రంగారెడ్డి

మల్కాజిగిరి కాంగ్రెస్‌లో నూతనోత్తేజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మల్కాజిగిరి, మార్చి 21: మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి కాంగ్రెస్ శ్రేణుల్లో నిరాశ నిస్పృహలు కనిపించగా, ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో జోష్ కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి టికెట్ ఇవ్వకుండా పొత్తులో భాగంగా టీజేఎస్‌కు మల్కాజిగిరి అసెంబ్లీ సెగ్మెంట్ టికెట్ కేటాయించింది. చేసేదిలేక మొక్కుబడిగా ఇక్కడి శ్రేణులు పనిచేశారు. ప్రస్తుతం మల్కాజిగిరి పార్లమెంట్ స్ధానం నుంచి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన రేవంత్ రెడ్డిని బరిలో ఉన్నారు. మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలు జోష్‌లో ఉన్నారు. అభ్యర్థి గెలుపు కోసం ఐక్యతా రాగాన్ని వినిపిస్తున్నారు. సెగ్మెంట్ కాంగ్రెస్ ఇన్‌చార్జి నందికంటి శ్రీ్ధర్ ఆధ్వర్యంలో మల్కాజిగిరిలో బుధవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి భారీ స్థాయిలో పార్టీ శ్రేణులతో పాటు అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున తరలి రావటంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానుల్లో నూతనోత్తేజం తొనికిసలాడింది. పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం పార్టీ శ్రేణులందరిని ఆకట్టుకుంది. గతంలో వ్యక్తిగత విమర్శలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే రేవంత్.. ప్రస్తుతం పరిణతితో ప్రసంగించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం, తనకోసం 20 రోజులు కష్టపడండి మీకోసం 20 సంవత్సరాలు పనిచేస్తానంటూ ప్రసంగించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షం ఉంటేనే అది పరిఢవిళ్లుతోందని చెబుతున్నారు. పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేయటంతో మంచి ఉత్సాహం నెలకొంది.
రాజీకిరాని మాజీలు
నియోజకవర్గల పునర్విభజనలో మల్కాజిగిరి అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు కొత్తగా వెలిశాయి. మొదటి మల్కాజిగిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, మొదటి పార్లమెంట్ సభ్యుడైన సర్వే సత్యనారాయణ ఈ ఇద్దరూ కూడా కాంగ్రెస్‌కి చెందిన వారే. సర్వే సత్యనారాయణను రేవంత్ రెడ్డి స్వయంగా తన ఇంటికి వెళ్లి మద్దతు కోరినప్పటికీ కార్యకర్తల సమావేశానికి రాలేదు. మరొకరు మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ కూడా సమావేశానికి హాజరు కాకపోవటంతో చర్చనీయంగా మారింది.
సాక్షాత్తు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ అభ్యర్థి అయినప్పటికీ మాజీలు మాత్రం ఈ సమావేశానికి రాకపోవటంలో అత్యర్యం ఏమిటని చర్చించుకుంటున్నారు. పార్టీలో క్రమశిక్షణ పూర్తిగా లోపించిన విషయం ప్రజల్లో కొట్టొచ్చినట్టు కనబడుతోంది.