రంగారెడ్డి

మున్సిపాలిటీల్లో మంచినీటి పైప్‌లైన్లు సత్వరమే పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, ఏప్రిల్ 17: నూతనంగా ఏర్పాటైన మున్సిపాలిటీలు నాగారం, దమ్మాయిగూడ, తూంకుంటల్లో మంచినీటి పైప్‌లైన్లు సత్వరమే పూర్తి చేయాలని జల మండలి అధికారులను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆదేశించారు. బుధవారం మంత్రి నివాసంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ వేసవి కాలం రెండు నెలలు రోజు విడిచి రోజు నీటి సరఫరా చేయాలని తెలిపారు. నాగారం, దమ్మాయిగూడల్లో దాదాపు పైప్‌లైన్ పనులు పూర్తి కావచ్చాయని అధికారులు మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. కార్యక్రమంలో జలమండలి అధికారులు జనరల్ మేనేజర్ సునీల్, ప్రాజెక్ట్ అధికారి అమర్‌నాథ్ రెడ్డి, జడ్పీటీసీ రమాదేవి, సర్పంచ్‌లు కే.చంద్రారెడ్డి, అనూరాధ, పంచాయతీ కార్యదర్శులు ఉపేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.