రంగారెడ్డి

వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తలకొండపల్లి, మార్చి 25: మండలంలోని దేవునిపడకల్ గ్రామంలో వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం పారాయణం, మహాభిషేకం, ప్రాత:కాల పూజ నిజరూప దర్శన కార్యక్రమాలను బ్రాహ్మణులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దేవాలయానికి చేరుకుని స్వామివారి నిజరూప దర్శనాని భక్తులు తిలకించారు. కార్యక్రమంలో ఆలయ దర్మకర్త లటుపల్లి లోహిత్ రెడ్డి, సర్పంచ్ శ్రీశైలం, ఉప సర్పంచ్ తిరుపత్తయ్య, లక్ష్మీనారాయణ, ఆంజనేయులు, రామస్వామి, శ్రీను, స్వామిగౌడ్, మల్లేష్ పాల్గొన్నారు.
ఎస్‌సీఎస్‌ఐ హైదరాబాద్ చాప్టర్ ప్రారంభం
రాజేంద్రనగర్, మార్చి 25: సాయిల్ కన్జర్వేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఎస్‌సీఎస్‌ఐ) హైదరాబాద్ చాప్టర్‌ను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని నీటి సాంకేతిక పరిజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపకులపతి డాక్టర్ వీ.ప్రవీణ్ రావు ప్రారంభించారు. ప్రవీణ్ రావు మాట్లాడుతూ ప్రొఫెషనల్ సంస్థలు.. సమాజాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. నేలకోతతో తరిగిపోతున్న భూసారాన్ని, వనరులను సంరక్షించడానికి అవసరమైన సూచనలు రైతులకు ప్రొఫెషనల్ సంస్థల ద్వారా అందాలని సూచించారు. భూమి కోతకు గురికాకుండా ఎటువంటి పంటలు సాగు చేయాలి, ఏఏ పద్ధతులు అవలంభించాలనే అంశాలను రైతులకు తెలియజేయాలని తెలిపారు. భూమి కోతకు గురికాకుండా సంరక్షించాల్సిన పద్ధతులను వ్యవసాయ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన శాస్తవ్రేత్తలు రూపొందించి వాటిని రైతులకు తెలియజేసేలా కృషి జరుగాలని అన్నారు. నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సాయిల్ కన్జర్వేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ చీఫ్ ఫ్యాట్రన్‌గా ఉపకులపతి డాక్టర్ వీ.ప్రవీణ్ రావు, చైర్మన్‌గా క్రీడాకు చెందిన శాస్తవ్రేత్త డాక్టర్ కే.శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా డాక్టర్ సదాశివ రావు, కార్యదర్శిగా డాక్టర్ మనోజ్ కుమార్ నియమితులయ్యారు. కార్యక్రమంలో క్రీడా సంచాలకులు డాక్టర్ రవీంద్రచారి పాల్గొన్నారు.
చెరువులో గుర్రపుడెక్క, వ్యర్థాల తొలగింపు
ఉప్పల్, మార్చి 25: మీర్‌పేటలోని జిల్లెలగూడ చందన చెరువులో వ్యర్థ పదార్థాలు, గుర్రపుడెక్కను తొలగించే పనులను హెచ్‌ఎండీఏ కమిషనర్, పురపాలక వ్యవహారాల ప్రిన్సిపల్‌ల్ కార్యదర్శి అరవింద్ కుమార్ ప్రారంభించారు. స్థానిక బస్తీల నుండి వచ్చే కాలువల ద్వారా చెరువులలో వచ్చి చేరే ప్లాస్టిక్ వస్తువులు, చెత్తా చెదారంతో చెరువు నీరు కలుషితమవడంతో దోమల వృద్ధి, దుర్ఘంధంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇటీవల చెరువుల నిర్వహణ, కబ్జాదారుల నుండి రక్షించి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో పెద్దఎత్తున చర్యలు చేపట్టామని తెలిపారు. హెచ్‌ఎండీఏ పరిధిలోని 25 చెరువుల పరిరక్షణకు గుర్రపు డెక్కతో పాటు వ్యర్థ పదార్థాలు తొలగించే కార్యక్రమాలను ముమ్మరం చేశామని అన్నారు. ముంబయికి చెందిన క్లీన్‌టెక్ ఇన్ ఫ్రా సంస్థతో రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు.