రంగారెడ్డి

కిరాణాషాపులో అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, మార్చి 23: కిరాణాషాపులో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో ప్లాస్టిక్ సామాగ్రి, నిల్వ ఉంచిన టపాసులు పూర్తిగా దగ్ధమైపోయాయి. శనివారం మధ్యాహ్నం షాద్‌నగర్ పట్టణంలోని మొయిన్‌రోడ్డులో మణికంఠ ఏజెన్సీ కిరాణాషాపులో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... శనివారం మధ్యాహ్నం మణికంఠ ఏజెన్సీ కిరాణా షాపులో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. షాపులో నిల్వ ఉన్న ప్లాస్టిక్ సామాగ్రితోపాటు టపాసులు పూర్తిగా దగ్ధమైపోయాయి. భారీ ఎత్తున శబ్దం రావడంతో చుట్టుపక్కల షాపుల వారు ఒక్కసారిగా బయటకు వచ్చి చూసే సరికి మంటలు ఎగిసిపడుతున్నాయి. దాంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటికి ఫైరింజన్ సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆదుపులోకి తీసుకువచ్చాయి. అగ్నిప్రమాదంలో ఆస్తి నష్టం జరిగింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. తృటిలో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రధాన మొయిన్ రోడ్డుపైనే ఈ సంఘటన చోటు చేసుకోవడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే పూర్తిగా నిలిచిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న షాద్‌నగర్ ఎస్‌ఐ విజయభాస్కర్‌తోపాటు సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదంలో ఎంత ఆస్తి నష్టం జరిగిందనే విషయంపై స్పష్టత రాలేదు. బాధితుల నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఎస్‌ఐ విజయభాస్కర్ వివరించారు.