రంగారెడ్డి

ఎంపీ అసదుద్దీన్‌ని కలిసిన కార్తీక్, రంజిత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, మార్చి 23: హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీని చేవెళ్ల టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి పటోళ్ల కార్తీక్ రెడ్డితో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. రంజిత్‌రెడ్డి తన అభ్యర్థిత్వాన్ని ఎంఐఎం నుంచి బలపరచాలని కోరారు. ఇందుకు స్పందించిన అసదుద్దీన్ తప్పకుండా తమ సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు.
ఈవీఎం, వీవీ ప్యాట్‌లపై అవగాహన
కొందుర్గు, మార్చి 23: ఓటు హక్కు వినియోగంపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. శనివారం కొందుర్గు మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో తహశీల్దార్ కిష్టారెడ్డి ఆధ్వర్యంలో ఈవీఎం, వీవీప్యాట్‌ల వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. తహశీల్దార్ కిష్టారెడ్డి మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. కొందుర్గు మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. ఈవీఎం, వీవీ ప్యాట్‌ల వినియోగంపై ప్రజలు పూర్తిగా అవగాహన పెంచుకొని ఓటు వేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

త్వరలోనే కేటీఆర్ పర్యటన
వికారాబాద్, మార్చి 23: త్వరలోనే మంత్రి కేటీఆర్ రోడ్‌షో వికారాబాద్ నియోజకవర్గంలో ఉంటుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఎం.ఆనంద్ తెలిపారు. శనివారం నివాసంలో టీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మాట్లాడుతూ, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం వికారాబాద్‌లోనే నిర్వహిస్తామని, ఈ సమావేశానికి సీఎం కేసీర్ హాజరవుతారని అన్నారు. త్వరలోనే కేసీఆర్, కేటీఆర్ పర్యటన తేదీలను ప్రకటిస్తామని కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తలు బేధాభిప్రాయాలు పక్కనపెట్టి పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని అన్నారు. సమావేశంలో నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, రాంచెంద్రారెడ్డి, శంకర్ ఉన్నారు
సంక్షేమ పథకాలను వివరించాలి
హయత్‌నగర్, మార్చి 23 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృధ్దిని ప్రజలకు వివరించి ఓట్లు అభ్యర్థించాలని చేవెళ్ల పార్లమెంట్ టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ రంజిత్‌రెడ్డి తెలిపారు. శనివారం చంపాపేట్‌లో పౌల్ట్రీ రైతుల ఆధ్వర్యంలో సన్నాహక సభ నిర్వహించారు. రంజిత్‌రెడ్డికి టికెట్ కేటాయించడంపట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ప్రభుత్వాలు చేయని విధంగా కేసీఆర్ ప్రభుత్వం అభివృధ్ది చేసిందని అన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. భారీ మెజారిటితో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎర్రబెల్లి ప్రతీప్‌కుమార్, మోహన్‌రెడ్డి, రాంరెడ్డి, రమేష్, వెంకట్రావు, చక్రధర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, బాలస్వామి, జగదీశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.