రంగారెడ్డి

రోడ్డెక్కిన ప్రజలు.. ఖాళీ బిందెలతో ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, మార్చి 21: నగర శివారు బోడుప్పల్ పురపాలక సంఘం పరిధిలో తాగు నీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఒకవైపు ఎండలు ముదురుతుండటంతో బోర్లలో భూగర్భ జలాలు అడుగంటిపోయి సమస్య ఉత్పన్నమవుతోంది. పురపాలక సంఘం పరిధిలోని కొన్ని కాలనీలలో సమస్య లేకపోయినప్పటికీ మరికొన్ని కాలనీలలో తీవ్రంగా ఉంది. నల్లాల్లో 12 రోజులుగా నీరు సరఫరా లేకపోవడంతో దాహర్తితో అలమటిస్తున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ సరఫరా చేసే నీళ్లు రావు.. కొనుకుందామనుకుంటే ట్యాంకర్ డ్రైవర్ల సమ్మెతో సమస్య మరింత జఠిలమైంది. దీంతో ఏమీ చేయలేక హోళీ సంబురాలకు దూరంగా ఉంటూ అధికారుల తీరును నిరసిస్తూ కాలనీల ప్రజలు రోడ్డెక్కారు. అశోక్‌నగర్, ఉదయ్‌నగర్, హనుమాన్‌నగర్, లక్ష్మినగర్, ఆకృతి టౌన్‌షిప్ పరిసర ప్రాంతాల కాలనీల ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఖాళీ బిందెలతో ప్రదర్శన నిర్వహించి అనంతరం ఎన్టీఆర్ విగ్రహం చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. 12 రోజులుగా నల్లాల్లో నీళ్లు రాక కనీసం స్నానాలు చేయలేక, తాగడానికి సైతం ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రోజు రోజుకు సమస్య తీవ్రమవుతుంటే అధికారులు, పాలకులు ఏమి చేస్తున్నారని ధ్వజమెత్తారు. వీ వాంట్ వాటర్ అంటూ నినాదాలతో రహదారి దద్దరిల్లింది. ఆందోళనకారులకు కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య సంపూర్ణ మద్దతు పలికింది. ప్రధాన రహదారిలో రెండు గంటల పాటు నిర్వహించిన ఆందోళనతో వచ్చిపోయే వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. మేడిపల్లి ఎస్‌ఐ రఘురామ్ ఆధ్వర్యంలో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను ఒప్పించి ఆందోళన విరమింపజేశారు.
అక్రమ నీటి వ్యాపారంపై అభ్యంతరం
* బోర్లు సీజ్.. ట్యాంకర్ల డ్రైవర్ల సమ్మె
బోడుప్పల్ పురపాలక సంఘం పరిధిలో అక్రమ నీటి వ్యాపారం జోరుగా సాగుతుంది. ఎండలు తీవ్రం కావడంతో బోర్లలో భూగర్భ జలాలు అడుగంటిపోయి నీటి సమస్య తీవ్రమైంది. నిత్యం ఎక్కడో ఒక్క చోట వాటర్ పైపులైన్లు పగులుతుండటంతో నల్లాల్లో నీరు సరిగా రావడంలేదు. దీంతో ఏమీ చేయలేక బయట ట్యాంకర్లతో రూ.600 నుంచి 800 వెచ్చించి కొనుగోలు చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. బోర్లు ఎండిపోతుండటంతో కాలనీలలో అక్రమ నీటి వ్యాపారాన్ని అడ్డుకున్న ప్రజలు తక్షణమే చర్యలు తీసుకోవాలని తహశీల్దార్‌కు ఫిర్యాదు చేయడంతో స్పందించిన అధికారులు బోర్లను సీజ్ చేశారు. దీంతో ట్యాంకర్ల డ్రైవర్లు సమ్మెకు దిగారు. ఒకవైపు నల్లాల్లో నీళ్లు రాకపోవడం.. మరొక వైపు ట్యాంకర్లు బంద్ కావడంతో నీళ్లు దొరకక ఆందోళన బాట పట్టాల్సి వచ్చిందని ప్రజలు వాపోతున్నారు.
జడ్పీటీసీ జోక్యంతో
సమ్మె విరమించిన ట్యాంకర్ డ్రైవర్లు
జడ్పీటీసీ మంద సంజీవ రెడ్డి ప్రజాందోళనపై స్పందించారు. నీటి సమస్యకు కారణమేమిటని అడిగి తెలుసుకుని రెవెన్యూ అధికారులతో మాట్లాడి ద్వారకానగర్‌లో సీజ్ చేసిన బోరును తెరిపించడంతో ట్యాంకర్ల డ్రైవర్లు సమ్మెను విరమించుకున్నారు. రెండు రోజుల క్రితం కాలనీ ప్రజల ఫిర్యాదుతో అధికారులు బోరును సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఎంఎస్‌ఆర్ చొరవతో తిరిగి ట్యాంకర్లు ప్రారంభమయ్యాయి. మున్సిపల్ సరఫరా చేసే నీటిపై మంత్రి మల్లారెడ్డి దృష్టికి తీసికెళ్లి యుద్ధప్రాతిపదికన సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ట్రాఫిక్ సమస్యకు కారణమైన
ఆందోళనకారులపై కేసులు
తాగునీటి సమస్యపై ఆందోళన బాట పట్టిన కాలనీ ప్రజలతో పాటు మద్దతు పలికిన కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య ప్రతినిధులపై మేడిపల్లి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది.
నీటి సమస్యను పరిష్కరించాలని ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన కాలనీ ప్రజలు రాస్తారోకో నిర్వహించారు. ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దీనికి కారణమైన పసుల అమరేందర్ రెడ్డి, తోటకూర ప్రవీణ్ యాదవ్, అశోక్ రెడ్డి, స్వర్ణ, భారతమ్మ, సౌజన్య, శోభ మద్దతు ప్రకటించిన సమాఖ్య ప్రతినిధులు రాపోలు రాములు, బొమ్మక్ రమేశ్, ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, ప్రమోద్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రఘురామ్ తెలిపారు.