఇంటర్మీడియట్ జిల్లా అధికారికి శుక్రవారం ఏబీవీపీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఇప్పటికీ కూడా కనీసం రోడ్డు సౌకర్యం, రవాణా సౌకర్యం లేని గ్రామాలు ఉన్నాయని, నిమిషం నిబంధన అమలు చేస్తే కొంతమంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాలేని పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు.
ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఫీజులు కడితేనే హాల్ టిక్కెట్లు ఇస్తామని ఇప్పటి నుంచే వేధిస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ పసుల మహేశ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీశైలం, నగర సంయుక్త కార్యదర్శి టీ.నవీన్, నాయకులు శివ, ఉదయ్ ఉన్నారు.

ఆర్మీ సైనిక శిక్షణకు యువత ఎంపిక
తాండూరు, ఫిబ్రవరి 22: ఆర్మీ సైనిక శిక్షణకు యువత ఎంపిక కార్యక్రమాన్ని తాండూరు పోలీసు ఆధ్వర్యంలో నిర్వహించామని ఎస్పీ అన్నపూర్ణ పేర్కొన్నారు. రెండు వేల మంది నిరుద్యోగ యువత పాల్గొన్నారని, 590 మందిని యువకులు ఎంపికయినట్లు డీఎస్పీ తెలిపారు. ఎస్పీ టీ.అన్నపూర్ణ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే సదాశయంతో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఆర్మీ శిక్షణకు ఎంపికైన 590 మంది యువకులకు సదుపాయాలను కల్పించి హైదరాబాద్ కొంపల్లి ఆర్మీ ట్రైనింగ్ సెంటర్‌లో 45 రోజుల శిక్షణను ఇప్పిస్తామని పేర్కొన్నారు. డీఎస్పీ ఎం.రామచంద్రుడు, రూరల్ సర్కిల్ సీఐ జే.ఉపేందర్, పట్టణ సీఐ కే.ప్రతాప్ లింగం పాల్గొన్నారు.

సాంకేతిక పరిజ్ఞానంతో పంటల సాగు మేలు

కొత్తూరు, ఫిబ్రవరి 22: శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పంటలను సాగు చేసేందుకు రైతులు కృషి చేయాలని వ్యవసాయ శాస్తవ్రేత్త డాక్టర్ శ్రీలత అన్నారు. శుక్రవారం కొత్తూరు మండలం మల్లాపూర్ గ్రామంలో పంటల సాగు, యజమాన్య పద్దతులపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. శాస్తవ్రేత్త డాక్టర్ శ్రీలత మాట్లాడుతూ వ్యవసాయ సాగులో రసాయన ఎరువులకు బదులుగా సేంద్రీయ ఎరువులను వినియోగించి పంటలను సాగుచేస్తే దిగుబడి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు సైతం ఎక్కువగానే ఉన్నాయని సూచించారు. వ్యవసాయ పొలంలో రసాయన ఎరువులు వినియోగించడంతో భూమిలో సారం తగ్గి పంటల దిగుబడి క్రమంగా తగ్గిపోతుందని, దాంతో అన్నదాతలు ఆర్థికంగా నష్టాలను చవి చూడాల్సి వస్తుందని అన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలాజీని సద్వినియోగం చేసుకొని పంటలను సాగుచేస్తే అన్నదాతలు ఆర్థికంగా అభివృద్ధి సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ పంటలను సాగుచేయాలని అప్పుడే అన్నదాతలు అనుకున్న పంటల దిగుబడి పెరిగే అవకాశాలు ఉంటాయని అన్నారు. రైతులు పంట మార్పిడి విధానం అవలంభించడంతోపాటు యజమాన్య పద్ధతిలో పంటలను సాగుచేస్తే బాగుంటుందని తెలిపాన్నారు. మల్లాపూర్ గ్రామ రైతులను ప్రొత్సహించడంతోపాటు శాస్త్ర సాంకేతిక సలహాలను ఎప్పటికప్పుడు అందించడానికి వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి దత్తాత తీసుకొనున్నట్లు వివరించారు. ఇందుకు రైతులందరు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో షాద్‌నగర్ వ్యవసాయ సంచాలకులు రాజారత్నం, వ్యవసాయ విస్తరణ అధికారి మణికంఠ, వ్యవసాయ విశ్వ విద్యాలయం శాస్తవ్రేత్తలు డాక్టర్ అపర్ణ, డాక్టర్ లతీప్ పాష, డాక్టర్ సునీత, డాక్టర్ శైలజ, డాక్టర్ సుధారాణి, డాక్టర్ శంకర్, రైతులు మధుసుదన్ రావు, సుదర్శన్, సుభాష్ రెడ్డి, శంకర్ నాయక్, మహత్మారెడ్డి, నర్సింలు గౌడ్, జలందర్ చారి పాల్గొన్నారు.