రంగారెడ్డి

విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, మార్చి 20: విద్యార్థులు శ్రద్ధతో విద్యనభ్యసించి ఉన్నత స్థానాలకు ఎదగాలని దూలపల్లి పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్ వీ.స్వరూప అన్నారు. గండిమైసమ్మ దుందిగల్ మండల పరిధిలోని దూలపల్లి గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి విద్యార్థులు 5వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న స్వరూప మాట్లాడుతూ ప్రైమరీ పాఠశాల నుండే విద్యార్థులు దిశా నిర్దేశంతో ముందుకు వెళ్లాలని సూచించారు. పాఠశాల హెచ్‌ఎం శంకరయ్య, దూలపల్లి గ్రామ మహాయూత్ అసోసియేషన్ సభ్యులు వెంకటేశ్, అశ్విన్‌కుమార్, రాంమోహన్, కిరన్, విజయ్, రమేశ్, జడ్పీ స్కూల్ తెలుగు పండిట్ లాలయ్య, ఉపాధ్యాయులు బాలకిషన్, బాలరాజు పాల్గొన్నారు.
ప్రజల దాహార్తిని తీర్చాలి
బాలానగర్, మార్చి 20: వేసవి కాలం దృష్ట్యా ప్రజల అవసరాలకు అనుగుణంగా తాగునీటిని అందించాలని బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ కాండూరీ నరేంద్ర ఆచార్య అన్నారు. బుధవారం జలమండలి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జలమండలి జీఎం వేణుగోపాల్‌కు వినతి పత్రం అందజేశారు. లోప్రెషర్ ఉందని వివరించారు. జీఎం వేణుగోపాల్, డీజీఎం రాజేష్, ఏఈ శ్రీనాథ్ రావు మాట్లాడుతూ గోదావరి జలాలు అనుసంధాన ప్రక్రియ జరుగుతుందని, రెండు రోజులలో పనులు పూర్తి అవుతాయని తెలిపారు.

మంత్రి ఈటలకు సగర సంఘం సన్మానం
శేరిలింగంపల్లి, మార్చి 20: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్‌ను తెలంగాణ రాష్ట్ర సగర సంఘం ఆధ్వర్యంలో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బంగారు నర్సింహ సగర, ప్రధాన కార్యదర్శి ఉప్పరి శేఖర్ సాగర్, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బుధవారం మంత్రిని కలిసి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నవారిలో సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు మాధంశెట్టి సువర్ణ సగర, యువజన విభాగం అధ్యక్షుడు పెదబూదుల సతీష్ సగర, యాదాద్రి అన్నదాన సత్రం కోశాధికారి మాధంశెట్టి కృష్ణ సగర, గణేష్ సగర, లక్ష్మీ సగర పాల్గొన్నారు.