రంగారెడ్డి

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, మార్చి 23: పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రజా ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్ మస్రత్ ఖానమ్ అయేషా అన్నారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పలు పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎం, వీవీ ప్యాట్లు, అన్ని రాకీయ పార్టీల నాయకుల సమక్షంలో మొదటి ర్యాండమైజేషన్ చేయడం జరిగిందని అన్నారు.
జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈవీఎం, వీవీ ప్యాట్లను యూనిట్లను నాలుగు భాగాలుగా విభజించి అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్‌సమ భాగాలుగు విభజించనున్నట్లు తెలిపారు. ర్యాండమైజేషన్ విధానం పై రాజకీయ నాయకులకు, ప్రతినిధులకు పవర్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. ఈసీఐఎల్ నుంచి టెక్నికల్ ఇంజనీర్లు ఈవీఎంలు, వీవీ ప్యాట్లను క్లీనింగ్ చేసి వాటిలోని నెంబర్లను కంప్యూటర్లలో ఫీడ్ చేయనున్నట్లు వివరించారు. సమావేశంలో జేసీ అరుణకుమారి, టీఆర్‌ఎస్ నాయకులు సాయన్న, శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు పీ.శ్రీనివాస్, బీజేపీ నాయకులు శంకర్, రాజయ్య ఉన్నారు.

ఎన్నికలకు బందోబస్తు
నేరేడ్‌మెట్, మార్చి 23: పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వరశర్మ తెలిపారు. శనివారం మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని వౌలాలిలో 300 మంది పోలీసు సిబ్బందితో ప్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. డీసీపీ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మల్కాజిగిరి జోన్ పరిధిలో పటిష్టమైన భధ్రత ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సీఐలు మన్‌మోహన్, నరసింహ సిబ్బంది పాల్గొన్నారు.
కాంగ్రెస్‌ను గెలిపించాలి
ఘట్‌కేసర్, మార్చి 23: మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి కార్యకర్త సైనికునిల్లా పని చేయాలని కాంగ్రెస్ మేడ్చల్ బీ-బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్‌గౌడ్ తెలిపారు. పోచారం పురపాలక సంఘం అన్నోజిగూడ్ప్పులోని ఎస్‌బీఆర్ గార్డెన్‌లో శనివారం జరిగిన మున్సిపాలిటీ కాంగ్రెస్ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా సంక్షేమాన్ని మరిచి స్వంత ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు ఆరోపించారు. పార్టీని బలోపేతం చేసుకోవటమే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిగా భావిస్తున్నట్లు విమర్శించారు. ప్రతి పక్షం ఉంటే తాను చేస్తున్న అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తారనే భయంతో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు, ప్రజా ప్రతినిధులను బెదిరింపులకు పాల్పడి పార్టీలో చేర్చుకుంటున్నాడని ఆరోపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకుడు మెట్టు బాల్‌రెడ్డి, పోచారం మున్సిపాలిటీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌గౌడ్, దేవేందర్, సుమన్‌గౌడ్, వి.వెంకటేశ్, రమేశ్, సహదేవ్‌గౌడ్, కృష్ణారెడ్డి, ప్రభాకర్, సహదేవ్, హరిశంకర్ పాల్గొన్నారు.

ప్రమాదపుటంచున విద్యార్థుల ప్రయాణం
* ప్రైవేటు వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణీకులు* అదనపు బస్సులు నడపాలని విజ్ఞప్తి
యాచారం, మార్చి 23: పదో తరగతి వార్షిక పరీక్షలు విద్యార్థులను ప్రమాదపుటంచున ప్రయాణం చేసేలా చేస్తున్నాయి. సమయానికి ఆర్టీసీ బస్సులు, ప్రజారవాణా సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిమితికి మించి ప్రయాణీకులతో వెళ్తున్న ప్రైవేటు వాహనాల్లో పరీక్షా కేంద్రాలకు, పరీక్ష ముగిసిన తరువాత ఇళ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. యాచారం మండల పరిధిలో నాలుగు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా మొత్తం 833 మంది విద్యార్థులు వార్షిక పరీక్షలకు హాజరవుతున్నారు. పరీక్షా కేంద్రాలైన యాచారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పుడమి ఉన్నత పాఠశాల, గున్‌గల్‌లోని ఆదర్శ పాఠశాల, నందివపర్తిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులు సమయానికి లేకపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లోని విద్యార్థులకు నాలుగు కేంద్రాలే పరీక్షలకు కేటాయించడంతో వీటిల్లో పరీక్షలు రాసేందుకు వెళ్లాలంటే అవస్థలు పడుతున్నారు. ఆర్టీసీ యాజమాన్యం పరీక్షలకు అదనపు బస్సులు నడుపుతున్నామని చెబుతున్నప్పటికి వాటిని సమయానికి నడపడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇది విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. ఇటీవలే ప్రైవేటు వాహనంలో వెళ్తూ ఓ పదో తరగతి విద్యార్థి కింద పడి తీవ్రగాయాలయ్యాయ. విద్యార్థులు పట్టించుకునే వారు కరువయ్యారు. ఇప్పటికైనా ఆర్టీసీ యాజమాన్యం పరీక్షా సమయాన్ని దృష్టిలో పెట్టుకొని అదనపు స్పెషల్ బస్సులు నడపాలని విద్యార్థులు కోరుతున్నారు. పరీక్షలు ముగిసేంత వరకు రవాణా సౌకర్యాన్ని కల్పించాలని అధికారులను వేడుకుంటున్నారు.

