రంగారెడ్డి

యువతలో వెల్లివిరిసిన కలర్ జోష్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్: హోలీ.. రంగోళి వేడుకలు ఉప్పల్ పరిసర ప్రాంతాల ప్రజలు ఆనందోత్సవాల వాడవాడలా మధ్య జరుపుకున్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా యువకులు, మహిళలు, పెద్దలు, కార్మికులు, కర్షకులు రంగులు చల్లుకుంటూ ప్రేమానురాగాలు పంచుకుంటూ ఎంజాయ్ చేశారు. చిల్కానగర్, హబ్సిగూడ, రామంతాపూర్, ఉప్పల్, బోడుప్పల్, చెంగిచర్ల, మేడిపల్లి, పీర్జాదిగూడ, పర్వతాపూర్, కాచివానిసింగారం ప్రాంతాల్లో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆట పాటలతో యువతలో ఉత్సాహం, జోష్ కన్పించింది. ప్రధాన రహదార్లలో వాహనాలు లేకపోవడంతో బోసిపోయినట్లు కన్పించాయి. కాలనీలలో మధ్యాహ్నం వరకు వేడుకల్లో మునిగి తేలారు. ప్రజాప్రతినిధులు సైతం సంబురాల్లో పాల్గొని యువత స్టెప్పులకు అడుగులు వేసి ఎంజాయ్ చేస్తూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. హోలీ సందర్భంగా మద్యం దుకాణాలు బంద్ కావడంతో నగర శివారు పర్వతాపూర్, కాచవానిసింగారం, ప్రతాప్‌సింగారం ప్రాంతాల్లోని కల్లు దుకాణాలు కిటకిటలాడాయి. మత్తులో ఊగుతూ ఎంజాయ్ చేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తుతో పాటు అడుగడుగునా నిఘా పెట్టారు.
కీసర: కీసర మండలంలోని పలు గ్రామాల్లోని ప్రజలు గురువారం హోలీ పండుగ సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. బుధవారం రాత్రి కామదహనం చేసిన ప్రజలు గురువారం ఉదయం ఆరు గంటల సమయానికే చిన్నారులు, పెద్దలు రోడ్ల పైకి చేరుకొని వివిధ రంగులు కలిపిన నీటితో ఒకరిపైఒకరు చల్లుకుంటూ వీధుల వెంట కేరింతలతో పరుగులు తీసారు. ప్రజాప్రతినిధులు ప్రజలతో మమేకమై హోలీ సంబరాల్లో పాల్గొన్నారు.
మహేశ్వరం: మహేశ్వరం మండలంలోని గ్రామాల్లో హోలీ సంబరాలు గురువారం ఘనంగా నిర్వహించారు. బుధవారం అర్ధరాత్రి తర్వాత కామదహనం చేశారు. డప్పలతో ఊరేగింపుగా ఇంటింటికి వెళ్లి పిడకలు పాత కట్టెలను సేకరించారు. గ్రామ నడుమ కామదహనం చేపట్టారు. గురువారం హోలీ సంబరాలను నిర్వహించారు. మహేశ్వరంలో సర్పంచి కర్రోళ్ల ప్రియాంక, ఉప సర్పంచి దోమ శ్రీనివాస్ రెడ్డి, సిరిగిరిపురంలో కాసుల సురేష్ తుమ్మాలూర్‌లో మద్ది సురేఖ, ఘట్టుపల్లి అనితారెడ్డి, మన్‌సాన్‌పల్లిలో అరుణ పాల్గొన్నారు. సంప్రదాయంగా డప్పలడోలు వాయిస్తూ గ్రామాలల్లో అన్ని బస్తీలలో తిరుగుతూ చిన్న పెద్దా తారతమ్యం లేకుండా అందరూ హోలీ పండుగ సందర్బాంగా ఒకరిపైఒకరు రంగులు చల్లుకున్నారు.
కొడంగల్: హోలీ సంబరాలు ఉత్సహంగా జరుపుకున్నారు. ఉత్సవాలలో బాగంగా గురువారం ఉదయం పట్టణంలోని ఆయా వార్డులలో యువకులు కామదహనం నిర్వహించారు. అనంతరం పలు రంగులతో రంగోలీ కార్యక్రమం ఉల్లాసంగా నిర్వహించారు. మధ్యాహ్నం వరకు కార్యక్రమం విజయవంతంగా జరుపుకున్నారు.
మేడ్చల్: రంగులకేళి హోలీ పండుగను గురువారం మేడ్చల్ పట్టణంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రజలు ఆనందోత్సావాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసిమెలిసి ఎంతో ఉత్సాహాంగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ‘హ్యపీ హోలీ’ అంటూ శుభాకాంక్షలు తెలుపుతూ సంబరంగా పండుగను జరుపుకున్నారు. యువకులు ద్విచక్ర వాహనాలపై కాలనీలలో కలియ తిరుగుతూ రంగులు చల్లుతూ కేరింతలు కొడుతూ ఎంతో ఆనందంగా గడిపారు. హోలీ సందర్భంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. కూడళ్లలో ఎక్కడ చూసినా రంగులు చల్లుకుంటూ యువకులు కనిపించారు. ఇళ్ల వద్ద మహిళలు కూడా రంగుల చల్లుకుంటూ హోలీ పర్వదినాన్ని తనివితీరా అస్వాదించారు. పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు సంబరాల్లో మునిగితేలారు. మొత్తం మీద హోలి పండుగ సంబరాలు ప్రశాంతంగా జరిగాయి.