రంగారెడ్డి

సమర్థులైన అభ్యర్థుల అనే్వషణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, ఏప్రిల్ 25: స్థానిక సంస్థల ఎన్నికల్లో సమర్థులైన అభ్యర్థుల కోసం రాజకీయ పార్టీల నాయకులు ముమ్మరంగా అనే్వషణ కొనసాగిస్తున్నారు. ఏప్రిల్ 26వ తేది నుండి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానున్న నేపథ్యంలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు స్థానిక రిటర్నింగ్ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రాజకీయ పార్టీలు తమ పునాదిని పటిష్టం చేసుకునేందుకు కసరత్తు చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదగాలంటే ముందు స్థానిక సంస్థలను కైవసం చేసుకోవాలనే దిశగా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో పరిషత్ ఎన్నికల్లో అభ్యర్థులను ఆచితూచి ఎన్నుకోవాలని నిర్ణయించారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని ఆరు మండలాలైన ఫరూఖ్‌నగర్, కేశంపేట, కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ, నందిగామ, కొత్తూరులలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను రెండవ విడతలో నిర్వహించనున్నారు. కాగా రెండవ విడతలో భాగంగా నేటి నుంచి నామినేషన్ల పర్వం మొదలైంది. ఇప్పటివరకు ఏ ఒక్క పార్టీ కూడా అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు. కొందరు నేతలు మాత్రం ఫలానా పార్టీ బీ-్ఫం తమకేనంటూ ప్రచారం చేస్తుండటంతో మిగతా ఆశావహుల్లో ఒకింత ఆందోళన, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది.
వలసలతో అధికార పార్టీలో పెరిగిన పోటీ
వలస రాజకీయ నాయకులతో అధికార పార్టీలో పోటీ పెరిగిందని చెప్పవచ్చు. అన్ని వర్గాల నాయకులు జడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్లను ఆశిస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి పాలైన నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఎక్కువగా అసక్తి కనబరుస్తున్నారు. భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని పలువురు నేతలు పార్టీలో చేరే క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీటుపై హామీలు తీసుకొని అధికార పార్టీలోకి వచ్చినట్లు తెలుస్తోంది.
ఒకే గ్రామంలో వివిధ పార్టీల్లో ఉన్న నేతలు చివరకు ఒకే గూటికి చేరడంతో ఆ ప్రాంత పరిషత్ స్థానాలను తమకు గానీ తమ వారికి గానీ ఇవ్వాలని ఎక్కువగా పట్టుబడుతున్నారు. ఈ విషయంలో ఎవరిని కాదన్నా.. ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన పార్టీల పెద్దలు.. సర్దిచెప్పే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నట్లు తెలుస్తోంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక విషయంలో గ్రామీణ స్థాయి కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరించిన తరువాతే టికెట్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా వలస వెళ్లిపోవడంతో ఆ పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలు రాజకీయంగా ఎదిగేందుకు మంచి అవకాశంగా భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేత వెళ్లిపోవడంతో అభ్యర్థుల ఎంపిక మండల స్థాయి నేతలకు సమస్యగా మారిందని చెప్పవచ్చు. మండల స్థాయిలో ఉన్న నేతలు మండల పరిషత్ స్థానాలను పంచుకుంటారనే చర్చ జోరుగా కొనసాగుతుంది. మండల కేంద్రాల్లో పలుమార్లు సభలు, సమావేశాలతో పాటు ముఖ్య కార్యకర్తలతో చర్చలు కూడా నిర్వహించారు. కొన్ని స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి రాలేదని చెప్పవచ్చు. ఇన్నాళ్లు పార్టీకి సేవ చేశాను.. ఆర్థిక బలం లేకపోయినంత మాత్రాన నిన్న, మొన్న వచ్చిన వ్యక్తికి హామీ ఇస్తారా? ఇలాగైతే పార్టీ ఓటమి ఖాయమంటూ కొందరు నేతలు బహిరంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజల్లో పలుకుబడి ఉంది.. ఆ స్థానంలో తనకు తప్ప మరెవరికి ఇచ్చినా ఫలితాలు తారుమారు అవుతాయంటూ మరో నేత పరోక్ష హెచ్చరికలు చేస్తుండటంతో టికెట్ల విషయం నేతలకు తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. పార్టీ గుర్తులపై ఎన్నికలు జరుగుతుండటంతో ఆశావహుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ప్రధాన పార్టీల నుంచి బీఫాంలు ఇప్పిస్తే ఎంతో కొంత సమర్పిస్తామనే ఆఫర్ల మాటలు సైతం ఎక్కువగానే వినిపిస్తున్నాయి. సర్పంచి ఎన్నికల్లో ఓడిపోవడంతో ప్రజల్లో సానుభూతి ఉందని భావిస్తున్న నేతలు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అవకాశాల కోసం నేతలు పక్క చూపులు ఎక్కువగానే చూస్తున్నట్లు తెలుస్తోంది. అంగబలం, ఆర్థిక బలం ఉండి.. ప్రజల్లో కొంత సానుభూతి కలిగిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.