రంగారెడ్డి

బిందెంగడ్డ తండాలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కులకచర్ల, ఏప్రిల్ 17; కులకచర్ల మండలం బిందెంగడ్డ తండాలో నూతనంగా ప్రతిష్టించి ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే పాల్గొన్నారు. మంగళవారం నుంచి ఇక్కడ కార్యక్రమాలు మొదలైనాయి. బుధవారం స్వామివారి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిగి శాసనసభ్యుడు కొప్పుల మహేశరెడ్డి పాల్గొని పూజలో పాల్గొన్నారు. మండలంలోని గణాపురం పంచాయతీ పరిధిలోని హన్మానాయక్ తండాలో బుధవారం ఆంజనేయ స్వామి విగ్రహా ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. తండా వాసులు పాల్గొని హోమాలు నిర్వహించారు. ప్రతిష్ఠ అనంతరం తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. తండాలో పండగ వాతావరణం కనిపించింది.
పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వాలి
మహేశ్వరం, ఏప్రిల్ 17: మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో గత ఐదు నెలలుగా గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు అందక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే నూతన సర్పంచ్‌లకు చెక్‌పవర్ ఇచ్చి వేతనాలు అందేవిధంగా జిల్లా పంచాయతీ అధికారి, ఈవోఆర్‌డీలు చర్యలు తీసుకోని వేతనాలు అందజేయాలని సీఐటీయు జిల్లా కార్యదర్షి ఏ.రవి కుమార్ డిమాండ్ చేశారు.
ఆరు నెలలుగా ఎన్నికల కోడ్ నూతన సర్పంచ్ వచ్చిన నేటికి చెక్‌పవర్ లేకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని పంచాయతీల్లో ఇళ్లటాక్స్‌లు వసూలు చేసి డబ్బులు నిల్వచేసిన నుంచి డ్రా చేయడానికి అధికారులు కసరత్తు చేయకుండా కాలయాపన చేస్తున్నారని కార్మికులు నెలల తరబడి వేతనాలు లేని కారణంగా అప్పుల పాలవుతున్నారని వెంటనే పంచాయతీ అధికారులు స్పందించి వేతనాలు అందజేయాలని లేకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.