రంగారెడ్డి

నాలుగు నామినేషన్లు దాఖలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, మార్చి 20: మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానానికి బుధవారం నాలుగు నామినేషన్లు దాఖలైనట్లు మేడ్చల్ జిల్లా ఎన్నికల అధికారి ఎంవీ రెడ్డి తెలిపారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానానికి భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్ రామచందర్ రావు, జంబు ద్వీపా జనతా పార్టీ నుంచి ఈ.తిరుపతయ్య, ఇండిపెండింట్ అభ్యర్థులుగా సీహెచ్ చంద్రశేఖర్, శంకర్ వినోద్ కుమార్ నామినేషన్ పత్రాలు మేడ్చల్ కలెక్టరేట్‌లో రిటర్నింగ్ అధికారి ఎంవీ రెడ్డికి సమర్పించారు. ఇప్పటి వరకు మొత్తం ఐదు నామినేషన్లు దాఖలైనట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
టీఆర్‌ఎస్ అభ్యర్థిని
భారీ మెజారిటీతో గెలిపించాలి
ఉప్పల్, మార్చి 20: పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని జడ్పీటీసీ మంద సంజీవ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ బోడుప్పల్ పురపాలక సంఘం కమిటీ కార్యాలయంలో జరిగిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. అభివృద్ధిలో శరవేగంగా దూసుకెళ్తున్న బోడుప్పల్‌లో మరింత అభివృద్ధి సాధించాలంటే అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించాలని అన్నారు. శాసనసభ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే రెట్టింపు మెజారిటీని తీసుకరావడానికి కార్యకర్తలు ఉత్సాహంతో సైనికుడిలా పని చేయాలని పేర్కొన్నారు. చర్ల ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ నాయకులు మీసాల యాదగిరి, బొమ్మక్ నర్సింగ్‌రావు, తోటకూర అశోక్ యాదవ్, రవీందర్, కృపా సాగర్, జడిగె రమేశ్, అమృతం, వీరాచారి, బింగి జంగయ్య పాల్గొన్నారు. అనంతరం డివిజన్ అధ్యక్షుడు రాపోలు వీరారెడ్డి జన్మదిన వేడుకలను కార్యకర్తల ఆనందోత్సవాల మధ్య ఘనంగా నిర్వహించారు.

జనసేన కార్యాలయం ప్రారంభం
ఉప్పల్, మార్చి 20: రాబోయే రోజుల్లో ప్రజలకు నిష్పక్షపాతంగా సేవ చేయాలనే లక్ష్యంతో అందరికీ ఆమోదయోగ్యమైన మెనిఫెస్టోతో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ వచ్చారని మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం ఉప్పల్‌లో జనసేన పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. త్వరలో జరుగబోయే ఎన్నికలకు తెలంగాణలో మొట్టమొదటి అభ్యర్థిగా మల్కాజిరిగి సీటును తనకు కేటాయించడం ఆనందంగా ఉందని అన్నారు. సామాన్య ప్రజలు, యువత, కార్మికులు, కర్శకుల సంక్షేమానికి జనసేన పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అవినీతిరహిత రాజకీయ వ్యవస్థను స్థాపించాలంటే జనసేనని అధికారంలోకి తీసుకరావాలని తెలిపారు. జాతీయ పార్టీ బీఎస్పీతో పొత్తు ఉన్న దృష్ట్య రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. అభివృద్ధి, సంక్షేమం దిశగా తమ పార్టీ ఎంపీలు కృషి చేస్తారని, విభజన హామీల్లో భాగంగా వివిధ అంశాలలో తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించేందుకు మల్కాజిగిరి ఓటర్లు ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో జనసేన నాయకుడు భాను ప్రసాద్ పాల్గొన్నారు.
ప్రజా స్వరాజ్ పార్టీ అభ్యర్థిగా బసవయ్య
రాజేంద్రనగర్, మార్చి 20: చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రజాస్వరాజ్ పార్టీ అభ్యర్థిగా బసవయ్య మాదిగ నామినేషన్ వేశారు. బుధవారం రాజేంద్రనగర్‌లోని కార్యాలయంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. మొదటి నామినేషన్ కావడం విశేషం.