రంగారెడ్డి

మొబైల్ సైన్స్ ల్యాబ్ వెహికల్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, ఏప్రిల్ 16: మండలంలోని గౌడవెల్లి గ్రామ పరిధిలోని సైకోరియన్ కృషి హోంలో మంగళవారం అసోసియేషన్ సైకోరియన్ కృషి హోం జనరల్ మేనేజర్ ఈశ్వర రావు (ఐజీ అండ్ చీఫ్ సెక్యురిటీ కమిషనర్ ఇన్ ఆర్‌ఫీఎఫ్ ఇన్ సెక్యురిటీ ఆఫ్ రైల్వే డిపార్ట్‌మెంట్) ముఖ్యఅతిథిగా పాల్గొని మొబైల్ సైన్స్ లాబ్ వాహనాన్ని ప్రారంభించారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థుల్లో సైన్స్ పట్ల అవగాహన కల్పించడానికి వారిని చైతన్య పర్చడానికి దాత డీఎస్‌ఎన్ రాజు వారి కుటుంబం దివంగతులైన కలిదిండి బుచ్చి వెంకట సత్యవతమ్మ జ్ఞాపకార్ధం మొబైల్ సైన్స్ లాబ్ వాహనాన్ని విరాళంగా అందజేశారు. అగస్టా ఫౌండేషన్ వారి సహకారంతో సైన్స్ లాబ్ వాహనాన్ని విరాళంగా అందజేసినట్లు కృషి నిర్వాహకులు డీ.వెంగళ్ రావు వివరించారు. కార్యక్రమంలో ఆగస్త్య ఫౌండేషన్ చైర్మన్ రామ్‌జీ రాఘవన్, కృషి హోం వైస్ ప్రెసిడెంట్ ఎం. బంగారుబాబు, కార్యదర్శి కల్నల్ కేఎస్ రావు, సంచాలకులు కేఎస్‌ఆర్.కుమార్, సైకోరియ్‌న్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా పాలిసెట్ ప్రవేశ పరీక్ష
మేడ్చల్, ఏప్రిల్ 16: పాలిసెట్ - 2019 ప్రవేశ పరీక్ష మేడ్చల్‌లో మంగళవారం ప్రశాంతంగా జరిగిందని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ నర్సయ్య గౌడ్ తెలిపారు. పట్టణంలో 9 కేంద్రాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించినట్లు వివరించారు. మేడ్చల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, హైటెక్ మోడల్ స్కూల్, ప్రభుత్వ ఐటిఐ, ఎన్‌ఎస్‌ఆర్ జూనియర్ కళాశాల, హైటెక్ వాలీ స్కూల్‌లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
2576 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 102 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. అందులో 1584 మంది విద్యార్థులు, 890 మంది విద్యార్థినులు పరీక్షకు హాజరైనట్లు పేర్కొన్నారు. ఆయా పరీక్షా కేంద్రాల వద్ద ఎండాకాలం దృష్ట్యా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు సకల వసతులు సమకూర్చారు. పాలిసెట్ - 2019 ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని ప్రిన్సిపాల్ నర్సయ్య గౌడ్ తెలిపారు.