రంగారెడ్డి

ఇంటర్మీడియట్ ఫలితాలకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెహిదీపట్నం, ఏప్రిల్ 25: ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల అవకతవకలపై బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు జిల్లపల్లి అంజి డిమాండ్ చేశారు. 18మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన, 12లక్షల మంది విద్యార్ధుల జీవితాలు అంధకారానికి కారణమైన ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. 71 సంవత్సరాలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పరీక్ష పేపర్లు దిద్దడం జరిగింది. దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం.. ఒక ప్రైవేట్ ఏజెన్సీకి పరీక్ష జవాబు పత్రాలు వాల్యుయేషన్ చేయించడం వల్ల ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ రాసిన ప్రతి ఒక్క విద్యార్థికి అన్యాయం జరిగిందని తెలిపారు. పేపర్ వాల్యుయేషన్ చేసే అభ్యర్థులకు ఎలాంటి విద్యార్హతలు ఉన్నాయో లేవో తెలుసుకోకుండా పేవర్ వాల్యుయేషన్ చేయించారని, తద్వారా 12లక్షల మంది విద్యార్థులకు అన్యాయం జరిగిందని అన్నారు. ప్రైవేట్ ఏజెన్సీల దగ్గర కోట్ల రూపాయాలు తీసుకొని వారికి పేపర్ వాల్యుయేషన్ అధికారాన్ని ఇవ్వడం క్షమించరాని నేరంగా గుర్తించి సంబంధిత అధికారులను సస్పెండ్ చేసి సిట్టింగ్ హైకోర్టు ఎన్ని చివాట్లు పెట్టినా, విద్యార్థులకు అన్యాయం జరిగితే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు జిల్లపల్లి అంజి డిమాండ్ చేశారు.