రంగారెడ్డి

శాంతిభద్రతలకు విఘాతం కలిగించద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 25: పరిషత్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా నడుచుకోవాలని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ పిలుపునిచ్చారు. గురువారం మండల పరిధిలోని చర్లపటేల్‌గూడ గ్రామ సమీపంలోని రాజమహేంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్నికల లెక్కింపు కేంద్రాన్ని, అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. కమిషనర్ మహేష్ భగవత్ మాట్లాడుతూ ఎన్నికలను సామరస్యపూర్వకంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాలతో పాటు లక్కింపు కేంద్రం వద్ద భారీ బందోబస్తూ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. విద్వేశాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేసిన నేతలపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. శాంతిభధ్రతలకు విఘాతం కలిగిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఏసీపీ మల్లారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎంపీడీఓ గుత్తా నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
చైల్డ్ హోమ్‌కు బాల కార్మికులు
జీడిమెట్ల, ఏప్రిల్ 25: ఇద్దరు బాల కార్మికులను పట్టుకుని చైల్డ్ హోమ్‌కు చైల్డ్ హెల్ప్ లైన్ బృందం సభ్యులు తరలించారు. జగద్గిరిగుట్ట డివిజన్ సంజయ్ గాంధీ నగర్‌లోని ఓ మైకానిక్ షాపులో పనిచేస్తున్న ఇద్దరు బాలురను చైల్డ్ హోమ్ బృందం సభ్యులు సౌజన్య, భానుప్రకాష్ పట్టుకున్నారు. జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించి పంచనామా చేసి ఇద్దరు బాల కార్మికులను చైల్డ్ హోమ్‌కు తరలించారు.