రంగారెడ్డి

గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేశంపేట, మార్చి 25: గ్రామ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని లింగంధన గ్రామ సర్పంచ్ మయూరి మధుగౌడ్ అన్నారు. సోమవారం కేశంపేట మండల పరిధిలోని లింగంధన గ్రామంలో సర్పంచ్ మయూరి మధుగౌడ్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. సర్పంచ్ మయూరి మధుగౌడ్ మాట్లాడుతూ గ్రామంలో మంచినీటి సమస్యను నిర్మూలించి, ప్రతి ఇంటికి తాగునీరు అందించే విధంగా కృషి చేస్తానని పేఠ్కొన్నారు. గ్రామంలోని వీధి దీపాలు నిత్యం వెలిగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామంలో ఉన్న ప్రతి మురుగు కాల్వను శుభ్రం చేయించే విధంగా చర్యలు తీసుకుంటామని, అలాగే వీలైనంత త్వరగా వీధివీధికి అండర్ డ్రైనేజీ నిర్మాణం పనులు చేపట్టే విధంగా కృషి చేస్తానని వివరించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా చేస్తున్న అభివృద్ధి, సంక్షేమానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. పంచాయతీ కార్యదర్శి ధనుంజయ, ఉపసర్పంచ్ ప్రతాప్, వార్డు సభ్యులు రాములు, గొడుగు యాదయ్య, మంజుల, లింగమ్మ, జయమ్మ పాల్గొన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కారు జోరు
శేరిలింగంపల్లి, మార్చి 25: పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కారు జోరు కొనసాగుతుందని చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి అన్నారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి నామినేషన్ సందర్భంగా సోమవారం కార్పొరేటర్ నవత రెడ్డి ఆధ్వర్యంలో చందానగర్ డివిజన్ నాయకులు గాంధీ విగ్రహం వద్ద నుంచి తరలివెళ్లారు. టీఆర్‌ఎస్ నేత బొబ్బ విజయ్‌రెడ్డి, పారునంది శ్రీకాంత్, పోచయ్య, బిట్ల శ్రీకాంత్ రెడ్డి, సలీం, మేకల అనంత రెడ్డి, మల్లికార్జున్, పీ.హరీష్ రెడ్డి, రాజేందర్, కోటేశ్వర రావు, రమణకుమారి, రాధిక, వినోద రెడ్డి, రైసా, షబానా, కుమారి ఉన్నారు.