రంగారెడ్డి

ఠాకూర్ హరిప్రసాద్ మానసిక వికలాంగుల సంస్థకు సీఎంఆర్ షాపింగ్ మాల్ చేయాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్‌సుఖ్‌నగర్, మార్చి 23: దిల్‌సుఖ్‌నగర్ వివేకానందనగర్‌లో గల ఠాకూర్ హరిప్రసాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ ది మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ సంస్థకు సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్యాట్ని సెంటర్ రూ.పది లక్షల ఆర్థిక సాయాన్ని శనివారం అందజేసింది. సామాజిక సేవా భాధ్యతలో భాగంగా సిఎంఆర్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సత్యనారాయణ సత్తిబాబు పది లక్షల రూపాయల చెక్కును ఠాకూర్ హరిప్రసాద్ సంస్థ నిర్వాహకుడు విజయ్ ఠాకూర్‌కు అందజేశారు. సీఎంఆర్ ఎండీ సత్తిబాబు మాట్లాడుతూ వినియోగదారుల ఆదరాభిమానాలతో ఉన్నత స్థాయికి చేరిన తమ సంస్థ సమాజానికి తమవంతు సహాకారం అందించాలన్న నేపంతో బాధ్యతగా సేవచేయాలనే ఉద్ధేశ్యంతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నీటి సౌకర్యం లేని గ్రామీణ ప్రాంతాలలో పీటీ వసతి, పేద విద్యార్థులకు దత్తత తీసుకొని చదువు చెప్పించడం వంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామన్నారు. సంగారెడ్డిలో అంబులెన్ను అందజేసినట్లు వివరించారు. దిల్‌సుఖ్‌నగర్‌లో త్వరలో సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభం కానుందని తెలిపారు.
ఘనంగా పద్మమ్మ యోగిని మాత ఆరాధన వారోత్సవాలు
పరిగి, మార్చి 23: పద్మమ్మ యోగిని మాత తోమ్మిదో వార్షిక ఆరాధన వారోత్సవాలు గొడుగొని పల్లి గ్రామంలో శనివారం ఘనంగా జరిగాయి. కర్ణాటక, మహరాష్ట్రాల నుంచి భక్తులు అశేషంగా హజరైయినారు. అంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆశ్రమంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక భజన మండలి భక్తులు భజనలు చేశారు. దోమ మండల పరిధిలోని గ్రామాల నుంచి భక్తులు వచ్చారు. సర్పంచ్ అక్కలి అంజనేయులు బాస్‌పల్లి, గూడూరు, ఏనికేపల్లి, మైలారం, మోత్కూర్, దోర్నాల్‌పల్లి గ్రామాల తరలివచ్చారు. అమ్మవారి పల్లికి సేవ నిర్వహించారు.
నేడు తాండూరులో
ఉచిత జైపూర్ కాళ్ల అమరిక శిబిరం
తాండూరు, మార్చి 23: తాండూరు మార్వాడీ యువ మంచ్ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని శ్రీ బాలాజీ మందిర్ ఆవరణలో ఉచిత జైపూర్ కాళ్ల అమరిక, పోలీయో గ్రస్తులకు కెలిపర్‌ల ఏర్పాటు శిబిరం నిర్వహిస్తున్నట్లు మార్వాడీ యువమంచ్ ప్రతి నిధులు అధ్యక్ష కార్యదర్శులు కుంజ్ బీహారీ సోనీ, అనిల్ సార్దాలు శనివారం సాయంత్రం ఓక ప్రకటనలో వెల్లడించారు. ప్రమాదవశాత్తు కాళ్ళు కోల్పొయిన బాధితులకు, పోలీయో గ్రస్తులై కాళ్లు చచ్చుబడిన వారికి ఉచిత శిబిరంలో జైపూర్ కాళ్లు, కాలిపర్స్‌ను అమర్చటం జరుగుతుందని వారు తమ ప్రకటనలో వెలువరించారు.