రంగారెడ్డి

అక్రమ లేఔట్‌ల తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, ఏప్రిల్ 25: కీసర గ్రామ పంచాయతీ పరిధిలో వెలసిన అక్రమ లేఔట్‌లోని హద్దురాళ్లను జేసీబీ సహాయంతో మండల ఈఓపీఆర్డీ యుగేంధర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి నాగేశ్ తొలగించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కీసర గ్రామ పరిధి సర్వే నెంబర్ 231, 232, అంకిరెడ్డిపల్లి గ్రామ సర్వే నంబర్ 188 లలో వెలసిన అక్రమ లేఔట్‌లలోని హద్దు రాళ్లను, రోడ్లను జేసీబీ సహాయంతో తొలగించారు. అక్రమ లేఔట్‌లు చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిబ్బంది బాలు, బహదూర్ పాల్గొన్నారు.
74 నామినేషన్లలో రెండు నామినేషన్ల తిరస్కారణ
బొంరాస్‌పేట, ఏప్రిల్ 25: ఎంపీటీసీ ఎన్నికల బరిలో దిగేందుకు 74 మంది నామినేషన్లు వేయగా అధికారుల పరిశీలనలో రెండు నామినేషన్లను తిరస్కరించారు. 72 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రేగడి మైలారం గ్రామానికి చెందిన గొల్ల శేఖరయ్యకు ముగ్గురు పిల్లల కారణంగా నామినేషన్‌ను తిరస్కరించగా, సాలిండాపూర్ గ్రామానికి చెందిన రవీనకు వయస్సు తక్కువగా ఉన్న కారణంగా నామినేషను తిరస్కరించారు.
మలేరియాను నిర్మూలించటం అందరి బాధ్యత
అల్వాల్, ఏప్రిల్ 25: మలేరియాను నిర్మూలించటం అందరి బాధ్యత అని అల్వాల్ డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య చెప్పారు. గురువారం ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అల్వాల్‌లో ర్యాల్లీ నిర్వహించారు ర్యాలీని ప్రారంభించిన మాట్లాడుతు ప్రపంచ వ్యాప్తంగా మలేరియా సమస్య ఉందనీ దోమలతో ఆనేక రకాలైన వ్యాధులు వస్తున్నాయని వివరించారు. అల్వాల్ మున్సిపల్ కార్యాలయం నుంచి పుర వీధుల గుండా ఓల్డు అల్వాల్ చౌరస్తావరకు ర్యాల్లీని నిర్వహించారు. శానిటరీ విభాగం, మలేరియా విభాగం అధికారులు అనిల్ కుమార్, వేలు, శ్రీనివాస్ పాల్గొన్నారు.