ఏప్రిల్ 18న చుక్కాపూర్‌లో
బొడ్రాయి పండగ
తలకొండపల్లి, మార్చి 23: మండలంలోని చుక్కాపూర్ గ్రామ పంచాయితీలోని బొడ్రాయి పండగ విగ్రహ ప్రతిష్టను ఏప్రిల్ 18,19,20వ తేదీలలో 3రోజులపాటు నిర్వహించనున్నట్లు స్థానిక సర్పంచ్ దాసరి కిష్టమ్మ పెర్కొన్నారు. బొడ్రాయి విగ్రహా ప్రతిష్టతోపాటు గ్రామంలో పోతురాజు,కోటమైసమ్మ దేవాలయాలను కుడ నూతనంగా నిర్మించనున్నట్లు వారు సూచించారు. బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించడానికి గత రెండు సంవత్సరాల క్రితం గ్రామస్తులు తీర్మానం చేసిన కొన్ని అనివార్య కారణాలవల్ల వాయిదా వేస్తూ వచ్చారు. ఎన్నికలకు ముందు స్థానిక సర్పంచ్ కిష్టమ్మ వాగ్ధానం మెరకు ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత వేసవి కాలంలో పాఠశాలలకు సెలవులు రావడంతో, పలువురి సూచనల మేరకు బొడ్రాయ విగ్రహా ప్రతిష్టకు గ్రామస్తులతో మాట్లాడి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గ్రామంలో బీమనపల్లి సుమతమ్మ ఇంటి పక్కన విగ్రహ ఏర్పాటుకు శనివారం సర్పంచ్ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ జక్కు శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ శారదశంకర్, మాజీ ఎంపీటీసీ యాదయ్య, వార్డు సభ్యులు హైమద్, గ్రామస్తులు రంగారెడ్డి, మధుసుధన్ రెడ్డి, పాండురెడ్డి, తిరుపతిరెడ్డి, నర్సింహ, పాపయ్య, మధు, శ్రీనివాస్ రెడ్డి, వెంకటయ్య పాల్గొన్నారు.

గుర్రపుడెక్క
తొలగింపు
ఉప్పల్, మార్చి 23: పీర్జాదిగూడ పురపాలక సంఘం పరిధిలోని చెరువులలో గుర్రపుడెక్క తొలగింపునకు అధికారులు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఉన్న రెండు చెరువులలో పేరుకుపోయిన గుర్రపుడెక్క కారణంగా దోమలు పెరిగి ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని కాలనీల ప్రజల నుంచి ఫిర్యాదులపై స్పందించిన కమిషనర్ టీ.కృష్ణమోహన్ రెడ్డి చెరువుల క్లీన్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రత్యేకంగా నిధులు వెచ్చించి గుర్రపుడెక్కను ఎండబెట్టి తొలగించే పనులను శనివారం ప్రారంభించారు. శానటరీ ఇన్‌స్పెక్టర్ సుకృతారెడ్డి ఆధ్వర్యంలో పనులను మరింత వేగం చేశారు. ప్రాణాలతో చెలగాటమాడే దోమల నివారణ కోసం యంత్రాల ద్వారా ఫాగింగ్ చేశారు. కాలనీల మధ్య పొంగిపొర్లుతున్న మురుగు నీటి నియంత్రణకు చర్యలు చేపట్టినట్లు కమిషనర్ పేర్కొన్నారు.
‘సుకన్య సమృద్ధి యోజన’
పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
మేడ్చల్, మార్చి 23: ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరూ ‘సుకన్య సమృద్ధి యోజన’ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మునీరాబాద్ సర్పంచ్ చిట్టిమిల్ల గణేశ్ కోరారు. శనివారం గ్రామంలో సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ ఖాతాల దరఖాస్తులను అర్హులకు అందజేశారు. సర్పంచ్ మాట్లాడుతూ భారత ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రత్యేకంగా 0- 10 సంవత్సరాలలోపు బాలికల కోసం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. మహిళలు తమ దీర్ఘాకాలిక లక్ష్యాలైన ఉన్నత విద్య, వివాహం కోసం ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. 2018 - 2019 ఆర్థిక సంవత్సరంలో ఉన్న పొదుపు పథకాలలో అత్యధిక వడ్డీ ఇస్తున్న పథకం ఇదేనని వివరించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ నర్సింగ్ రావు, వార్డు సభ్యులు నరేందర్, లలిత, రమేశ్, కార్యదర్శి మల్లారెడ్డి పాల్గొన్నారు.